రైతు భరోసా అందేనా! | - | Sakshi
Sakshi News home page

రైతు భరోసా అందేనా!

Jun 12 2024 1:58 AM | Updated on Jun 12 2024 12:02 PM

రైతు

రైతు భరోసా అందేనా!

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): ఆరు గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఏడాదికి రూ. 15 వేలు పంట పెట్టుబడి సాయాన్ని అందజేస్తామ ని హామీ ఇచ్చింది. దీనిని ఈ ఏడాది ఖరీఫ్‌ నుంచే అమలు చేస్తామని ప్రకటన చేసింది. కానీ, సాగు పనులు ప్రారంభమైనప్పటికీ ఇంత వరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. ప్రభు త్వం మళ్లీ దీని ఊసెత్తకపోవడంతో పెట్టుబడి సాయం వస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లా రైతులు మాత్రం ‘రైతు భరోసా’ కోసం ఎదురు చూస్తున్నారు.

గత ప్రభుత్వం ‘రైతు బంధు’ పేరుతో ఎకరానికి రూ. 5వేల చొప్పున ఏడాదికి రెండు సీజన్లలో పంట పెట్టు బడిని అందజేసింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా దీనిని కొనసాగించి మొన్నటి ఎండాకాలం సీజన్‌లో పాత విధానంలోనే రైతులకు పెట్టుబడిని అందజేసింది. జిల్లా లో మొత్తం 2,73,595 మంది రైతులు 4,42, 882 ఎకరాలకు గాను రూ. 271.44కోట్లు రైతు ల ఖాతాల్లో పడ్డాయి. అయితే, రైతుభరోసా పథకం కింద ఖరీఫ్‌ నుంచి రైతులకు ఏడాదికి రూ. 15వేలు ఇవ్వాల్సి ఉంది. పెట్టుబడి డబ్బు లు ఇంకా రాకపోవడంతో రైతులు సొంతంగా విత్తనాలు, మందులు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. చాలామంది సాగు పనులు ప్రారంభించారు. చిన్న, సన్నకారు రైతులకైనా పెట్టుబ డి సాయాన్ని అందజేయాలని కోరుతున్నారు.

బోనస్‌ మాటేంటి..?
ఎన్నికలకు ముందు వరికి రూ. 500 బోనస్‌ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ గెలిచిన తర్వాత కేవలం సన్నాలకు మాత్రమే బోనస్‌ ఇస్తామని ఇటీవల ప్రకటించింది. దీంతో రైతులంతా దొడ్డు రకాల నుంచి సన్నాల వైపు మళ్లారు. ఎక్కువగా బీపీటీ రకాల విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సీజన్‌లో పండించిన ధాన్యానికి బోనస్‌ వస్తుందా లేదా అని చాలామంది రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది లా ఉండగా వ్యాపారులతో ఒప్పందం చేసు కుని సీడ్‌ విత్తనాలు సాగు చేస్తున్న రైతుల్లో కొంత ఆందోళన నెలకొంది. సీడ్‌ విత్తనాలు సాగు చేస్తున్నామని చెబితే ప్రభుత్వం బోనస్‌ ఇస్తుందో లేదోనని వ్యవసాయాధికారులకు సరైన సమాచారం ఇవ్వడం లేదు. రైతులు సమాచారం ఇవ్వకపోవడంతో పంటల నమోదుకు ఏఈవోలు ఇబ్బందులు పడుతున్నారు.

పెట్టుబడి సాయం ఇవ్వాలి
ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఈ సీజన్‌ నుంచే రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందజేయాలి. ఇప్పటికే ఆలస్యమైంది. సొంత ఖర్చులతో విత్తనాలు, ఎరువుల కొనుగోలు చేస్తున్నాం. వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు చేసి చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవాలి.
– ఆరే గంగాధర్‌, రైతు, మారంపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement