సమాచార కమిషనర్ల నియామకాలేవీ?
2 రాష్ట్రాలకు సమాచార కమిషన్ ఉమ్మడిగానే ఉందని, 2017 ఏప్రిల్ వరకు ప్రధాన కమిషనర్‌తో పాటు ఐదుగురు కమిషనర్లు పనిచేస్తూ ఉన్నారని, ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు నలుగురు కమిషనర్ల నియామకా న్ని రద్దు చేసిందని, అదే సమయంలో మిగిలిన ఇద్దరు కూడా పదవీ విరమణ చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్లు లేరని వివరించారు. 2017 ఏప్రిల్ 1 నాటికి కమిషన్‌లో 11,325 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రతి నెలా సగటున 900 అప్పీళ్లు దాఖలవుతున్నాయని తెలిపారు. కమిషన్‌లో ప్రధాన సమాచార కమిషనర్, ఇతర కమిషనర్ల నియామకం లేకపోవడం వల్ల సమాచార హక్కు చట్టం లక్ష్యం నెరవేరకుండా పోతోందన్నారు. కమిషనర్ల నియామకం కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్‌కు వినతిపత్రాలు సమర్పించినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నారు.