‘ఫార్మా సిటీ’పై అధికారులకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ భూములకు సంబంధించి పిటి షన్లు దాఖలు చేసిన రైతుల నుంచి రైతుబంధు దరఖాస్తులు స్వీక రించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. వారంలో గా ఈ దరఖాస్తులను స్వీకరించాల ని స్పష్టం చేస్తూ మధ్యంతర ఉత్తర్వు లు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. ప్రతిపాదిత ఫార్మా సిటీలో భూములున్న రైతులు, భూ యజమాను లకు రెవెన్యూ అధికారులు అడ్డంకులు సృష్టిస్తు న్నారని కుర్మిద్దకు చెందిన పి.నరసింహతోపాటు మరో 37 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇలాగే మరికొందరు కూడా పిటిషన్లు దాఖలు చేశారు.
మేడిపల్లి, కుర్మిడ గ్రామాలకు చెందిన పిటిషనర్లు భూసేకరణ ప్రక్రియను సవాల్ చేసి విజయం సాధించామన్నారు. నానక్ నగర్‌కు చెందిన పిటిషనర్లు దాఖలు చేసిన కేసు లకు సంబంధించి కోర్టు స్వాధీన ప్రక్రియపై స్టే విధించిందని.. అయినా అధికారులు తమ భూ ములను నిషిద్ధ జాబితాలోనే కొనసాగించడంతో రైతుబంధు పథకం, పంట రుణాలు, భూముల లావాదేవీలు వంటి ప్రయోజనాలు లేకుండా పోయాయని పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు.
పిటిష నర్ తరఫు న్యాయవాది రవికుమార్ వాదనలు వినిపిస్తూ.. ఫార్మా సిటీకోసం వారి భూములను సేకరించేందుకు జారీచేసిన నోటిఫికేషన్‌ను పరి హారం ప్రకటించినప్పటి నుంచి రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నా రు. రైతుల భూమి వివరాలను రెవె న్యూ రికార్డుల్లో నమోదు చేయడా నికి అధికారులు అనుమతించడం లేదని, వ్యవసాయ భూములకు పూర్తి యాజమాన్య హక్కులను పొందకుండా నిరోధిస్తున్నారని చె ప్పారు. ఫార్మాసిటీని ఏర్పాటు చేయ బోమని సీఎం రేవంత్ పత్రికా ప్రకటన లు చేయడంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పేర్కొందని వెల్లడించారు.
ఫార్మా సిటీపై అప్పీల్ పెండింగ్‌లో ఉంది..
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎ.సు దర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ’ఏర్పాటు ప్రతిపాదనను రద్దు చేసినట్టు వస్తున్న వార్తలు నిరాధారమైనవన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుకు 2016, జూన్ 10న ప్రభుత్వం జారీ చేసిన జీవో 31కి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంది. రైతులతో చర్చలు జరిపి న్యాయమైన, సహేతుకమైన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటుంది.
పరిహారంతోపాటు రైతుబంధు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం. సింగిల్ జడ్జి భూసేకరణ పరిహార ఉత్తర్వులను గత ఆగస్టులో రద్దు చేశారు. దీనిపై ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. అప్పీల్ పెండింగ్‌లో ఉంది’అని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ల నుంచి రైతుబంధుకు దరఖాస్తులు స్వీకరించాలని ఆర్డీవోను ఆదేశించారు. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment