ఉద్యమ కాలం నాటి ఉప్పెనలా లేవాలి.. | Songs written by KCR for TRS campaign | Sakshi
Sakshi News home page

ఉద్యమ కాలం నాటి ఉప్పెనలా లేవాలి..

Published Sat, Nov 24 2018 2:49 AM | Last Updated on Sat, Nov 24 2018 2:49 AM

Songs written by KCR for TRS campaign - Sakshi

తెలంగాణ ఇప్పుడిప్పుడే చల్లబడుతూ ఉన్నది 
కుట్రలన్నీ ఛేదించి కుదుట పడుతు ఉన్నది.. 
 
చిగురు వేసి చిందులేసి...మొగ్గ తొడుగుతున్నది 
పూతపూసి కాత కాసి.. చేతికందనున్నది 
 
ఇంతలోనే కక్షగట్టి కూటమి వస్తున్నది.. 
అభివృద్ధిని అడ్డుకునే ఆపద వస్తున్నది..

 
కుట్రలన్ని తిప్పికొట్టి..ప్రజలంతా జట్టుకట్టి.. 
ఉద్యమ కాలం నాటి ఉప్పెనలా లేవాలి.. 
 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని తిరిగి తెచ్చుకోవాలి.. 
కేసీఆర్‌ కలలన్నీ పరిపూర్ణం కావాలి..   
 
తెలంగాణ తల్లి సంకెళ్లను తెంపాలని.. 
తెలంగాణ∙బతుకులలో పచ్చదనం నింపాలని 
నడుం కట్టి కేసీఆర్‌ ఎక్కిన కొండలు ఎన్ని.. మొక్కిన బండలెన్ని.. 
నాయకుడై వెచ్చించిన కాలమెంత..కన్నీరెంత 
రంది పడ్డ తన గుండెలో తపన ఎంత.. తపస్సు ఎంత 
అంత మరిచిపోదామా... 
గుంతలోన పడదామా.... 
మన కళ్లను మన వేళ్లతో మనమే పొడుచుకుందామా.. 
చావునోట్లో తలపెట్టి.. కేసీఆర్‌ సాధించిన రాష్ట్రాన్ని  
చేజేతులా జారవిడుచుకుందామా..  
 
తెలంగాణ రాష్ట్రమొస్తే చిమ్మచీకటైతదని  
శాసనసభ నడిబొడ్డున తెలంగాణ వాళ్లకు ఒక రూపాయి ఇవ్వనన్న  
కిరికిరి పరిపాలకుల హేళన కావాలా.. 
24 గంటలు కరెంటు వెలుగందించే రైతు బంధు 
కేసీఆర్‌ పాలన కావాలా.. 

పొలాలన్నీ ఎండబెట్టి.. బతుకు మీద మట్టికొట్టి.. 
వలసల పాల్జేసే నరక యాతన కావాలా.. 
ఆకుపచ్చ తెలంగాణ అందరికీ చెందాలనే ఆత్మగళ్ల 
కేసీఆర్‌ చేతన కావాలా 
తేల్చుకునే సమయమిది.. గెలవాల్సిన సమరమిది.. 
 
నీతి మాలిన కూటమి కుట్రను ఓడగొట్టాలి.. 
అత్తరబిత్తర పొత్తులు తత్తరపడి పోవాలి 

 
నిండు బొక్కెనను మధ్యలో తెంపకుండా చూడాలి.. 
మండుతున్న కుండ పగులగొట్టెటోళ్లను ఆపాలి 
అందబోయే ఫలం ప్రజల ఇళ్ల దాకా చేరాలి..  
 
మళ్లీ కేసీఆరే మనకు సీఎంగా రావాలి 
ఓట్ల దండ కేసీఆర్‌ మెళ్లో మనం వేయాలి.  

ఆఆ..కళళలాడే చెరువులనడుగు..
కాళేశ్వర ప్రాజెక్టును అడుగు.. 
కల్వకుర్తి ఎత్తిపోతలనడుగు.. కాల్వల పారే నీళ్లను అడుగు.. 
పాడి పంటల పల్లెలనడుగు..కొత్తగేర్పడిన జిల్లలను అడుగు 
24 గంటలు వచ్చే ఇరాం లేని కరెంటు నడుగు..చల్‌ 
 
ఎందుకు వేయాల్నో...కారుకు ఎందుకు ఓటెయ్యాల్నో... 
ఎందుకు వేయాల్నో...సారును ఎందుకు గెలిపించాల్నో.. 
సారు కేసీఆర్‌.. సర్కారు మళ్లా ఎందుకు రావాల్నో.. 
కారుకు ఓటేసి..కేసీఆర్‌ను ఎందుకు గెలిపించాలో.. 
అడుగూ.. చెబుతవి.. 

 
ఆ..ఆసర పింఛన్‌ అందుకున్న మా అవ్వతాతల నవ్వులనడుగు.. 
పెరిగిన రేషన్‌ బియ్యంతోని కడుపునిండిన పేదలనడుగు 
కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ కానుక పొందిన చెల్లెల్ని అడుగు... 
ఇంటింటిలో వెలుగులు నింపిన కంటివెలుగు కనురెప్పలనడుగు 
మా కేసీఆర్‌ కిట్లను అడుగు..అమ్మ ఒడి ఆత్మీయతనడుగు... సర్కారు బడిలో సన్న బువ్వ తిని సదువుకుంటున్న పిల్లలనడుగు.. 
 
ఎందుకు వేయాల్నో కారుకు ఎందుకు ఓటెయ్యాల్నో... 
కారుకు ఓటేసి కేసీర్‌ను ఎందుకు గెలిపించాల్నో.. 
ఎందుకు వేయాల్నో...కారుకు ఎందుకు ఓటేయాల్నో 
సారు కేసీఆర్‌..సర్కారు మళ్లా ఎందుకు రావాల్నో 
అడుగు బై..చెబుతది... 
 
ఆ...నిండిన చెరువు నీళ్లపైన వెండి మెరుపుల తీగను అడుగు... 
ముదిరాజులకు భరోస నింపిన చెరువుల ఈదే చేపలనడుగు... 
కుర్మ గొ ల్ల..మా యాదవన్నల గొర్రె పిల్లల మందలనడుగు.. 
గౌడన్నల మా గడపలనడుగు...బీడి కార్మికుల బతుకులనడుగు.. 
చేనేత మగ్గాలను అడుగు..చేతివృత్తుల చేతులనడుగు 
సారు కేసీఆర్‌ సర్కారు నిలవెట్టిన కులవృత్తులనడుగు..చల్‌ 
ఎందుకు వేయాల్నో..కారుకు ఓటెందుకు వేయాల్నో 
చెబుతది..ఎందుకు వేయాల్నో సారును ఎందుకు గెలిపించాల్నో..
కారుకు ఓటేసి..కేసీఆర్‌ను ఎందుకు గెలిపించాల్నో.. 
సారు కేసీఆర్‌ సర్కారు మళ్లా ఎందుకు రావాల్నో... 
అవే చెబ్తయ్‌..అడగరాదే..అన్న 
 
రైతుబంధును అందుకున్న మా అన్నదాతల ఆనందాన్నడుగు 
బీమాతోని ధీమా పెరిగిన రైతుల గుండె చప్పుడునడుగు 
అహ..మిషన్‌ భగీరథ నల్లా నీళ్లతో మిన్నంటిన ఆనందాన్నడుగు 
ఆశా వర్కర్లను అడుగు..అంగన్‌వాడీ అక్కలనడుగు.. 
మా కళాకారుల దరువులనడుగు..తెలుగు మహాసభ ఖ్యాతిని అడుగు...బోనాల వైభోగాన్నడుగు..బతుకమ్మ ఆటపాటనడుగు... 
ఎందుకు వేయాల్నో కారుకు ఓటెందుకు వేయాల్నో.. 
ఎందుకు వేయాల్నో సారును ఎందుకు గెలిపించాల్నో 
కారుకు ఓటేసి కేసీఆర్‌ను ఎందుకు గెలిపించాల్నో... 
సారు కేసీఆర్‌ సర్కారు మళ్లా..ఎందుకు రావాల్నో... 
 ఇంకా ఏమన్న డౌటుంటే..నన్నడుగు చెప్తా...  
...:: సేకరణ: పిన్నింటి గోపాల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement