సాక్షి, హైదరాబాద్ : గత రెండేళ్లలో 12 డ్రగ్స్ కేసులు నమోదైనట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ తెలిపింది. 12 కేసుల్లో 8 కేసుల్లోనే చార్జిషీట్ నమోదు చేసినట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన ఆర్టీఐకు ఎక్సైజ్‌శాఖ సమాధానమిచ్చింది. టాలీవుడ్‌కు సంబంధించిన 4 కేసులపై ఎక్సైజ్‌శాఖ సమాచారం ఇవ్వకపోగా.. దాఖలు చేసిన 8 చార్జిషీట్లలో సంచలన అంశాలు వెల్లడించింది. ఈ క్రమంలో హైదరాబాద్ డ్రగ్స్ దందా ఖండాంతరాలు దాటినట్లు వెల్లడైంది. (రియాకు మద్దతుగా కాంగ్రెస్ ర్యాలీ)
జర్మనీ, బ్రిటన్, ఇంగ్లాండ్‌ల నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ సప్లై అవుతోంది. విదేశాల నుంచి స్టీల్ బౌల్స్ పేరుతో కొకైన్, ఎల్‌ఎస్‌డీ www.ipsld.lo వెబ్‌సైట్ ద్వారా స్టూడెంట్స్ డ్రగ్స్ బుకింగ్ చేస్తున్నట్లు వెల్లడి. సికింద్రాబాద్ మోండా మార్కెట్ మహేశ్వర ఫార్మాలో సైతం డ్రగ్స్ అమ్మకాలు జరుగుతన్నట్లు తేలింది. ఈ ఎనిమిది చార్జిషీట్లలో కాలేజీ స్టూడెంట్స్‌తో పాటు ప్రముఖుల పేర్లు ఉన్నట్లు తేలింది. సంచలనం సృష్టించిన టాలీవుడ్ కేసులో 72 మంది పేర్లు ఉండగా, విచారణకు హాజరైన 12 మందితో మరో 60 మంది జాబితాను వెల్లడించింది. (ప్రభుత్వ ఖజానా నింపుకునేందుకే: బీజేపీ)
Comments
Please login to add a commentAdd a comment