సాక్షి, హైదరాబాద్: రైతుల ద్రోహి కాంగ్రెస్ పార్టీ అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతుబంధు ఎగిరపోయింది.. రాబందుల రెక్కల చప్పుడే మిగిలింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘రైతుబంధు కావాలా..? రాబందు కావాలా?. ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ ఇచ్చిన నినాదం గుర్తుందా?. రైతుబంధు ఎగిరిపోయింది.. రాబందుల రెక్కల చప్పుడే మిగిలింది!. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుంది పరిస్థితి... ఎకరానికి 15వేలు ఇస్తామని ఊదరగొట్టి.. ఉన్న పదివేలు ఊడగొట్టారు!. పంట పెట్టుబడి ఎగ్గొట్టడం అంటే.. అన్నదాత వెన్ను విరవడమే..!. రైతు ద్రోహి కాంగ్రెస్.. చరిత్ర నిండా అనేక రుజువులు.. ఇప్పుడు ఇంకొకటి!’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
రైతుబంధు కావాలా..? రాబందు కావాలా..?
ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ ఇచ్చిన నినాదం గుర్తుందా..?
రైతుబంధు ఎగిరిపోయింది..రాబందుల రెక్కల చప్పుడే మిగిలింది!
నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుంది పరిస్థితి..!
ఎకరానికి 15వేలు ఇస్తామని ఊదరగొట్టి..ఉన్న పదివేలు ఊడగొట్టారు..!
పంట పెట్టుబడి… pic.twitter.com/fGpgRLZDB3— KTR (@KTRBRS) October 21, 2024
Comments
Please login to add a commentAdd a comment