సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతుబంధు నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ కానుంది. వానాకాలం(ఖరీఫ్ సీజన్) పంటకుగానూ.. 1.54కోట్ల ఎకరాలకుగానూ సుమారు 70 లక్షల మందికి సాయంగా దాదాపు రూ.7,720 కోట్లకుపైనే కేసీఆర్ సర్కార్ ఈ దఫా ఆదివారమే విడుదల చేసింది. రైతులకు పంట సాయం రూపంలో.. ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రారంభించిందే ఈ రైతుబంధు.
రైతన్నకు పెట్టుబడి సాయంగా ఏటా ఎకరానికి రూ.10వేల చొప్పున సర్కారు అందిస్తుండగా.. కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే పది విడుతల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. పదకొండో విడత కోసం నిన్ననే నిధుల్ని ప్రభుత్వం విడుదల చేయగా.. భాగంగా నేడు(జూన్ 26, సోమవారం) నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
రైతు బంధు పంపిణీలో భాగంగా తొలిరోజైన ఇవాళ.. గుంట భూమి నుంచి ఎకరం విస్తీర్ణం గల భూయజమానులు 22,55,081 మంది రైతుల ఖాతాల్లో రూ.642.52 కోట్ల నగదు జమ కానుంది.
ఇక.. ఇక ఈ ఏడాది కొత్తగా 5 లక్షల మంది రైతులకు పథకాన్ని వర్తింప చేస్తున్నారు. అలాగే.. 1.5లక్షల మంది పోడు రైతులకు కూడా రైతుబంధు అమలు చేయనున్నట్లు చెప్పారు. వ్యవసాయ శాఖ ఈ నిధుల్ని నేటి నుంచే అకౌంట్లలో వేయనుంది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్లకు వేసే నగదుతో.. ఈసారి సర్కార్ ఖజానా నుంచి సుమారు రూ.300 కోట్ల అదనం కానుంది. 11వ విడతతో కలిపి ఇప్పటివరకూ రైతులకు రైతుబంధు ద్వారా మొత్తం రూ.72,910 కోట్ల సాయం అందించారు.
ఇదీ చదవండి: దళిత బంధు.. క్లారిటీ లేని తీరు!
Comments
Please login to add a commentAdd a comment