
సబ్బం హరి
విశాఖపట్నం: రాష్ట్ర విభజన అంశం ఆగిపోతుందనే సంకేతాలు వస్తున్నాయని ఎంపీ సబ్బం హరి చెప్పారు. అధిష్టానంపై సీమాంధ్ర నేతలు ఒత్తిడి చేయడానికి ఇదే మంచి తరుణం అని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు హరి తెలిపారు.
హైదరాబాద్ విషయంలో టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ కోసం పాటుపడలేదన్నారు. స్వప్రయోజనాలకే తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుంటున్నట్లు ఆరోపించారు. హైదరాబాద్ నుంచి వెళ్లిపోమ్మని చెప్పడానికి కేసీఆర్ ఎవరు? అని ప్రశ్నించారు. హైదరాబాద్ అందరిదని హరి అన్నారు.