
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం పడిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపఎన్నిక ఓటమిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వాన్ని అధిష్టానం ఆదేశించింది. ఈ నెల 13న పీసీసీ నేతలు ఢిల్లీకి రావాలంటూ టీ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. కాగా, ఉప ఎన్నిక ఓటమిపై ఇప్పటికే అదిష్టానం కమిటీ వేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment