
హైదరాబాదీలందరికీ ధన్యవాదాలు: ఎంపీ కవిత
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఘనవిజయం అందించి పార్టీపై పెద్ద బాధ్యత పెట్టారని, హైదరాబాదీలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ఎంపీ కవిత ట్వీట్ చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్ధాలన్నింటినీ నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తామని కవిత పేర్కొన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ.. ప్రజల తీర్పును గౌరవిస్తామని అన్నారు. మా ఎజెండా అభివృద్ధేనని, ప్రజల కోసం తమ పోరాటం కొనసాగిస్తామని ట్వీట్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ 100కు పైగా డివిజన్లలో విజయకేతనం ఎగురవేసింది.