GHMC elections 2016
-
చిల్లర వరాలు
-
తెలంగాణ టీడీపీకి ఝలక్!
► టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే వివేక్ ► ఒకటి రెండు రోజుల్లో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ► దాదాపుగా ఖాళీ అవుతున్న టీ-టీడీపీ హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ తగిలింది. గ్రేటర్ పరిధిలో పార్టీ కీలకనేతగా పేరున్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ సీఎం కె. చంద్రశేఖర్ రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆయన చంద్రబాబుకు తన రాజీనామా లేఖ పంపారు. టీడీపీ కార్యాలయానికి కూడా లేఖ పంపినట్లు తెలుస్తోంది. ముందుగా కొంతసేపు సీఎంతో భేటీ అయ్యి.. ఆ తర్వాత పార్టీలో చేరారు. ఆయనతో పాటు మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా రాబోయే ఒకటి రెండు రోజుల్లో టీఆర్ఎస్లో చేరుతారని విశ్వసనీయ సమాచారం. మరికొందరు ముఖ్యనేతల పేర్లు కూడా తెరమీదకు వస్తున్నాయి. ఎవరూ ఊహించని నేతలు కూడా టీఆర్ఎస్లో చేరుతారని అంటున్నారు. ఇదే జరిగితే.. ఇక తెలంగాణలో టీడీపీ దాదాపుగా ఖాళీ అవుతుందని, కేవలం నలుగురైదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీలో మిగిలే అవకాశం ఉందని కొందరు నాయకులు అంటున్నారు. తెలంగాణలో మనుగడ సాగించాలంటే తాము టీడీపీలో ఉండలేమన్నది ఆ నాయకుల భావనగా కనిపిస్తోంది. బాబు సీఎం అయిన తర్వాత.. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి చెబుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తాను ఆకర్షితుడినయ్యానని ఎమ్మెల్యే వివేకానంద చెప్పారు. ప్రజలు అన్ని వర్గాలు, కులాలు, ప్రాంతాలకు అతీతంగా ఆయనకు మద్దతు ఇస్తున్నారని, అందుకే తాను కూడా ఆయన వెంట వెళ్లాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. గతంలో కూడా తాను ఆయనతో కలిసి పనిచేశానని, ఆయన నాయకత్వంతో పనిచేస్తే ప్రజలకు కూడా న్యాయం చేసినట్లు అవుతుందని భావించి పార్టీలో చేరానని అన్నారు. టీడీపీ కూడా మంచి పార్టీయేనని, అయితే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అయిన తర్వాత తెలంగాణలో పార్టీ పరిస్థితి గురించి కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. తెలంగాణలో సమస్యలున్నా.. బాబు మాత్రం ఏపీకే పరిమితం అయ్యారన్నారు. కేసీఆర్ నాయకత్వం బాగుందని కార్యకర్తలు కూడా అంటున్నారన్నారు. -
వాళ్లలా ఫిరాయింపులు ప్రోత్సహించలేకపోయాం
గ్రేటర్ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. గెలుపు ఓటములను విశ్లేషించుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేదంటే నిలదీస్తామని ఆయన అన్నారు. టీఆర్ఎస్లా తాము పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలేకపోయామని, అధికార దుర్వినియోగానికి పాల్పడలేకపోయామని, అందుకే గెలుపు కూడా సాధించలేకపోయామని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
గ్రేటర్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నా
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల దారుణ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు దానం నాగేందర్ ప్రకటించారు. ఎన్నికల ఓటమి అనంతరం శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. తన రాజీనామాను ఆదివారం నాడు పీసీసీకి, దిగ్విజయ్ సింగ్‌కు పంపుతున్నట్లు చెప్పారు. ప్రజలు తమను విశ్వసించలేదని.. టీఆర్ఎస్ను బాగా విశ్వసించారని చెప్పారు. ఇంత పెద్ద మాండేట్ రావడం కనీ వినీ ఎరుగమని ఆయన అన్నారు. ప్రజలు వాళ్లను, వాళ్లు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోను నమ్మారన్నారు. టీఆర్ఎస్ తమ మేనిఫెస్టోలో చెప్పిన డబుల్ బెడ్రూం ఇళ్లు, ఉచిత కరెంటు, నీటి బిల్లుల మాఫీ, 24 గంటల కరెంటు, హైదరాబాద్ నలుమూలలా ఆరు వెయ్యి పడకల ఆస్పత్రులు.. ఇవన్నీ స్వాగతించాల్సిన విషయాలే, వాటిని స్వాగతిస్తున్నామని అన్నారు. తాము ఇక మీదట నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని, కేవలం విమర్శలకే పరిమితం కాకుండా.. వాళ్లిచ్చిన వాగ్దానాలను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంటామని చెప్పారు. వాటిని అమలు చేయలేకపోతే కారణాలేంటో చెప్పాల్సిన బాద్యత వాళ్లకు ఉంటుందని అన్నారు. నాకు బాధ్యత ఇవ్వలేదు గానీ.. ఇక తనకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించకపోయినా, ఈ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ గ్రేటర్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు దానం నాగేందర్ చెప్పారు. ఇన్నాళ్లూ ఇచ్చిన అవకాశాలకు ధన్యవాదాలని.. ఇక సామాన్య కార్యకర్తగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాలను పార్టీకి దూరం చేసుకుంటున్నామని అధిష్ఠానానికి తాను ముందు నుంచి చెబుతూనే ఉన్నానన్నారు. ఈ తీర్పు రావడానికి కూడా అదే ప్రధాన కారణమని భావిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల విశ్వసనీయతను కోల్పోయిందని భావిస్తున్నానన్నారు. గ్రూపు తగాదాల వల్ల ఈ రోజు జరిగిన నష్టం చాలా తీవ్రమని అన్నారు. పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నామని.. దీనివల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని తాను చాలాసార్లు చెప్పానని తెలిపారు. ఓడిపోతున్నట్లు అభ్యర్థులకు ముందే చెప్పా ఎన్నికలు ముగిసిన తర్వాతే.. మనమంతా ఓడిపోతున్నామని అభ్యర్థులందరికీ చెప్పానని దానం నాగేందర్ అన్నారు. అప్పటికే ప్రజల మూడ్ చూస్తే విషయం స్పష్టంగా అర్థమైపోయిందని చెప్పారు. హైదరాబాద్ ప్రజలు చాలా తెలివిగా ఓట్లు వేశారని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ తప్ప వేరే పార్టీకి చెందిన మేయర్ వస్తే నగర అభివృద్ధి కుంటుపడుతుందేమోనన్న ఆలోచనతో ఓట్లు వేశారని, వాళ్లందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. 1983లో టీడీపీ పెట్టినప్పుడు మొత్తం రాష్ట్రం స్వీప్ అయ్యిందని, తాము అతి కొద్దిమందిమే గెలిచినా మనోధైర్యాన్ని కోల్పోలేదని ఆయన చెప్పారు. హైదరాబాద్ విశ్వనగరం కావాలని కోరుకునేవాళ్లలో తాము కూడా ఉంటామని, ఆ హామీని వాళ్లు విస్మరించినప్పుడు ఎప్పటికప్పుడు గుర్తుచేస్తుంటామని తెలిపారు. -
ప్రభంజనాల్లోనూ గెలవడం మాకు అలవాటే
ఎవరి ప్రభంజనం ఉన్నా విజయం సాధించడం ఎంఐఎంకు ముందునుంచి అలవాటేనని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలలో మొత్తం 44 డివిజన్లలో విజయం సాధించామంటూ ఆయన శుక్రవారం రాత్రి ట్వీట్ చేశారు. ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు, నరేంద్రమోదీల ప్రభంజనం సాగినప్పుడు కూడా తాము గెలిచామని.. అలాగే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభంజనాన్ని సైతం ఎదురొడ్డి నిలిచి 44 డివిజన్లలో విజయం సాధించామని ఆయన అన్నారు. అలాగే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రీపోలింగ్ జరిగిన ఏకైక డివిజన్ పురానాపూల్‌లో విజయం సాధించడం పట్ల కూడా ఆయన హర్షం వ్యక్తం చేశారు. పురానాపూల్‌లో ఎంఐఎం తరఫున హిందూ అభ్యర్థి పోటీ చేశారని.. ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ముస్లిం అభ్యర్థిపై గెలిచి.. అసలైన లౌకిక వాదాన్ని నిరూపించారని అసదుద్దీన్ మరో ట్వీట్లో వ్యాఖ్యానించారు. MIM tally 44 wards.This party has a record & History of winning even during a Wave of Pol party withstood Indira,NTR,NAIDU,Modi now TRS Wave — Asaduddin Owaisi (@asadowaisi) February 5, 2016 Subhanallah MIM won PURANAPUL thank you voters of PURANAPUL Hindu candidate of MIM won over Congress Muslim candidate VICTORY Secularism — Asaduddin Owaisi (@asadowaisi) February 5, 2016 -
డివిజన్ల వారీగా ఫలితాలు ఇవీ..
డివిజన్ నెంబరు డివిజన్ పేరు గెలిచిన అభ్యర్థి పార్టీ మెజారిటీ 1 కాప్రా స్వర్ణరాజు శివమణి టీఆర్ఎస్ 5029 2 ఏఎస్ రావు నగర్ పావని రెడ్డి టీఆర్ఎస్ 1366 3 చర్లపల్లి బొంతు రామ్మోహన్ రావు టీఆర్ఎస్ 7869 4 మీర్ పేట్ హెచ్ బీ గొల్లూరి అంజయ్య టీఆర్ఎస్ 5707 5 మల్లాపుర్ దేవేందర్ రెడ్డి టీఆర్ఎస్ 7989 6 నాచారం శాంతి కాంగ్రెస్ 152 7 చిలకానగర్ సరస్వతి టీఆర్ఎస్ 7982 8 హబ్సిగూడ స్వప్న సుభాష్ రెడ్డి టీఆర్ఎస్ 7468 9 రామాంతపూర్ (ఈస్ట్) జ్యోస్నా నాగేశ్వరరావు టీఆర్ఎస్ 5157 10 ఉప్పల్ అనలా రెడ్డి టీఆర్ఎస్ 1148 11 నాగోల్ సంగీత ప్రశాంత్ గౌడ్ టీఆర్ఎస్ 6077 12 మన్సూర్ బాద్ విఠల్ రెడ్డి టీఆర్ఎస్ 5949 13 హయత్ నగర్ తిరుమల్ రెడ్డి టీఆర్ఎస్ 2773 14 బీఎన్ రెడ్డి నగర్ లక్ష్మీ ప్రసన్న గౌడ్ టీఆర్ఎస్ 6559 15 వనస్థలిపురం రాజశేఖర్ రెడ్డి టీఆర్ఎస్ 8281 16 హస్తినాపురం పద్మా నాయక్ టీఆర్ఎస్ 9118 17 చంపాపేట్ రమణా రెడ్డి టీఆర్ఎస్ 146 18 లింగోజిగూడ శ్రీనివాస రావు టీఆర్ఎస్ 7331 19 సరూర్ నగర్ అనితా దయాకర్ రెడ్డి టీఆర్ఎస్ 6211 20 ఆర్ కే పురం రాధారెడ్డి బీజేపీ 1962 21 కొత్తపేట్ సాగర్ రెడ్డి టీఆర్ఎస్ 5198 22 చైతన్యపురి జీ విఠల్ రెడ్డి టీఆర్ఎస్ 4505 23 గడ్డిఅన్నారం ప్రవీణ్ ముదిరాజ్ టీఆర్ఎస్ 6132 24 సైదాబాద్ సింగిరెడ్డి స్వర్ణ లతా రెడ్డి టీఆర్ఎస్ 8277 25 ముసారాంబాగ్ తీగల సునీతా రెడ్డి టీఆర్ఎస్ 5714 26 ఓల్డ్ మలక్ పేట్ అంజూమ్ ఫాతిమా ఎంఐఎం 2741 27 అక్బర్ బాగ్ సయ్యద్ మిన్హారుద్దీన్ ఎంఐఎం 781 28 అజామ్ పురా ఆయేషా జహన్ నసీం ఎంఐఎం 1571 29 చవానీ మహ్మద్ మూర్తజా అలీ ఎంఐఎం 9339 30 డబీర్ పురా రియాజ్ ఉల్ హసన్ ఎంఐఎం 6473 31 రెయిన్ బజార్ వాజిద్ అలీ ఖాన్ ఎంఐఎం 8099 32 ఫత్తార్ ఘాట్ సయ్యద్ సోహైల్ ఖద్రీ ఎంఐఎం 13151 33 మొఘల్ పురా అమ్తల్ అలీ ఎంఐఎం 6163 34 తలాబ్ చన్ చలం నస్రీన్ సుల్తానా ఎంఐఎం 11495 35 గౌలిపురా ఆలె లలిత బీజేపీ 1434 36 లలితాబాగ్ అలీ షరీఫ్ ఎంఐఎం 3043 37 కుర్మాగూడ సమీనా బేగం ఎంఐఎం 4210 38 ఐఎస్ సదన్ స్వప్న సుందర్ రెడ్డి టీఆర్ఎస్ 11401 39 సంతోష్ నగర్ ముజాఫర్ హుస్సేన్ ఎంఐఎం 9021 40 రియాసత్ నగర్ ముస్తఫాబేగ్ ఎంఐఎం 4221 41 కాంచన్ బాగ్ రేష్మా ఫాతిమా ఎంఐఎం 6293 42 బార్కాస్ షబానా బేగం ఎంఐఎం 6893 43 చాంద్రాయాణగుట్ట అబ్దుల్ వాహెబ్ ఎంఐఎం 5763 44 ఉప్పుగూడ అబ్దుల్ సమీద్ బిన్ అబ్ద్ ఎంఐఎం 4238 45 జంగం మెట్ అబ్దుల్ రెహ్మాన్ ఎంఐఎం 1197 46 ఫలక్ నుమా తారాబాయ్ ఎంఐఎం 11387 47 నవాబ్ సాహెబ్ కుంట ష్రీన్ ఖాతున్ ఎంఐఎం 11956 48 శాలిబండ ముస్తఫా ఆలీ ఎంఐఎం 7198 49 ఘన్సీ బజార్ రేణు సోని బీజేపీ 859 50 బేగంబజార్ శంకర్ యాదవ్ బీజేపీ 7435 51 గోషామహల్ ముఖేశ్ సింగ్ టీఆర్ఎస్ 78 52 పురానా పూల్ రాజమోహన్ ఎంఐఎం 2878 53 దూద్‌బౌలి గఫార్ ఎంఐఎం 7596 54 జహనుమా ఖాజ ముబాషీరుద్దీన్ ఎంఐఎం 13718 55 రామ్నాస్ పురా మహ్మద్ ముబెన్ ఎంఐఎం 12550 56 కిషన్‌బాగ్ మహ్మద్ సలీం ఎంఐఎం 8288 57 సులేమాన్ నగర్ అబీదా సుల్తానా ఎంఐఎం 12980 58 శాస్త్రిపురం మిసబ్ ఉద్దీన్ ఎంఐఎం 9349 59 మైలార్‌దేవ్‌పల్లి టీ.శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ 5474 60 రాజేంద్రనగర్ కే. శ్రీలత టీఆర్ఎస్ 3998 61 అత్తాపూర్ విజయ్ జంగయ్య టీఆర్ఎస్ 7774 62 జియాగూడ కృష్ణ టీఆర్ఎస్ 3762 63 మంగళ్‌హట్ పరమేశ్వరి సింగ్ టీఆర్ఎస్ 9376 64 దత్తాత్రేయ నగర్ యూసఫ్ ఎంఐఎం 9376 65 కార్వాన్ రాజేందర్ యాదవ్ ఎంఐఎం 573 66 లంగర్‌హౌస్ అమీనా బేగం ఎంఐఎం 302 67 గోల్కొండ హఫ్పియా హనీఫ్ ఎంఐఎం 9385 68 టోలీ చౌకి ఆయేషా హుమ్రా ఎంఐఎం 8982 69 నానల్‌నగర్ నస్రీద్దీన్ ఎంఐఎం 6015 70 మెహిదీపట్నం మాజిద్ హుస్సేన్ ఎంఐఎం 3126 71 గుడిమల్కాపూర్ బంగారి ప్రకాశ్ టీఆర్ఎస్ 5568 72 ఆసిఫ్‌నగర్ ఫాతిమా అంజూం ఎంఐఎం 4782 73 విజయ్ నగర్ సల్మా అమీన్ ఎంఐఎం 2286 74 అహ్మద్‌నగర్ ఆయేషా రుబీనా ఎంఐఎం 6647 75 రెడ్‌హిల్స్ ఆయేషా ఫాతిమా ఎంఐఎం 1237 76 మల్లేపల్లి తర్నుమ్ నాజ్ ఎంఐఎం 4560 77 జాంబాగ్ మోహన్ ఎంఐఎం 5 78 గన్‌ఫౌండ్రీ మమతా గుప్తా టీఆర్ఎస్ 3353 79 హిమాయత్‌నగర్ హేమలత యాదవ్ టీఆర్ఎస్ 1691 80 కాచిగూడ చైతన్య కన్నా యాదవ్ టీఆర్ఎస్ 1811 81 నల్లకుంట శ్రీదేవి టీఆర్ఎస్ 10426 82 గోల్నాక కాలేరు పద్మ టీఆర్ఎస్ 5967 83 అంబర్‌పేట పులి జగన్ టీఆర్ఎస్ 1505 84 బాగ్ అంబర్‌పేట పద్మావతి డి.పి రెడ్డి టీఆర్ఎస్ 4870 85 అడిక్‌మెట్ హేమలత టీఆర్ఎస్ 6350 86 ముషీరాబాద్ భాగ్యలక్ష్మి యాదవ్ టీఆర్ఎస్ 4121 87 రాంనగర్ వీ.