తెలంగాణ సర్కార్‌ సంచలన నిర్ణయం.. వారికి రైతుబంధు కట్‌! | Rythu Bandhu Cut For 7% Farmers In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ సర్కార్‌ సంచలన నిర్ణయం.. వారికి రైతుబంధు కట్‌!

Published Wed, Mar 13 2024 12:04 PM | Last Updated on Wed, Mar 13 2024 12:27 PM

Rythu Bandhu Cut For Seven Percent Farmers In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రైతుబంధు విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రైతుబంధులో సీలింగ్‌ను ప్రభుత్వం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఏడు శాతం రైతులకు రైతు బంధును కట్‌ చేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

వివరాల ప్రకారం.. తెలంగాణలో రైతుల కోసం అమలవుతున్న రైతుబంధు పథకంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతుబంధులో సీలింగ్‌ను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఏడు శాతం రైతులకు రైతుబంధును కట్‌ చేయడానికి నిర్ణయించింది. ఈ ఏడు శాతంలో పాడుబడ్డ భూములు(సాగులో లేని భూములు), ట్యాక్స్‌ పేయర్స్‌, పలువురు పొలిటికల్‌ లీడర్లకు సంబంధించిన భూములు ఉన్నాయి. వీరి భూములకు రైతు బంధు కట్‌ చేసేందుకు కేబినెట్‌ కూడా ఆమోదం తెలిపినట్టు సమాచారం.

మరోవైపు.. రాష్ట్రంలో రైతు భరోసా అమలు సమయానికి మరింత సీలింగ్‌ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఇప్పటి వరకు 84 శాతం రైతులకు రైతుబంధు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. మరో రెండు రోజుల్లో 93 శాతం మందికి రైతుబంధు నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో, త్వరలోనే రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ కానున్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement