తమ్మిడిహెట్టి నీటి లభ్యతపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులోని తమ్మిడిహెట్టి వద్ద ఏడేళ్ల కింద 160 టీఎంసీలుగా ఉన్న గోదావరి జలాల నీటి లభ్యత.. తర్వాతి కాలంలో ఎక్కడికి పోయిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్‌స ప్రశ్నించింది. 2007లో ఇంజనీర్లు, సలహాదారులు అన్ని విషయాలను లోతుగా అధ్యయనం చేసి నీటి లభ్యతపై నివేదికలు ఇచ్చారని, ప్రస్తుతం అదే ఇంజనీర్లు, సలహాదారులు నీటి లభ్యత లేదంటూ మరో నివేదిక ఇవ్వడం విడ్డూరంగా ఉందంది. ఈ ఏడేళ్లలో ప్రాణహిత కింద రూ.12,333 కోట్లు ఖర్చు చేశారని, రూ.1,937 కోట్లు కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద ఇచ్చారని, ఇవన్నీ ఇప్పుడు వృథా అయ్యాయని ఆరోపించింది. ప్రజాధనం వృథా అవ్వడానికి కారకులైన ఇంజనీర్లు, ప్రభుత్వ కార్యదర్శులు, సలహాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఆర్థిక దుర్వినియోగంపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో, లేదా ఉన్నత స్థారుు కమిటీతో విచారణ చేపట్టాలని కోరింది. మంగళవారం ఈ మేరకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్‌స అధ్యక్షుడు జస్టిస్ రెడ్డప్ప రెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ రావు చెలికాని, కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి విలేకరుల సమావేశంలో మట్లాడారు. ప్రభుత్వం ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్, దుమ్ముగూడె టెరుుల్‌పాండ్‌ల పనులను రూ.వేల కోట్లతో ఆరంభించి మధ్యలో నిలిపివేసిందని, దీని వల్ల రూ.2,250 కోట్లు వృథా అయ్యాయని తెలిపారు. మొత్తంగా ఇంజనీర్ల తప్పుడు నిర్ణయాలతో రూ.14,483 కోట్లు వృథా చేశారని ఆరోపించారు.
అవసరమున్నా లేకున్నా అడ్వాన్సులు
అవసరమున్నా లేకున్నా ఇంజనీర్లు మొబిలైజేషన్ అడ్వాన్సుకు రికమండ్ చేయడం, దానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆమోదం తెలపడం ద్వారా అన్ని ప్రాజెక్టులకు కలిపి మొత్తంగా రూ.3,644 కోట్లు అడ్వాన్సులుగా ఇచ్చారని, ఇందులో రూ.2,735 కోట్లు తిరిగి రాబట్టగా.. రూ.909 కోట్లు మొండి బకారుుగా ఉందని తెలిపారు.
నీటి లభ్యత ఇప్పుడేమైంది..?
Published Wed, Dec 7 2016 3:11 AM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM
Advertisement
Advertisement