శ్రీనివాస రెడ్డి టీఆర్ఎస్ 11503 88 భోలక్‌పూర్ మహమ్మద్ అఖిల్ అహ్మద్ ఎంఐఎం 2909 89 గాంధీనగర్ పద్మా నరేశ్ టీఆర్ఎస్ 5104 90 కవాడిగూడ లాస్య నందిత టీఆర్ఎస్ 11388 91 ఖైరతాబాద్ పి. విజయా రెడ్డి టీఆర్ఎస్ 12373 92 వెంకటేశ్వరకాలనీ కవితా గోవర్దన్ రెడ్డి టీఆర్ఎస్ 8181 93 బంజారాహిల్స్ గద్వాల్ విజయ లక్ష్మి టీఆర్ఎస్ 7507 94 షేక్‌పేట రషీద్ ఫరజుద్దీన్ ఎంఐఎం 658 95 జూబ్లీహిల్స్ కాజసూర్యనారాయణ టీఆర్ఎస్ 4039 96 యూసుఫ్‌గూడ సంజయ్ గౌడ్ టీఆర్ఎస్ 264 97 సోమాజిగూడ విజయలక్ష్మి టీఆర్ఎస్ 3515 98 అమీర్‌పేట శేషు కుమారి టీఆర్ఎస్ 2555 99 వెంగళ్రావునగర్ మనోహర్ టీఆర్ఎస్ 1183 100 సనత్‌నగర్ లక్ష్మి బాల్ రెడ్డి టీఆర్ఎస్ 4058 101 ఎర్రగడ్డ షహీనా బేగం ఎంఐఎం 951 102 రహ్మత్‌నగర్ ఎం.ఎ షఫి టీఆర్ఎస్ 2330 103 బోరబండ బాబా ఫసీవుద్దీన్ టీఆర్ఎస్ 4511 104 కొండాపూర్ హమీద్ పటేల్ టీఆర్ఎస్ 7334 105 గచ్చిబౌలి సాయిబాబా టీఆర్ఎస్ 5860 106 శేరిలింగంపల్లి నరేంద్ర యాదవ్ టీఆర్ఎస్ 8643 107 మాదాపూర్ వి.జగదీశ్ గౌడ్ టీఆర్ఎస్ 6005 108 మియాపూర్ మేకా రమేశ్ టీఆర్ఎస్ 1030 109 హఫీజ్‌పేట పూజిత జగదీష్ గౌడ్ టీఆర్ఎస్ 8619 110 చందానగర్ నవతా రెడ్డి టీఆర్ఎస్ 2831 111 భారతి నగర్ సింధు ఆదర్శ్ రెడ్డి టీఆర్ఎస్ 168 112 రామ చంద్రాపురం అంజయ్య టీఆర్ఎస్ 5591 113 పటాన్‌చెఱు శంకర్ యాదవ్ కాంగ్రెస్ 1386 114 కేపీహెచ్‌బీ కాలనీ శ్రీనివాస రావు టీడీపీ 2735 115 బాలాజీనగర్ కావ్యా రెడ్డి టీఆర్ఎస్ 5349 116 అల్లాపూర్ సబీహా బేగం టీఆర్ఎస్ 4772 117 మూసాపేట టీ. శ్రావణ్ కుమార్ టీఆర్ఎస్ 4050 118 ఫతేనగర్ సతీష్ బాబు టీఆర్ఎస్ 5415 119 ఓల్డ్ బోయిన్పల్లి నర్సింగ్ యాదవ్ టీఆర్ఎస్ 8092 120 బాలానగర్ నరేంద్ర చారి టీఆర్ఎస్ 8820 121 కూకట్పల్లి జూపల్లి సత్యనారాయణ రావు టీఆర్ఎస్ 8998 122 వివేకానందనగర్ లక్ష్మీ బాయి టీఆర్ఎస్ 1492 123 హైదర్‌నగర్ జానకీ రామరాజు టీఆర్ఎస్ 439 124 ఆల్విన్‌కాలనీ వెంకటేశ్ గౌడ్ టీఆర్ఎస్ 4282 125 గాజులరామారం శేషగిరి టీఆర్ఎస్ 9480 126 జగద్గిరిగుట్ట కొలుకుల జగన్ టీఆర్ఎస్ 5559 127 రంగారెడ్డినగర్ విజయ శేఖర్ గౌడ్ టీఆర్ఎస్ 8601 128 చింతల్ రషీదా బేగం టీఆర్ఎస్ 4763 129 సూరారం సత్యనారాయణ టీఆర్ఎస్ 4660 130 సుభాష్‌నగర్ శాంతి రాజశ్రీ రాజేందర్ రెడ్డి టీఆర్ఎస్ 8895 131 కుత్బుల్లాపూర్ కూన గౌరీశ్ పారిజాత టీఆర్ఎస్ 1729 132 జీడిమెట్ల పద్మా ప్రతాప్ గౌడ్ టీఆర్ఎస్ 3614 133 మచ్చబొల్లారం జితేంద్ర నాథ్ టీఆర్ఎస్ 9354 134 అల్వాల్ విజయ శాంతి రెడ్డి టీఆర్ఎస్ 7733 135 వెంకటాపురం సబితా కిషోర్ టీఆర్ఎస్ 7544 136 నేరెడ్మెట్ కటిక నేని శ్రీదేవి టీఆర్ఎస్ 7137 137 వినాయకనగర్ పుష్పలతా రెడ్డి టీఆర్ఎస్ 8655 138 మౌలాలి ఫాతిమా అమీనుద్దీన్ టీఆర్ఎస్ 1962 139 ఈస్ట్ ఆనంద్‌బాగ్ ఆకుల నర్సింగ్ రావు టీఆర్ఎస్ 6707 140 మల్కాజిగిరి జగదీష్ గౌడ్ టీఆర్ఎస్ 4367 141 గౌతమ్‌నగర్ శిరీషా జితేందర్ రెడ్డి టీఆర్ఎస్ 6807 142 అడ్డగుట్ట విజయ కుమారి టీఆర్ఎస్ 1921 143 తార్నాక సరస్వతి హరి టీఆర్ఎస్ 12941 144 మెట్టుగూడ భార్గవి టీఆర్ఎస్ 8029 145 సీతాఫల్మండి హేమ టీఆర్ఎస్ 15071 146 బౌద్ధనగర్ ధనుంజయ్ దయానంద్ గౌడ్ టీఆర్ఎస్ 9681 147 బన్సీలాల్‌పేట హేమలత టీఆర్ఎస్ 5908 148 రాంగోపాల్‌పేట అరుణా గౌడ్ టీఆర్ఎస్ 6499 149 బేగంపేట తరుణి నాయి టీఆర్ఎస్ 5751 150 మోండామార్కెట్ ఆకుల రూప హరికృష్ణ టీఆర్ఎస్ 6262 -
శివార్లలోనూ క్లీన్ స్వీప్!
జీహెచ్ఎంసీలో ఉన్న మొత్తం 150 డివిజన్లలో కోర్‌సిటీతో పాటు శివారు ప్రాంతాలు కూడా అత్యంత కీలకంగా మారాయి. నిజానికి శివార్లలో.. అంటే, ఆంధ్రప్రాంత ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో టీఆర్ఎస్ ఘోరంగా దెబ్బతినడం ఖాయమని, అక్కడ తాము పాగా వేసి తగినన్ని స్థానాలు సంపాదించుకోవచ్చని ఇటు టీడీపీ-బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా భావించింది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ తీసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమను ఎంతోకొంత ఆదరిస్తారనే టీడీపీ నేతలు భావించారు. కానీ.. ఆ ప్రాంతాల ప్రజలు కూడా టీఆర్ఎస్నే ఆదరించారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 11 డివిజన్లు ఉండగా.. మొత్తం 11 చోట్లా టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. నాగోల్, మన్సూరాబాద్, హయత్‌నగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, హస్తినాపురం, చంపాపేట్, లింగోజిగూడ, గడ్డి అన్నారం, చైతన్యపురి, కొత్తపేట.. ఈ అన్ని డివిజన్లలో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులు మంచి మెజారిటీలతోనే గెలిచారు. మరో వైపు శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని 10 డివిజన్లలోకూడా టీఆర్ఎస్ పార్టీ విజయదుందుభి మోగించింది. ఈ ప్రాంతాల ప్రజలంతా గులాబి పార్టీకే పట్టం గట్టారు. -
నెంబర్ 1 అంటే ఇదేనా..!?
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీకి ఒకే ఒక్క సీటు రావడంపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైదరాబాద్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ది చేస్తానని, నెంబర్ వన్ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ చెప్పే మాటలపై సెటైర్లు వేశారు. బాబు వ్యాఖ్యలను గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలతో పోలుస్తూ.. నెంబర్ వన్ అంటే ఏమిటో అనుకున్నా.. నెంబర్ వన్ అంటే ఇదా అంటూ ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఆశ్చర్యపోయేలా కామెంట్ చేస్తూ ఇద్దరి ఫొటోలు పెట్టారు. ఇక ప్రపంచ పటంలో హైదరాబాద్ ను అగ్రస్థానంలో నిలబెట్టానని చెప్పుకునే చంద్రబాబు వ్యాఖ్యలపైనా నెటిజన్లు సెటైర్లు వేశారు. హైదరాబాద్ పటంలో చంద్రబాబు లేకుండా ఓటర్లు చేశారని కామెంట్లు పోస్ట్ చేశారు. -
హైదరాబాదీలందరికీ ధన్యవాదాలు: ఎంపీ కవిత
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఘనవిజయం అందించి పార్టీపై పెద్ద బాధ్యత పెట్టారని, హైదరాబాదీలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ఎంపీ కవిత ట్వీట్ చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్ధాలన్నింటినీ నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తామని కవిత పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ.. ప్రజల తీర్పును గౌరవిస్తామని అన్నారు. మా ఎజెండా అభివృద్ధేనని, ప్రజల కోసం తమ పోరాటం కొనసాగిస్తామని ట్వీట్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ 100కు పైగా డివిజన్లలో విజయకేతనం ఎగురవేసింది. -
రేవంత్ రాజకీయ సన్యాసం చేస్తారా?
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి వంద సీట్లు వస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాదు.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు విసిరిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తారన్న విషయం అంతటా ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ వంద మార్కు దాటితే.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవడమే కాదు.. ఇక తెలంగాణ గడ్డపై ఎప్పుడూ అడుగు పెట్టబోనని కూడా రేవంత్ రెడ్డి అప్పట్లో ఓ ఎన్నికల సభలో గర్జించారు. టీఆర్ఎస్ మొత్తం వంద స్థానాలు గెలుచుకుని స్పష్టంగా మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు హోదాలో ఉన్న ఆయన.. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో గట్టిగానే ప్రచారం చేశారు. అయినా ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. టీడీపీ-బీజేపీ కూటమి కేవలం నాలుగైదు స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యేలా ఉంది. సైకిల్ పార్టీ సొంతంగా కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. మిగిలిన మూడు చోట్ల బీజేపీ విజయం సాధించింది. ఇక టీఆర్ఎస్ సొంతంగా వంద స్థానాలు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో తాను చేసిన మంగమ్మ శపథాన్ని రేవంత్ రెడ్డి ఎంతవరకు నెరవేర్చుకుంటారనే విషయం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. -
టీఆర్ఎస్.. తిరుగులేని రాజకీయ శక్తి: కేటీఆర్
అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు, హైదరాబాద్‌లోని సబ్బండ వర్గాలు తమను సంపూర్ణంగా ఆదరించడం వల్లే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంతటి ఘనవిజయాన్ని సాధించగలిగామని తెలంగాణ మంత్రి కె. తారక రామారావు (కేటీఆర్) చెప్పారు. టీఆర్ఎస్ అంటే 'తిరుగులేని రాజకీయ శక్తి' అని మరోసారి ఖరారైందని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్కు అనుకూలంగా వస్తుండటం, విజయం దాదాపు ఖరారైన తర్వాత ఆయన సీనియర్ నాయకుడు డి.శ్రీనివాస్, మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, జగదీష్ రెడ్డి తదితరులతో కలిసి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సారథ్యంలో ఇప్పటికే చాలాసార్లు చరిత్రను తిరగరాసిందని, ఇప్పుడు మరోసారి హైదరాబాద్ నగర చరిత్రలో ఏనాడూ లేనంత పెద్ద మెజారిటీ కైవసం చేసుకుందని అన్నారు. ఈ అపురూప విజయాన్ని అందించిన గ్రేటర్ ప్రజలందరికీ శిరస్సు వంచి సవినయంగా, వినమ్రంగా హృదయపూర్వకంగా నిండుమనసుతో ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. వారికిచ్చిన ప్రతి హామీని తు.చ. తప్పకుండా త్రికరణ శుద్ధిగా అమలుచేస్తామని, మేనిఫెస్టోలో చెప్పిన ప్రతిమాట నిలబెట్టుకుంటామని చెబుతున్నామన్నారు. ఈ విజయంతో టీఆర్ఎస్ తిరుగులేని పార్టీ అన్న విషయం అందరికీ అర్థమైందని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్మేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు దాదాపు అందరూ పూర్తిగా శ్రమించారని, హైదరాబాద్ ప్రజలు తమ దీవెనలను అందించారని కేటీఆర్ చెప్పారు. కుల, మత, ప్రాంత విభేదాలు లేకుండా సబ్బండ వర్ణం టీఆర్ఎస్ను ఆదరించిందని ఆనందం వ్యక్తం చేశారు. చాలామంది సెటిలర్లు, అవి.. ఇవి అంటూ చాలా మాటలు అన్నారని, కానీ టీఆర్ఎస్కు సార్వజనీన ఆమోదం ఉందని మరోసారి రుజువైందని చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా అమలుచేస్తామని అందులో ఈషణ్మాత్రం కూడా అనుమానం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో హైదరాబాద్ ప్రజలు కోరుకున్న నగరాన్ని నిర్మిస్తామని, ఈ విజయం కేసీఆర్ కార్యదక్షతకు, పనితీరుకు గ్రేటర్ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంగా, తీర్పుగా భావిస్తున్నామని అన్నారు. అపజయాలు వస్తే కుంగిపోం, విజయాలు వస్తే పొంగిపోయేది లేదని కేటీఆర్ తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కొంతమంది నాయకులు రకరకాల సవాళ్లు విసిరారని, ఆ విషయాన్ని వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. ఈ విజయం చూసిన తర్వాతైనా ప్రతిపక్షాల మనసు మారాలని అన్నారు. వాళ్లు నిర్మాణాత్మకంగా సహకరించాలని కోరారు. ఎదిగిన కొద్దీ ఒదగాలని కేసీఆర్ ఎప్పుడూ చెప్పేవారని, దాన్ని తాము పాటిస్తామని అన్నారు. -
పట్టు నిలబెట్టుకున్న మజ్లిస్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనంలో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలయిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కొట్టుకుపోగా.. ఎంఐఎం మాత్రం తన పట్టును నిలబెట్టుకుంది. హైదరాబాద్ లో పాతబస్తీ సహా తనకు పట్టున్న ప్రాంతాల్లో ఎంఐఎం విజయకేతనం ఎగురవేసింది. 44 స్థానాల్లో విజయం సాధించింది. గత గ్రేటర్ ఎన్నికల్లో 43 సీట్లు సాధించి మూడో స్థానంలో నిలిచిన ఎంఐఎం.. తాజా ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచింది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు.. టీఆర్ఎస్ తో పాటు ఎంఐఎంను లక్ష్యంగా చేసుకున్నాయి. ఎంఐఎం పై విమర్శల వర్షం కురిపించాయి. పోలింగ్ సందర్భంగా ఎంఐఎం నాయకులు.. అధికార టీఆర్ఎస్ సహా ఇతర పార్టీల నాయకులపై దాడులకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ కలసి ఎంఐఎంపై గవర్నర్ కు ఫిర్యాదు కూడా చేశాయి. ఎంఐఎం తనకు బలమున్న ప్రాంతాల్లో అభ్యర్థులను గెలిపించుకుంది. ఓవైసీ సోదరులు అసదుద్దీన్, అక్బరుద్దీన్ పార్టీ శ్రేణులను చైతన్య పరుస్తూ ప్రచారం చేశారు. గత ఎన్నికల్లో ఎంఐఎం మూడో స్థానంలో నిలిచినా.. 53 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీతో కలసి మేయర్ పీఠం దక్కించుకున్న సంగతి తెలిసిందే. తొలుత కాంగ్రెస్ పార్టీ తరపున బండ కార్తీక రెడ్డి మేయర్‌గా ఎన్నిక కాగా, ఆనక ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్‌కు మేయర్ పదవిని అప్పగించారు. 45 కార్పొరేట్ సీట్లతో రెండో స్థానంలో నిలిచిన టీడీపీ ప్రతిపక్షంలో నిలిచింది. కాగా గ్రేటర్ ఎన్నికల్లో కింగ్ లేదా కింగ్ మేకర్ పాత్ర పోషించే ఎంఐఎంకు ఈ సారి ఆ అవకాశం రాలేదు. అధికార టీఆర్ఎస్ మెజార్టీ సాధించింది. -
ఇంతకీ మేయర్ ఎవరో!
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సొంతంగా అధికారం చేపట్టేందుకు కావల్సిన మెజారిటీని సాధిస్తున్న టీఆర్ఎస్.. ఇక తమ మేయర్ అభ్యర్థి ఎవరన్న విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించాల్సి ఉంది. కాంగ్రెస్ లాంటి పార్టీలు ముందుగా తమ మేయర్ అభ్యర్థులను ప్రకటించినా, టీఆర్ఎస్ మాత్రం ఆ దిశగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే.. ప్రధానంగా మాత్రం చర్లపల్లి డివిజన్ నుంచి పోటీ చేసిన బొంతు రామ్మోహన్, బంజారాహిల్స్ డివిజన్ నుంచి పోటీ చేసిన ఎంపీ కే.కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మిల మధ్యే ప్రధానంగా పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. బొంతు రామ్మోహన్ ముందు నుంచి పార్టీలో చురుగ్గా వ్యవహరించారు. నగరం మొత్తం ఏదోలా తన పేరు వినిపించేలా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే.. కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించి, అక్కడి నుంచి టీఆర్ఎస్కు వచ్చిన సీనియర్ నాయకుడు కె. కేశవరావు కుమార్తె విజయలక్ష్మి బంజారాహిల్స్ నుంచి పోటీ చేశారు. ఆమెకు కూడా సముచిత స్థానం ఇవ్వచ్చనే వాదన వినిపించింది. దీంతో ప్రధానంగా మేయర్ పదవి కోసం ఎక్కువ పోటీ బొంతు రామ్మోహన్, విజయలక్ష్మిల మధ్యే ఉంటుందని తెలుస్తోంది. మాదాపూర్ డివిజన్ నుంచి గెలిచిన జగదీశ్వర్ గౌడ్ పేరు కూడా ఓ దశలో వినిపించింది. అయితే ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. మాదాపూర్ నుంచి ఆయన, హఫీజ్‌పేట నుంచి ఆయన భార్య పూజిత కార్పొరేటర్లుగా పోటీ చేశారు. తాము గెలిస్తే మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ మేయర్ అవుతారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించినా.. జాంబాగ్ డివిజన్ నుంచి పోటీ చేసిన విక్రమ్‌గౌడే ఓడిపోయారు. -
తెలంగాణ భవన్లో సంబరాలు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో ఊహించినదాని కంటే అధికార టీఆర్ఎస్ ఘనవిజయం దిశగా దూసుకెళ్తుండటంతో ఆ పార్టీ నాయకులు సంబరాల్లో మునిగిపోయారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో పండగ వాతావరణం నెలకొంది. గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కాగా, అప్పటికే టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఎన్నికల ఫలితాలను తెలుసుకునేందుకు సర్వత్రా ఆసక్తి చూపారు. టీవీల ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల ఫలితాలను తెలుసుకుంటూ.. పార్టీ భారీ విజయం సాధించే సంకేతాలు వెలువడటంతో పార్టీ నాయకులతో సంతోషం పంచుకున్నారు. టీఆర్ఎస్ సొంతంగా మేయర్ పదవిని దక్కించుకునే అవకాశం ఉండటంతో టీఆర్ఎస్ నాయకుల సంబరం అంబరాన్ని తాకింది. మంత్రులు తెలంగాణ భవన్ కు వెళ్తున్నారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రంగులు చల్లుకుని న్యత్యాలు చేశారు. -
గ్రేటర్లో కాంగ్రెస్‌కు భారీ షాక్
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరోసారి గట్టి షాక్ తగిలింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హస్తం పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం గ్రేటర్ ఎన్నికల్లో కేవలం రెండే సీట్లు నెగ్గింది. పటాన్ చెరు, నాచారం డివిజన్లలో గెలుపొందింది. గత గ్రేటర్ ఎన్నికల్లో 52 డివిజనల్లో విజయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్-ఎంఐఎంతో కలసి మేయర్ పీఠాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. తొలుత కాంగ్రెస్ పార్టీ తరపున బండ కార్తీక రెడ్డి మేయర్‌గా ఎన్నిక కాగా, ఆనక ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్‌కు మేయర్ పదవిని అప్పగించారు. అయితే తాజా ఎన్నికల్లో సీన్ మారింది. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి విక్రం గౌడ్ తో పాటు మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి కూడా పరాజయం పాలయ్యారు. ఇక తెలంగాణ ఇచ్చింది తామేనని, తమకే ఓటేయాలని సాధారణ ఎన్నికల్లో ప్రచారం చేసినా ఓటమిపాలైన కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడింది. తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారింది. కాంగ్రెస్ ఓటమికి ఎన్నో కారణాలుండగా, స్వయం కృతాపరాధంతో కూడా మూల్యం చెల్లించుకుంది. గతంలో మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం కాంగ్రెస్‌కు దూరమైంది. ఒంటరిగా గ్రేటర్ ఎన్నికల్లో బరిలో దిగిన కాంగ్రెస్ తరపున ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సహా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీసీఎల్పీ నాయకుడు జానారెడ్డి, ఇతర రాష్ట్ర స్థాయి నేతలు, గ్రేటర్ నేతలు విస్తృతంగా ప్రచారం చేసినా కాంగ్రెస్‌కు నిరాశ తప్పలేదు. గ్రేటర్లో పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురాలేకపోయారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు హైదరాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ టీఆర్ఎస్లో చేరుతారని ప్రచారం జరగడం పార్టీ శ్రేణులను గందరగోళంలో పడేసింది. అంతేగాక, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు, దానం వర్గీయుల మధ్య విభేదాలు ఏర్పడం కొంపముంచింది. ఇక ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష నేత జానారెడ్డి అధికార పార్టీకి లాభం చేకూర్చేలా వ్యవహరించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న రూ. 5 భోజన పథకం బాగుందని జానారెడ్డి ప్రశంసించడమే దీనికి కారణం. జీహెచ్ఎంసీ భోజనం సూపర్ అంటూ ప్రతిపక్ష నేత కితాబు ఇవ్వడం వల్ల తమకు లబ్ధి కలుగుతుందని టీఆర్ఎస్ నాయకులు భావించినట్టే జరిగింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరడం కూడా నష్టం కలిగించింది. -
ఫలించిన కేసీఆర్ వ్యూహం.. కేటీఆర్ ఉధృత ప్రచారం
చార్ సౌ షహర్.. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరంపై టీఆర్ఎస్ తన పట్టు నిరూపించుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జీహెచ్ఎంసీకి తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అత్యధిక స్థానాలు గెలుచుకుని తానేంటో చూపించింది. కోర్‌సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కువ స్థానాలు గెలుచుకున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం సీఎం కేసీఆర్ ముందు నుంచి రచించిన వ్యూహంతో పాటు.. ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి కేటీఆర్ ఉధృతంగా సాగించిన ప్రచారం కూడా టీఆర్ఎస్ విజయానికి కారణమైంది. ''గాడిదకు గడ్డి వేసి ఆవును పాలివ్వమంటే ఇస్తుందా.. అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ను గెలిపించండి'' అన్న మాటలు కూడా ఓటర్ల మీద గట్టిగానే పనిచేసినట్లు కనిపిస్తోంది. సెటిలర్లు, ఆంధ్రప్రాంతానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉండే శివారు ప్రాంతాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడం ఇందుకు నిదర్శనం. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాలతో పాటు, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన వరంగల్, నల్లగొండ, కరీంనగర్ లాంటి జిల్లాల్లో తప్ప హైదరాబాద్ నగరంలోని ప్రాంతాల్లో టీఆర్ఎస్కు అంతగా పట్టు లేదనే అపప్రథ ఉండేది. అందుకే సనత్‌నగర్ ఉప ఎన్నిక విషయంలో కూడా వెనకడుగు వేస్తూ.. తలసాని శ్రీనివాస యాదవ్‌ను మంత్రిగా కొనసాగించడంపై విమర్శలు కూడా వచ్చాయి. వాటన్నింటికీ సమాధానంగా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను చూపించాలని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి కేటీఆర్‌కు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు. అందుకు తగ్గట్లే కేటీఆర్ కూడా.. దాదాపు నగరంలోని అన్ని మూలలకూ సుడిగాలి పర్యటనలు చేసి, సెటిలర్ల ఓట్లను కూడా రాబట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఇంతకుముందు జరిగిన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన పరాభవాన్ని మరిచిపోయే రేంజిలో ఫలితాలు రాబట్టేందుకు కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ఆ పర్యటనలు తగిన ఫలితాలను రాబట్టాయి. కేవలం కోర్‌సిటీలో మాత్రమే కాక.. శివారు ప్రాంతాల్లో సైతం తన పట్టు నిలబెట్టుకునేందుకు టీఆర్ఎస్ ఈ ఎన్నికలను సమర్థంగా ఉపయోగించుకోగలిగింది. కోర్ సిటీ మాట ఎలా ఉన్నా, శివారు ప్రాంతాలు.. అంటే సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సెటిలర్లు ఎక్కువగా ఉంటారని, వాళ్ల ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్కు రావు కాబట్టి వాటిని కొల్లగొట్టగలిగితే అధికార పార్టీ ఆధిక్యాన్ని గణనీయంగా తగ్గించొచ్చని కాంగ్రెస్‌తో పాటు టీడీపీ-బీజేపీ కూడా భావించాయి. కానీ అలా జరగలేదు. దాంతో ఆ పార్టీల ఆశలు గల్లంతయ్యాయి. -
'బల్దియాపై ఎగిరేది మా జెండానే'
హైదరాబాద్: బల్దియాపై టీఆర్ఎస్ జెండా ఎగరబోతుందని టీఆర్ఎస్ పార్టీ నేత, మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడా అధికార దుర్వినియోగం జరగలేదని చెప్పారు. అయితే, పాతబస్తీలో ఘర్షణ చోటుచేసుకోవడం దురదృష్టకరమని, చట్టప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసన తర్వాత మంత్రి కేటీఆర్, షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల ప్రచార సరళి, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మరోసారి టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే విషయాన్ని స్పష్టం చేశాయని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించిన మీడియాకు, పోలీసు యంత్రాంగానికి, జీహెచ్ఎంసీకి, పార్టీనాయకులకు, నేతలకు అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం డీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ప్రజల విశ్వాసం పొందారని చెప్పారు. మంత్రులందరిపై ప్రచార బాధ్యతలు పెట్టినా కేటీఆర్ కు ప్రధాన ప్రచార బాధ్యతలు అప్పగించి కేసీఆర్ మంచి పనిచేశారని, అలా చేయడం ద్వారా రాష్ట్రానికి, రాజధానికి మంచి జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో కలిగించారని చెప్పారు. కేటీఆర్ పనితీరు చూసి తాను కూడా ఆశ్చర్యపోయానని అన్నారు. టీఆర్ఎస్ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45శాతం ఓటింగ్ నమోదు
హైదరాబాద్ : ఇప్పటివరకూ తమకు అందిన సమాచారం ప్రకారం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45 శాతం పోలింగ్ నమోదు అయినట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం సాయంత్రం ప్రెస్మీట్లో మాట్లాడుతూ ఇంకా రెండు లేదా మూడు శాతం ఓటింగ్ పెరిగే అవకాశం ఉందన్నారు. గతంలో కంటే స్వలంగా ఓటింగ్ శాతం పెరిగినట్లు చెప్పారు. 2 వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ పెట్టామని.. లైవ్ వెబ్ కాస్టింగ్ పెట్టడం వల్ల ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదని చెప్పారు. ఎక్కడ ఏ చిన్న సమాచారం వచ్చినా పోలీసులను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. గ్రేటర్ పరిధిలో ఎక్కడా హింసాత్మక ఘటనలు, పోలింగ్ బూత్‌లను ఆక్రమించడం జరగలేదని కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ రోజు ఉదయం పోలింగ్ మొదలైన అరగంటలో కేవలం ఎనిమిది ఈవీఎంలు మొరాయించాయని, అయితే పది నిమిషాల్లోనే వాటిని సరిచేయడం జరిగిందన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ బాగానే జరిగిందని, ఒకటి, రెండు చోట్ల మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఆయన తెలిపారు. ఎంఐఎం, కాంగ్రెస్ గొడవపై ప్రిసైడింగ్ అధికారి నుంచి వివరాలు తెలుసుకుంటామన్నారు. పూర్తి వివరాలను ఎన్నికల కమిషన్‌కు నివేదిస్తామని కమిషనర్ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. -
నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చా
నాలెడ్జ్ సిటీగా అభివృద్ధి చేశా: ఏపీ సీఎం చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల విభజన భౌగోళికంగానే జరిగిందని, మనుషులు విడిపోలేదని తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుజాతిని కలిపే శక్తి తమ పార్టీకే ఉందని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీకి ఓటేయడం చారిత్రక అవసరమని అన్నారు. రెండ్రోజులపాటు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 35 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల టీడీపీకి తెలంగాణ ప్రజలతో, హైదరాబాద్‌తో విడదీయరాని సంబంధం ఉందన్నారు. తెలంగాణ వెనుకబడిందనే విషయాన్ని గుర్తించి తమ పార్టీ ఈ ప్రాంత అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు. ట్యాంక్‌బండ్ సుందరీకరణ, బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు, హుస్సేన్‌సాగర్‌లో బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయడం వంటి పనులతో హైదరాబాద్‌లో ఎన్టీఆర్ కొత్త శకానికి నాంది పలికారని, దాన్ని తాను కొనసాగించానని వివరించారు. అబిడ్స్ చుట్టుపక్కల ప్రాంతమే హైదరాబాద్ సిటీగా ఉన్న రోజుల్లో, పెట్టుబడుల కోసం విదే శీ ప్రతినిధులు రావడానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్న నగరాన్ని నాలెడ్జ్ సిటీగా అభివృద్ధి చేసి, అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చినట్లు చెప్పారు. హైదరాబాద్‌కు కృష్ణా జలాలు తీసుకొచ్చింది, గోదావరి జలాలకు శ్రీకారం చుట్టింది తానేనన్నారు. ‘‘ఎల్ అండ్ టీతో కలసి హైటెక్‌సిటీ నిర్మించాం. మైక్రోసాఫ్ట్ కంపెనీని హైదరాబాద్‌కు తీసుకురావడంతోనే ప్రపంచంలో పేరొందిన ఐటీ, నాలెడ్జ్ ఆధారిత కంపెనీలన్నీ వచ్చాయి. హైదరాబాద్‌కు వచ్చే విదేశీ కంపెనీల కోసం షాపింగ్ మాల్స్, హోటల్స్‌ను ప్రమోట్ చేశాం. స్పోర్ట్స్ కోసం స్టేడియాలను నిర్మించాం. విదేశీయులు నేరుగా హైదరాబాద్‌కు వచ్చేందుకు అప్పటి ప్రధాని వాజ్‌పేయితో మాట్లాడి అంతర్జాతీయ విమానాల ల్యాండింగ్‌కు అనుమతి పొందాను. తర్వాత శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేశా. బిల్‌క్లింటన్, బిల్‌గేట్స్ మొదలు అంతర్జాతీయ ప్రముఖులందరినీ హైదరాబాద్‌కు తీసుకొచ్చా. నేను చేసిన కృషి, తీసుకు వచ్చిన సంస్కరణల వల్లే 1994-95లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి ఈ రోజు తెలంగాణ మిగులు ఆదాయం గల రాష్ట్రంగా మారింది’’ అని వివరించారు. విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. గెలిచే కార్పొరేటర్లు పార్టీలోనే ఉంటారు గ్రేటర్ ఎన్నికల్లో నగరాన్ని అభివృద్ధి చేసిన పార్టీలనే గెలిపించాలని చంద్రబాబు కోరారు. హైదరాబాద్ అభివృద్ధి చెందేందుకు కృషి చేశానని, అందుకే టీడీపీ-బీజేపీకి పాజిటివ్ ఓటు వేయాలన్నారు. తద్వారా ఇతరులు కూడా అభివృద్ధి కోసం పోటీపడతారని చెప్పారు. ‘‘టీడీపీని వదిలి పెట్టిన వారు పార్టీలో సామాన్య కార్యకర్తల స్థాయి నుంచి ఎలా డెవలప్ అయ్యారో చూశారు. వాళ్లు పార్టీకి ద్రోహం చేసి స్వార్థం కోసం వేరే పార్టీల్లో చేరినంత మాత్రాన మిగతా వారు ఆ బాట పట్టరు. ఒక్కరు పోయారని అందరూ వెళ్లరు. పెద్దయ్యాక పిల్లలు తమని వదిలిపోతున్నారని పిల్లలను కనకుండా పోతే సమాజం ఏమవుతుంది? ఇదీ అంతే! టీడీపీలో గెలిచి మళ్లీ పార్టీ మారతారనే భయంతో ఓటు వేయడం మానొద్దు. ఇప్పుడు టీడీపీ నుంచి గెలిచే కార్పొరేటర్లు ఈ పార్టీలోనే ఉంటారు. పార్టీ మారిన వారికి గుణపాఠం చెప్పాలి’’ అని అన్నారు. -
టీఆర్ఎస్ కు 30 సీట్లు రావు: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 30 సీట్లు కూడా రావని ఇంటెలిజెన్స్ శాఖ నివేదిక ఇచ్చినట్లు తెలిసిందని టీడీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరిస్తున్నారనే విషయం అర్థమయ్యే సీఎం కేసీఆర్, మంత్రులు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. గ్రేటర్ ప్రచారంలో భాగంగా శనివారం పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. -
స్టార్ క్యాంపెయినర్ జానారెడ్డి!
♦ జీహెచ్ఎంసీ రూ. 5 భోజనాన్ని పొగుడుతూ ప్రెస్‌మీట్ ♦ కష్టపడకుండా ప్రచారం వచ్చిందంటూ సంబరపడుతున్న టీఆర్ఎస్ ♦ అధికార పార్టీకి లాభం చేకూర్చే చేష్టలేమిటని కాంగ్రెస్ నేతల మండిపాటు సాక్షి ప్రత్యేక ప్రతినిధి : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ ఎవరో తెలుసా...? టీఆర్ఎస్ ప్రచార బాధ్యతలను నెత్తినెత్తుకున్న మంత్రి కేటీఆరో, వచ్చీరాని భాషలో ప్రచారం చేస్తూ జనానికి హాస్యం పంచుతున్న నారా లోకేశో అనుకుంటున్నారా.. కాదు. మరి ఏపీకి సీఏంగా ఉంటూ ఇక్కడ ప్రచారం చేస్తున్న చంద్రబాబో, ఇన్ని రోజులు ప్రచారానికి దూరంగా ఉండి గురువారం ఏకంగా రెండు గంటల పాటు ప్రెస్‌మీట్ పెట్టిన సీఎం కేసీఆరో అనుకుంటున్నారా.. వారు కూడా కాదు. ప్రతిపక్ష నేతగా ఉంటూ అధికార పార్టీకి లాభం చేకూర్చేలా వ్యవహరించిన జానారెడ్డే స్టార్ క్యాంపెయినర్ అని అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. గ్రేటర్లో ప్రచారానికి వెళ్లకుండా కాంగ్రెస్ శాసనసభా పక్ష కార్యాలయంలో కూర్చుని జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న రూ. 5 భోజన పథకం బాగుందని జానారెడ్డి ప్రశంసించడమే దీనికి కారణం. అసలు ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ భోజన కేంద్రం నుంచి పార్సిల్ తెప్పించడమే కాదు, దానిని తింటూ ఫొటోగ్రాఫర్లకు ఫోజులిచ్చి, ఆ భోజనం బాగుందని కూడా జానారెడ్డి కితాబిచ్చారు. అయితే జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న ఈ రూ. 5కే భోజనం కార్యక్రమం పేదలు, చిరుద్యోగులకు వరమంటూ అధికార టీఆర్ఎస్ జంట నగరాల్లో హోర్డింగ్‌ల ద్వారా ఊదరగొట్టింది. అది తమ పథకమేనని ప్రచారం చేసింది. తాజాగా జీహెచ్ఎంసీ భోజనం సూపర్ అంటూ ప్రతిపక్ష నేత కితాబు ఇవ్వడంతో టీఆర్ఎస్ నేతలు సంబరపడుతున్నారు. తాము చేసిన ప్రచారం కంటే ప్రతిపక్ష నేత చెప్పిందానినే ప్రజలు ఎక్కువగా నమ్ముతారన్నది వారి అభిప్రాయం. ఇదే సమయంలో జానారెడ్డి వ్యాఖ్యలతో ఇబ్బందిపడిన కాంగ్రెస్ నేతలు మింగలేక కక్కలేక మౌనంగా ఉండిపోయారు. కొందరైతే జానాపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు. జానారెడ్డి వ్యవహారం కాంగ్రెస్‌కు నష్టం కలిగించేదంటూ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి బహిరంగంగానే మండిపడ్డారు. అయితే తీరా ఎన్నికలకు మూడు రోజుల ముందు దీనిని మరింతగా ప్రచారం చేసి పార్టీ పరువు పోగొట్టుకోవడమెందుకని మెజారిటీ నేతలు మిన్నకుండిపోయారు. ‘‘రూ.5 కే భోజనం అని అధికార పార్టీ ప్రచారంతో ఊదరగొడుతుంటే మా నాయకుడు దానికి క్రెడిట్ తెచ్చిపెట్టారు. మా కేడర్ నైతిక స్థైర్యం దెబ్బతినదా, దీని గురించి ఎవరు ఆలోచిస్తున్నారు?’’ అని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. జానాపై అధిష్టానానికి ఫిర్యాదు: పాల్వాయి జీహెచ్ఎంసీ అందిస్తున్న రూ.5 భోజనపథకం బాగుందని పొగిడిన కె.జానారెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్టు రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. రూ.5 భోజన పథకాన్ని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిందేనన్నారు. రూ.5ల భోజనంపై ప్రభుత్వానికి కితాబివ్వడం దురదృష్టకరమన్నారు. దీనిపై జానారెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీయే పెట్టింది ఎవరేమనుకున్నా జానారెడ్డి మాత్రం రూ. 5 భోజనాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. దానిని ప్రజలకు వివరించడం కోసమే ప్రతిపక్ష నేత ఆచరణలో పెట్టి చూపించారని జానాను సమర్థించే నేతలు చెబుతున్నారు. అదే విషయాన్ని క్షేత్రస్థాయిలో జానారెడ్డి ఎందుకు ప్రచారం చేయడం లేదని, పార్టీ మేనిఫెస్టోలో దానిని ఎందుకు ప్రస్తావించలేదని మరికొందరు నేతలు అంటున్నారు. ఎవరేమనుకున్నా జీహెచ్ఎంసీ రూ. 5 భోజన పథకం టీఆర్ఎస్దేనని ప్రజల్లోకి వెళ్లేలా చేయగలిగామని, జానారెడ్డి కూడా ఎండార్స్ చేయడంతో మాకు మంచి మేలే జరిగిందని రాష్ట్ర మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. -
కేసీఆర్ కుటుంబంలోనే విభేదాలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలోనే విభేదాలున్నాయని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీలో వంద సీట్లు గెలుస్తామని, ఎంఐఎంతో పొత్తు అవసరం లేద ని మంత్రి కేటీఆర్ చెప్పగా, ఆయన సోదరి కవిత కూడా ఎవరి సాయం లేకుండానే మేయర్ స్థానం దక్కించుకుంటామని ప్రకటించారని గుర్తు చేశారు. కేసీఆర్ మాత్రం ఎంఐఎం సహకారంతో మేయర్ స్థానం దక్కించుకుంటామని చెబుతున్నారని, దీన్ని బట్టే వారి కుటుంబంలో ఏకాభిప్రాయం లేదని తెలుస్తోందన్నారు. ఎంఐఎం-టీఆర్ఎస్ కూటమి ఎన్నికల్లో పోటీ చేస్తుందని తాము ఏనాడో చెప్పామని గుర్తుచేశారు. సొంత పార్టీలో, కుటుంబంలో ఉన్న లోపాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాల పట్ల కేసీఆర్ అప్రజాస్వామికంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. -
బాంబులకే భయపడలేదు వీళ్లకు భయపడతానా?
ఏపీ సీఎం చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: ‘‘కాంగ్రెసోళ్లు అంటున్నారు.. నేనేదో భయపడుతున్నానని.. నా జీవితంలో ఎప్పుడైనా భయమనేది చూశారా తమ్ముళ్లూ..? బాంబులకే భయపడలా. 2003లో నామీద 24 క్లెమోర్ మైన్లు బ్లాస్ట్ చేస్తే అవి అటు ఇటు పోయినాయి తప్ప నన్నేమీ చేయలేదు! ఆ రోజు వేంకటేశ్వర స్వామి దగ్గరికి పోతా ఉంటే ఆయనే నన్ను కాపాడాడు. రాజకీయాల్లోనూ నేను ఎవరికీ భయపడ లేదు. ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు..’’ అని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండోరోజు ఆయన హైదరాబాద్‌లోని సనత్‌నగర్, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీ నగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లోని పలు డివిజన్లలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా పాటిగడ్డ, మెట్టుగూడ, హబ్సిగూడ, ఎల్బీనగర్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. హైదరాబాద్ అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని చెప్పారు. ‘‘హైదరాబాద్‌లో నాకేం పని అంటున్నారు? నాకు లేని హక్కు ఎవరికుంది ఈ హైదరాబాద్‌లో. 35 సంవత్సరాలుగా హైదరాబాద్‌లో ఉన్నా. 1978లో వీరందరి కన్నా ముందే హైదరాబాద్‌లో అసెంబ్లీలో అడుగుపెట్టా. టీడీపీ పుట్టింది అసెంబ్లీ క్వార్టర్స్‌లో. తెలుగుజాతి ఎక్కడుంటే టీడీపీ అక్కడుంటుంది. ఆపదొస్తే అర్ధరాత్రి పిలిచినా నేను వస్తా..’’ అని బాబు పేర్కొన్నారు. ‘‘హైదరాబాద్ నా మానసపుత్రిక. ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఆబిడ్స్ ప్రాంతమే. నేను హైదరాబాద్‌ను విస్తరించా. హైటెక్‌సిటీ రాకతో కుగ్రామమైన మాదాపూర్ ఇప్పుడు సిటీ అయింది. హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రపంచమంతా తిరిగా. ఫైల్స్ చంకన పెట్టుకొని మైక్రోసాఫ్ట్ కంపెనీని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు బిల్‌గేట్స్‌ను కలిశా. ఎన్నో దేశాధినేతల చుట్టూ తిరిగి హైదరాబాద్‌కు కంపెనీలను, ఆదాయాన్ని తీసుకొచ్చా’’ అని చెప్పారు. హైదరాబాద్ గల్లీల్లో సిమెంటు రోడ్లు మొదలు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు వరకు తన హయాంలోనే వచ్చాయని, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచానని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి తెలంగాణలో జెండా ఎగురవేస్తుందని చెప్పారు. చంద్రబాబు రోడ్‌షోలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, టీడీపీ నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎ.రేవంత్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య, మాగంటి గోపీనాథ్, బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఫిరాయింపుదారులకు బుద్ధి చెప్పాలి టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలపై చంద్రబాబు పరోక్షంగా విమర్శలు చేశారు. ‘‘ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలోకి వెళ్లి నన్నే తిడుతున్నారు. నేను బాధపడడం లేదు. ప్రజా జీవితంలో ఇవన్నీ మామూలే. టీడీపీ జెండా పట్టుకుని, సింబల్ పెట్టుకుని గెలిచి టీడీపీనే తిడుతున్నారంటే వారెంత పెద్ద మనుషులో అర్థం చేసుకోవాలి.’’ అని వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తులకు సహకరించి ఓట్తేస్తారా, గుణపాఠం చెపుతారా? అని ప్రశ్నించారు. ‘‘నీతి, నిజాయితీ ఉండాలి. రాజకీయాల్లో విలువలు ఉండాలి. కొంతమంది నాయకులకు నీతి లేకపోయినా ప్రజలకు నీతి ఉంది. ఫిరాయింపుదారులకు బుద్ధి చెప్పాలి. సనత్‌నగర్ నుంచి సైకిల్ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీలో చేరి మంత్రి పదవి తీసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా?’’ అని మంత్రి తలసానిని ఉద్దేశించి పాటిగడ్డలో జరిగిన బహిరంగ సభలో ధ్వజమెత్తారు. ఇతర బహిరంగ సభల్లో సైతం ఫిరాయింపుదారులపై విమర్శలు గుప్పించారు. -
జీహెచ్ఎంసీ అభ్యర్థుల్లో 72మందికి నేర చరిత్ర
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గట్టి షాక్ తగిలే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో నేర చరిత్ర కలిగిన అభ్యర్థుల జాబితాను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ విడుదల చేసింది. 51 డివిజన్లలో 72మంది అభ్యర్థులకు నేర చరిత్ర ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది. అందులో 64మంది పురుషులు ఉండగా.. 8మంది మహిళలు ఉన్నట్లు పేర్కొంది. టీడీపీ నుంచి 13మంది, టీఆర్ఎస్ నుంచి 14 మంది, బీజేపీ నుంచి నలుగురు, ఎంఐఎంలో 11మంది, ఎంబీటీలో ఇద్దరు, ఇతర పార్టీల వారు నలుగురు, స్వతంత్ర్య అభ్యర్థులు 11మంది నేర చరిత్ర గలవారు ఉన్నట్లు ఆ సంస్థ వివరించింది. -
గ్రేటర్లో పార్టీ ఎలా ఉంది?
♦ మంత్రులతో సీఎం కేసీఆర్ సమీక్ష ♦ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం కసరత్తు ♦ నియోజకవర్గాల వారీగా పరిస్థితిపై ఆరా ♦ సర్వే ఫలితాలు, బహిరంగ సభ, ♦ ఈ-పబ్లిసిటీపై చర్చ హరీశ్‌రావు గైర్హాజరు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలను సవాలుగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ పక డ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తోంది. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో నగరంలో పార్టీ పరిస్థితిపై గులాబీ అధినేత, సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. మంత్రులతో ఆయన సోమవారం సీఎం అధికారిక నివాసంలో మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు రెండు గంటలపాటు సమీక్ష జరిపారు. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు.. ఈ సమావేశానికి మంత్రి హరీశ్‌రావు మినహా మిగిలిన మంత్రులందరూ హాజరయ్యారు. నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నందున హరీశ్‌రావు ఈ సమావేశానికి రాలేదని సమాచారం. ఈ నెల 30న కేసీఆర్ బహిరంగ సభను టీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ఈ సభకు ఏర్పాట్లు, దీన్ని విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా సమీక్ష జరిపారని తెలిసింది. అలాగే కేసీఆర్ ఈ-పబ్లిసిటీకి సంబంధించిన అంశంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ప్రధానంగా జీహెచ్ఎంసీలోని మొత్తం 150 డివిజన్లలో కనీసం వంద స్థానాల్లో విజయం సాధించాలని టీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. నిఘా వర్గాల ద్వారా సేకరించిన సమాచారం, పార్టీ జరిపించిన సర్వేల ద్వారా వచ్చిన వివరాలను ముందు పెట్టుకొని సీఎం కేసీఆర్ మంత్రులతో సమీక్ష జరిపినట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఆయా నియోజకవర్గాల వారీగా ఏ డివిజన్లలో బలహీనంగా ఉన్నాం, అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలను మంత్రులకు సూచించారని సమాచారం. మంత్రులందరికీ ప్రచార బాధ్యతలు అప్పజెప్పినందున నేరుగా వారితోనే సమీక్ష జరిపి, ప్రచారంలో వెనకబడిన వారి గురించీ ప్రస్తావించినట్లు చెబుతున్నారు. ఈ సమావేశం వివరాలను గోప్యంగా ఉంచారు. పార్టీ యంత్రాం గం, ఇతర ఏజెన్సీల ద్వారా జరిపించిన దాదాపు ఆరు సర్వేలు, వాటి ఫలితాలపై సమగ్రంగా చర్చించినట్లు తెలిసింది. లోపాలపైనా చర్చ గ్రేటర్లో అభ్యర్థుల ప్రకటనకు ముందు ఉన్నంత ఊపు ఆ తర్వాత తగ్గిందని, కొందరు మంత్రులు అనుకున్నంత స్థాయిలో ప్రచారంలో పాల్గొనడం లేదని, ఆయా డివిజన్లలో ప్రచారంలో స్థానికులను కలుపుకునిపోవడంలో ఆయా ఇన్చార్జీలు శ్రద్ధ తీసుకోవడం లేదని, తమ ప్రాంతాలకు పిలిపించుకున్న నేతలతోనే ప్రచారంలో పాల్గొంటున్నార న్న తదితర లోపాలపైనా చర్చించారని తెలిసింది. కాగా, డివిజన్ల అభివృద్ధి కోసం చేయాల్సిన హామీలు, అభ్యర్థుల ఆర్థిక అవసరాలు, సాయం వంటి అం శాలపైనా సమీక్ష జరిగిందని వినికిడి. మొత్తంగా డివిజన్ల వారీగా, మంత్రుల వారీ గా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితిని, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం కేసీఆర్ సూచనలు చేశారని సమాచారం.