
సాక్షి, నల్గొండ : రాష్ట్రంలోని రైతులందరికి శుక్రవారం నుంచే రైతు బంధు చెక్కులను అందిస్తామని అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. గురువారం ఆయన నల్గొండ బహిరంగ సభలో మాట్లాడుతూ.. రైతు బంధు చెక్కుల పంపిణీకి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. చెక్కుల పంపిణీ నిలిపి వేయడానికి కాంగ్రెస్ కుట్రలు పన్నిందని ఆరోపించారు. చెక్కులు పంపిణీని నిలిపివేయాలని కాంగ్రెస్‌నేత మర్రి శశిథర్ కోర్టుకు పోతే చెంపలు వాయించి పంపింది. రైతుల పొట్ట కొట్టొందని మొట్టిచెంపలు వేసింది’ అని కేసీఆర్ సభలో పేర్కొన్నారు. రేపటి నుంచే చెక్కుల పంపిణీ చేపడతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment