trs campaign
-
ఉద్యమ కాలం నాటి ఉప్పెనలా లేవాలి..
తెలంగాణ ఇప్పుడిప్పుడే చల్లబడుతూ ఉన్నది కుట్రలన్నీ ఛేదించి కుదుట పడుతు ఉన్నది.. చిగురు వేసి చిందులేసి...మొగ్గ తొడుగుతున్నది పూతపూసి కాత కాసి.. చేతికందనున్నది ఇంతలోనే కక్షగట్టి కూటమి వస్తున్నది.. అభివృద్ధిని అడ్డుకునే ఆపద వస్తున్నది.. కుట్రలన్ని తిప్పికొట్టి..ప్రజలంతా జట్టుకట్టి.. ఉద్యమ కాలం నాటి ఉప్పెనలా లేవాలి.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరిగి తెచ్చుకోవాలి.. కేసీఆర్ కలలన్నీ పరిపూర్ణం కావాలి.. తెలంగాణ తల్లి సంకెళ్లను తెంపాలని.. తెలంగాణ∙బతుకులలో పచ్చదనం నింపాలని నడుం కట్టి కేసీఆర్ ఎక్కిన కొండలు ఎన్ని.. మొక్కిన బండలెన్ని.. నాయకుడై వెచ్చించిన కాలమెంత..కన్నీరెంత రంది పడ్డ తన గుండెలో తపన ఎంత.. తపస్సు ఎంత అంత మరిచిపోదామా... గుంతలోన పడదామా.... మన కళ్లను మన వేళ్లతో మనమే పొడుచుకుందామా.. చావునోట్లో తలపెట్టి.. కేసీఆర్ సాధించిన రాష్ట్రాన్ని చేజేతులా జారవిడుచుకుందామా.. తెలంగాణ రాష్ట్రమొస్తే చిమ్మచీకటైతదని శాసనసభ నడిబొడ్డున తెలంగాణ వాళ్లకు ఒక రూపాయి ఇవ్వనన్న కిరికిరి పరిపాలకుల హేళన కావాలా.. 24 గంటలు కరెంటు వెలుగందించే రైతు బంధు కేసీఆర్ పాలన కావాలా.. పొలాలన్నీ ఎండబెట్టి.. బతుకు మీద మట్టికొట్టి.. వలసల పాల్జేసే నరక యాతన కావాలా.. ఆకుపచ్చ తెలంగాణ అందరికీ చెందాలనే ఆత్మగళ్ల కేసీఆర్ చేతన కావాలా తేల్చుకునే సమయమిది.. గెలవాల్సిన సమరమిది.. నీతి మాలిన కూటమి కుట్రను ఓడగొట్టాలి.. అత్తరబిత్తర పొత్తులు తత్తరపడి పోవాలి నిండు బొక్కెనను మధ్యలో తెంపకుండా చూడాలి.. మండుతున్న కుండ పగులగొట్టెటోళ్లను ఆపాలి అందబోయే ఫలం ప్రజల ఇళ్ల దాకా చేరాలి.. మళ్లీ కేసీఆరే మనకు సీఎంగా రావాలి ఓట్ల దండ కేసీఆర్ మెళ్లో మనం వేయాలి. ఆఆ..కళళలాడే చెరువులనడుగు.. కాళేశ్వర ప్రాజెక్టును అడుగు.. కల్వకుర్తి ఎత్తిపోతలనడుగు.. కాల్వల పారే నీళ్లను అడుగు.. పాడి పంటల పల్లెలనడుగు..కొత్తగేర్పడిన జిల్లలను అడుగు 24 గంటలు వచ్చే ఇరాం లేని కరెంటు నడుగు..చల్ ఎందుకు వేయాల్నో...కారుకు ఎందుకు ఓటెయ్యాల్నో... ఎందుకు వేయాల్నో...సారును ఎందుకు గెలిపించాల్నో.. సారు కేసీఆర్.. సర్కారు మళ్లా ఎందుకు రావాల్నో.. కారుకు ఓటేసి..కేసీఆర్‌ను ఎందుకు గెలిపించాలో.. అడుగూ.. చెబుతవి.. ఆ..ఆసర పింఛన్ అందుకున్న మా అవ్వతాతల నవ్వులనడుగు.. పెరిగిన రేషన్ బియ్యంతోని కడుపునిండిన పేదలనడుగు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ కానుక పొందిన చెల్లెల్ని అడుగు... ఇంటింటిలో వెలుగులు నింపిన కంటివెలుగు కనురెప్పలనడుగు మా కేసీఆర్ కిట్లను అడుగు..అమ్మ ఒడి ఆత్మీయతనడుగు... సర్కారు బడిలో సన్న బువ్వ తిని సదువుకుంటున్న పిల్లలనడుగు.. ఎందుకు వేయాల్నో కారుకు ఎందుకు ఓటెయ్యాల్నో... కారుకు ఓటేసి కేసీర్‌ను ఎందుకు గెలిపించాల్నో.. ఎందుకు వేయాల్నో...కారుకు ఎందుకు ఓటేయాల్నో సారు కేసీఆర్..సర్కారు మళ్లా ఎందుకు రావాల్నో అడుగు బై..చెబుతది... ఆ...నిండిన చెరువు నీళ్లపైన వెండి మెరుపుల తీగను అడుగు... ముదిరాజులకు భరోస నింపిన చెరువుల ఈదే చేపలనడుగు... కుర్మ గొ ల్ల..మా యాదవన్నల గొర్రె పిల్లల మందలనడుగు.. గౌడన్నల మా గడపలనడుగు...బీడి కార్మికుల బతుకులనడుగు.. చేనేత మగ్గాలను అడుగు..చేతివృత్తుల చేతులనడుగు సారు కేసీఆర్ సర్కారు నిలవెట్టిన కులవృత్తులనడుగు..చల్ ఎందుకు వేయాల్నో..కారుకు ఓటెందుకు వేయాల్నో చెబుతది..ఎందుకు వేయాల్నో సారును ఎందుకు గెలిపించాల్నో.. కారుకు ఓటేసి..కేసీఆర్‌ను ఎందుకు గెలిపించాల్నో.. సారు కేసీఆర్ సర్కారు మళ్లా ఎందుకు రావాల్నో... అవే చెబ్తయ్..అడగరాదే..అన్న రైతుబంధును అందుకున్న మా అన్నదాతల ఆనందాన్నడుగు బీమాతోని ధీమా పెరిగిన రైతుల గుండె చప్పుడునడుగు అహ..మిషన్ భగీరథ నల్లా నీళ్లతో మిన్నంటిన ఆనందాన్నడుగు ఆశా వర్కర్లను అడుగు..అంగన్వాడీ అక్కలనడుగు.. మా కళాకారుల దరువులనడుగు..తెలుగు మహాసభ ఖ్యాతిని అడుగు...బోనాల వైభోగాన్నడుగు..బతుకమ్మ ఆటపాటనడుగు... ఎందుకు వేయాల్నో కారుకు ఓటెందుకు వేయాల్నో.. ఎందుకు వేయాల్నో సారును ఎందుకు గెలిపించాల్నో కారుకు ఓటేసి కేసీఆర్‌ను ఎందుకు గెలిపించాల్నో... సారు కేసీఆర్ సర్కారు మళ్లా..ఎందుకు రావాల్నో... ఇంకా ఏమన్న డౌటుంటే..నన్నడుగు చెప్తా... ...:: సేకరణ: పిన్నింటి గోపాల్ -
టీఆర్ఎస్ హయాంలోనే గొల్ల, కురుమలకు ప్రాధాన్యం
సాక్షి, తాండూరు టౌన్: గొల్ల, కురుమ, యాదవులను ఆదుకున్నది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. స్థానిక భవానీ ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన ఆ సంఘం సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గొల్లకురుమలు మంత్రికి గొంగడి కప్పి, గొర్రె పిల్లను బహూకరించారు. అనంతరం మహేందర్‌రెడ్డి డోలు వాయించి అందరినీ ఉత్సాహపరిచారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. కనుమరుగవుతున్న కుల వృత్తులను పరిరక్షించేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారన్నారు. ఉపాధి లేక వలస పోతున్న వారికి ఉన్న ఊర్లోనే ఉపాధి చూపించేందుకు పలు సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చారని తెలిపారు. గొల్ల, కురుమలకు గొర్రెలు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వంపై విపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేశాయని మండిపడ్డారు. గొర్రెలు, బర్రెలు ఇచ్చింది విద్యార్థులు వాటిని కాస్తూ బతకమని కాదన్నారు. వారి తల్లిదండ్రులను ఆర్థికంగా బలోపేతం చేసి విద్యార్థుల ఉన్నత చదువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకే జీవాలు, పాడి గేదెలు అందజేశామని స్పష్టంచేశారు. రాజకీయంగా కూడా గొల్ల, కురుమలకు ప్రభుత్వం పెద్ద పీట వేసిందని, లింగయ్యయాదవ్‌ను రాజ్యసభకు పంపిందని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పటికీ మటన్, చేపలు వంటివి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. దీన్ని అరికట్టేందుకే మన రాష్ట్రంలోనే వీటిని పెంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసి ఆర్థిక పుష్టి సాధించేందుకే సీఎం ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారని తెలిపారు. ఇంకా గొర్రెలు దక్కని వారికి తిరిగి టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. తాండూరులో గొల్ల, కురుమలకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఇప్పటికే ఎకరా స్థలంతో పాటు రూ.20 లక్షల ఆర్థిక సాయం అందజేశామన్నారు. నిర్మాణానికి అవసరమైన పూర్తి నిధులను ప్రభుత్వం నుంచి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఆయా