
అధిష్టానంకు తలవంచుతూనే సమైక్యవాదం: మంత్రి ఆనం
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడుతూనే సమైక్యవాదం వినిపిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి రఘువీరా రెడ్డి మంత్రి ఆనంతో సమావేశమై విభజన అంశంపై చర్చించారు.
అనంతరం మంత్రి ఆనం మాట్లాడుతూ శాసనసభలో తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు ప్రాంతాలకు అనుగుణంగా ఎవరి అభిప్రాయాలు చెప్పాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లు తెలిపారు. శాసనసభలో తమ అభిప్రాయాలు చెబుతామన్నారు.