రైతులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి
సీఎస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించిన బీఆర్‌ఎస్ నేతలు
కేసీఆర్ వస్తున్నారనే గాయత్రి పంప్‌హౌస్ ద్వారా నీళ్లు వదిలారు
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈ నెల 5న కరీంనగర్‌కు వస్తున్నా రని తెలిసే గాయత్రి పంప్‌హౌస్ ద్వారా నీళ్లను లిఫ్ట్ చేసి వదులుతున్నారని మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఉద్యమ కాలంలో చేనేత కారి్మకులను ఆదుకునేందుకు జోలె పట్టిన కేసీఆర్ ప్రస్తుతం రైతులకు ధైర్యం చెప్పేందుకు పంటల పొలాలకు వెళ్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కలిసి వినతిపత్రం సమర్పించింది.
రైతుబంధు సకాలంలో రాకపోవడం, రైతు రుణమాఫీ జరగకపోవడంతో రైతులు ఒత్తిడి ఎదుర్కొంటున్నారని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. 3 నెలల్లోనే 200మందికి పైగా రైతులు మరణించారని, 20 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని హైదరాబాద్‌లోనూ తాగునీటి ఇబ్బందులు తీవ్రమయ్యా యని పేర్కొన్నారు. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి ఎకరాకు రూ.25వేల చొప్పున పరిహారం, క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని కోరారు.
రూ.2లక్షల రుణమాఫీని తక్షణమే అమ లు చేయాలని, రైతుభరోసా కింద ఎకరాకు రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎస్‌ను కలిసిన బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందంలో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కేపీ వివేకానంద, కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, శేరి సుభా‹Ùరెడ్డి, దండె విఠల్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యదర్శి రమేశ్‌రెడ్డి ఉన్నారు.
ఎన్నాళ్లు కేసీఆర్‌పై అబద్ధపు ప్రచారాలు?
అనంతరం తెలంగాణ భవన్‌లో జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతాంగం కష్టాల్లో ఉందనే సోయి లేకుండా సీఎం రేవంత్‌రెడ్డి మూటలతో ఢిల్లీకి పోవడమే సరిపోతోందని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌పై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment