
అధిష్టానమే మాకు ముఖ్యమంత్రి: జానారెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే తమకు ముఖ్యమంత్రి అని మంత్రి జానారెడ్ది అన్నారు. విభజన విషయంలో అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. విభజనకు అన్ని పక్షాలు సహకరించాలని జానారెడ్డి కోరారు.
విభజన ప్రక్రియ కీలక దశలో ఉండగా కొందరు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. విభజన అనేది తండ్రి, ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించిందని చెప్పారు. విభజనను వ్యతిరేకించేవారు ముందుగా వారి వద్ద ఉన్న ప్రణాళిక తెలియజేయాలన్నారు.