జీహెచ్ఎంసీ అభ్యర్థుల్లో 72మందికి నేర చరిత్ర
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గట్టి షాక్ తగిలే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో నేర చరిత్ర కలిగిన అభ్యర్థుల జాబితాను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ విడుదల చేసింది. 51 డివిజన్లలో 72మంది అభ్యర్థులకు నేర చరిత్ర ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది.
అందులో 64మంది పురుషులు ఉండగా.. 8మంది మహిళలు ఉన్నట్లు పేర్కొంది. టీడీపీ నుంచి 13మంది, టీఆర్ఎస్ నుంచి 14 మంది, బీజేపీ నుంచి నలుగురు, ఎంఐఎంలో 11మంది, ఎంబీటీలో ఇద్దరు, ఇతర పార్టీల వారు నలుగురు, స్వతంత్ర్య అభ్యర్థులు 11మంది నేర చరిత్ర గలవారు ఉన్నట్లు ఆ సంస్థ వివరించింది.