కుల సంఘాల వారు శుభకార్యాలు చేసుకునేందుకు ప్రభుత్వం కమ్యూనిటీ హాళ్లను మంజూరు చేసి ప్రొసీడింగ్స్ ఇస్తే.. వాటిని చిత్తు కాగితాలని చెబుతున్న కొందరు నేతల మాటలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. ముందుస్తు ఎన్నికలు రాకపోతే ఈ సమాయానికి కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం పూర్తయ్యేదని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు పలికి, కారు గుర్తుకే ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నాగారం నర్సింలు, టీఆర్ఎస్ నాయకులు కరణం పురుషోత్తంరావు, సిద్రాల శ్రీనివాస్, సాయిలుగౌడ్, గౌడి వెంకటేశం, కోహిర్ శ్రీనివాస్, పూజారి పాండు, వెంకటయ్య, శకుంతల, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టులను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: కేటీఆర్
తెలంగాణలో కోటి ఎకరాలకు సాగు నీరందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తుంటే కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఆదివారం యాదగిరిగుట్ట సమీపంలోని యాదగిరిపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్టులపై కేసులు వేయడం కాంగ్రెస్ కుసంస్కారానికి నిదర్శనమన్నారు. సాగునీరు రావాలంటే మాయా కూటమికి బుద్ధి చెప్పాలన్నారు. సాక్షి, యాదాద్రి : తెలంగాణలోని కోటి ఎకరాలకు నీళ్లు తీసుకురావడానికి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తే కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఆదివారం యాదగిరిగుట్టలో జరి గిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. ప్రాజెక్టులపై కేసులు వేయడం కాంగ్రెస్ కుసంస్కారానికి నిదర్శనమన్నారు. గోదావరి మీద కడుతున్న కాల్వలను ఆపాలనుకుంటున్న చంద్రబాబుకు అధికారం ఇస్తే మన చేతితో మన కళ్లు పొడుచుకున్నట్లేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వార ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు 1.40లక్షల ఎకరాలకు కచ్చితంగా సాగునీరందిస్తామని ఎవరూ అడ్డుకున్నా ఆగబోవన్నారు. రాయగిరి వరకు ఎంఎంటీఎస్ పూర్తవుతుందని దాంతో ఈప్రాంతంలో టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. 2001 నుంచి ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు పట్టం కడుతూ వచ్చారన్నారు. మూడుసార్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించారని మరోసారి గెలిపించాలని ఆయన కోరారు. ఆలేరుకు సాగునీరు రావాలంటే మాయ కూటమికి బుద్ది చెప్పాలన్నారు. చేనేత, పవర్లూమ్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గతంలో ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే సవరిస్తూ గుండాలను తిరిగి యాదాద్రిభువనగిరి జిల్లాలో కలిపేందుకు సీఎం కృషి చేస్తారన్నారు. సాగునీరు అందించడమే ధ్యేయం : గొంగిడి 2014 ఎన్నికల్లో ఆలేరు ప్రజలు ఆశీర్వదించారని, అదే తరహాలో త్వరలో జరిగే ఎన్నికల్లో ఆశీర్వదించాలని ఆలేరు అసెంబ్లీ అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. ఇటీవలనే మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ యాదగిరిగుట్ట, ఆలేరు పట్టణాలను మున్సిపాలిటీలుగా మార్చడంతో పాటు వాటి అభివృద్ధికి రూ.40కో ట్లు