
సాక్షి, హైదరాబాద్: మైక్రో ఏటీఎంలు అందు బాటులోకి తెచ్చి బ్యాంకులు, ఏటీఎంల వరకు వెళ్లాల్సిన పని లేకుండా ఊళ్లలోనే రైతు బంధు నగదు అందజేస్తున్న తపాలాశాఖ.. ఏరువాక పున్నమి సందర్భంగా వినూత్న కార్య క్రమానికి శ్రీకారం చుట్టింది. పొలం దున్నకాల్లో తలమునకలై ఉన్న రైతుల వద్దకే వెళ్లి హ్యాండ్ హెల్డ్ మైక్రో ఏటీఎంల ద్వారా వారి బయోమెట్రిక్ తీసు కుని అక్కడికక్కడే రైతుబంధు నగదు అంద జేసింది. ఈ విధానానికి రైతుల నుంచి హర్షం వ్యక్త మవుతోంది. తాజా విడతకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు తపాలాశాఖ లక్ష మందికి పైగా రైతులకు రూ.66 కోట్ల నగదు అందజేసింది.
Comments
Please login to add a commentAdd a comment