ఏఐసీసీ భేటీకి రాలేను! హైకమాండ్‌కు సీఎం విజ్ఞప్తి | kiran kumar reddy request not attending to aicc meeting | Sakshi
Sakshi News home page

ఏఐసీసీ భేటీకి రాలేను! హైకమాండ్‌కు సీఎం విజ్ఞప్తి

Published Mon, Jan 13 2014 1:45 AM | Last Updated on Mon, Aug 13 2018 4:01 PM

kiran kumar reddy request not attending to aicc meeting

 సాక్షి, హైదరాబాద్: ఈనెల 17న ఢిల్లీలో జరిగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశానికి హాజరయ్యే విషయంలో తనకు మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కోరారు. శాసనసభా నాయకుడిగా ఉంటూ కీలకమైన విభజన బిల్లుపై సభలో చర్చ కొనసాగుతున్న సమయంలో ఢిల్లీ వెళ్లడం తప్పుడు సంకేతాలు ఇస్తుందని ఆయన వారికి చెప్పినట్టు సమాచారం. ఏఐసీసీ సమావేశాల కోసం 17న అసెంబ్లీకి సెలవు ఇవ్వాలని భావించినా ఢిల్లీ పెద్దల సూచనల మేరకు ఆరోజు సభ జరపాలని సీఎం కోరినట్లు తెలిసింది. సీఎం విజ్ఞప్తిపై హైకమాండ్ స్పందనను బట్టి కిరణ్ ఢిల్లీ ప్రయాణం ఆధారపడి ఉందని ఆయన సన్నిహితులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement