హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో ఊహించినదాని కంటే అధికార టీఆర్ఎస్ ఘనవిజయం దిశగా దూసుకెళ్తుండటంతో ఆ పార్టీ నాయకులు సంబరాల్లో మునిగిపోయారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో పండగ వాతావరణం నెలకొంది.
గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కాగా, అప్పటికే టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఎన్నికల ఫలితాలను తెలుసుకునేందుకు సర్వత్రా ఆసక్తి చూపారు. టీవీల ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల ఫలితాలను తెలుసుకుంటూ.. పార్టీ భారీ విజయం సాధించే సంకేతాలు వెలువడటంతో పార్టీ నాయకులతో సంతోషం పంచుకున్నారు. టీఆర్ఎస్ సొంతంగా మేయర్ పదవిని దక్కించుకునే అవకాశం ఉండటంతో టీఆర్ఎస్ నాయకుల సంబరం అంబరాన్ని తాకింది. మంత్రులు తెలంగాణ భవన్ కు వెళ్తున్నారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రంగులు చల్లుకుని న్యత్యాలు చేశారు.
తెలంగాణ భవన్లో సంబరాలు
Published Fri, Feb 5 2016 5:32 PM | Last Updated on Sun, Sep 3 2017 5:01 PM
Advertisement
Advertisement