కేటాయించారన్నారు. హెచ్ఎండీఏలో ఉన్న బొమ్మలరామారం మండలం అభివృద్ధికి రూ.5కో ట్లు కేటాయించారని తెలిపారు. కొత్తగా ఏర్పడిన మోటకొండూర్ మండలానికి మౌలిక సదుపాయాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే తీసుకువస్తానన్నారు. జిల్లా విభజనలో భాగంగా గుండాల మండలం జనగాంలో కలిసిందని, ఆ మండలాన్ని తిరిగి యాదాద్రి భువనగిరి జిల్లాలో చేర్చే విధంగా కృషి చేస్తానన్నారు. కాల్వలకు నీరు రావాలంటే .. కేసీఆర్ సీఎం కావాలి : బూర నర్సయ్యగౌడ్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ పూర్తయ్యి కాల్వలకు నీరు రావాలంటే.. కేసీఆర్ మరో సారి సీఎం కావాలని భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మల్లన్నసాగర్ నుంచి గంధమల్ల రిజర్వాయర్‌లోకి నీళ్లు తీసుకువచ్చి ఆలేరు రైతాంగానికి అందించేందుకు గొంగిడి సునీత కృషి చేస్తున్నారని తెలిపారు. 66 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాలేదని విమర్శించారు. అదే టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక బీబీనగర్‌కు నిమ్స్, భువనగిరికి కేంద్రీయ విశ్వవిద్యాలయం, పాస్‌పోర్ట్ కార్యాలయం తీసుకువచ్చామన్నారు. అంతే కాకుండా దండు మల్కాపురంలో ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేశామని, యాదగిరిగుట్ట మండలం దాతారుపల్లిలో 120 ఎకరాల్లో ప్లాస్టిక్ ఫర్నిచర్ ప్రాజెక్టుకు పునాది ప్రక్రియ మొదలైందన్నారు. కాల కూటమి పేరుతో మహా కూటమి మోసం చేయడానికి వస్తుందని దుయ్యబట్టారు. త్వరలో జరిగే ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ కుట్రల కూటమికి మధ్య జరుగుతున్నాయని తెలిపారు. విజయోత్సవ సభ : బడుగుల యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభను చూస్తుంటే ఎన్నికల ప్రచార సభలా లేదని, గొంగిడి సునీతమ్మ విజయోత్సవ సభలా ఉందని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. రేపటి ఎన్నికల్లో గొంగిడి సునీతను లక్షా మేజార్టీతో గెలిపించాలన్నారు. యాదాద్రికి సుస్థిర స్థానం : గుత్తా కేసీఆర్ నాయకత్వంలో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి దేశంలోనే సుస్థిర స్థానం లభించిందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్‌తోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నది జలాల్లో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టారని వెల్లడించారు. గులాబి శంఖారావం మోగించాలి : మందుల సామేల్ ఆరుట్ల రాంచంద్రారెడ్డి వారసులై.. ఆరుట్ల కమాలాదేవి ఆడ బిడ్డలై ఇక్కడి ప్రజలు ఆలేరు నుంచే గులాబి శంఖారావాన్ని మోగించాలని గిడ్డంగుల శాఖ సంస్థ చైర్మన్ మందుల సామేల్ అన్నారు. ఏ పార్టీ ఏ కూటమి ప్రజల ముందుకు వచ్చిన టీఆర్ఎస్ పార్టీదే ఘన విజయం అన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం కన్వీనర్ గొంగిడి మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, కర్నె ప్రభాకర్, అటవీశాఖ కార్పొరేషన్ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, ఆల్డా చైర్మన్ మోతే పిచ్చిరెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటి చైర్మన్ పడాల శ్రీనివాస్, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ మండల శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు. -
‘గ్రేటర్’ ప్రచారానికి రేపటితో తెర
జంట నగరాలను చుట్టివచ్చిన గులాబీ దళాలు రోడ్‌షోలతో హోరెత్తిన ప్రచారం రహ దారులపైనే గడిపిన మంత్రులు మంత్రి కేటీఆర్ విస్తృత పర్యటనలు నేడు పరేడ్ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారం ఆదివారంతో ముగియనుంది. తొలిసారి గ్రేటర్లో పాగా వేసేందుకు నూటా యాభై డివిజన్లలో బరిలోకి దిగిన అధికార టీఆర్ఎస్ జంట నగరాల్లో ముమ్మరంగా ప్రచారం చేసింది. ‘జీరో టు హండ్రెడ్’ నినాదంతో దాదాపు రాష్ట్ర మంత్రులంతా ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ తరపున గ్రేటర్ ఎన్నికల బాధ్యతలు చూసిన మంత్రి కేటీఆర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మంత్రులు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా జిల్లాల సీనియర్ నాయకులకు ప్రచార బాధ్యతలు అప్పజెప్పిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్... ఈ-పబ్లిసిటీలో భాగంగా తెలంగాణ భవన్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. అభ్యర్థుల ఎంపికకు ముందే టీఆర్ఎస్ నాయకత్వం గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు మంత్రులు, సీనియర్ నేతలను ఇన్చార్జులుగా నియమించింది. ఒక్కో డివిజన్ బాధ్యతను ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీకి అప్పగించి విస్తృతంగా ప్రచారం చేసింది. విశ్వనగరమే నినాదం ‘60 ఏళ్లుగా అందరికీ అవకాశం ఇచ్చారు. ఈసారి మాకు అవకాశమివ్వండి. చారిత్రక నగరమైన హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం..’ అంటూ టీఆర్ఎస్ ప్రచారం చేసింది. మేనిఫెస్టోలో పలు హామీలు ఇవ్వడంతోపాటు గత 18 నెలల కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలనూ వివరించింది. మంత్రులు తమకు అప్పజెప్పిన నియోజకవర్గాల పరిధిలోని డివిజన్లలో విస్తృతంగా తిరిగారు. బస్తీలు, కాలనీల్లో పాదయాత్రలు నిర్వహించారు. ఇంటింటి ప్రచారం, బహిరంగ సభలు నిర్వహించారు. కుల సంఘాలు, యూనియన్లు, ఆయా వర్గాల భేటీలతో టీఆర్ఎస్ వినూత్నంగా ప్రచారం చేసింది. మంత్రి కేటీఆర్ వరుసగా ఏడు రోజుల పాటు 120 చోట్ల రోడ్‌షోలలో ప్రసంగించారని టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. నేడు సీఎం బహిరంగ సభ గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి సీఎం కేసీఆర్ కేవలం మీట్ ది ప్రెస్‌లో పాల్గొనడం మినహా ఎలాంటి ప్రచారం చేయలేదు. అయితే ఎన్నికల ప్రచారం మరో ఇరవై నాలుగు గంటల్లో ముగుస్తుందనగా సికింద్రబాద్ పరేడ్ గ్రౌండ్లో శనివారం నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొంటున్నారు. ఈ సభను శనివారం సాయంత్రం 4 నుంచి 10 గంటల దాకా నిర్వహించేందుకు అనుమతి తీసుకున్నారు. నూటా యాభై డివిజన్ల నుంచి బూత్‌ల వారీగా జనాన్ని ఈ బహిరంగ సభకు సమీకరించాలని టార్గెట్ పెట్టుకున్నామని పార్టీ సీనియర్ నాయకుడొకరు చెప్పారు. సభా ప్రాంగణంలో ఇప్పటికే మూడు వేదికలు సిద్ధం చేశారు. ప్రధాన వేదికను సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేటాయించారు. రెండో వేదికను బరిలో ఉన్న అభ్యర్థులకు... మరో వేదికను పార్టీ ప్రచార కళా బృందాల ఆట పాటలకు కేటాయించారు. ఈ సభకు జనం భారీగానే హాజరవుతారని అధికార పార్టీ భావిస్తోంది. సుమారు 2 వేల మంది పోలీసులను మోహరించనున్నట్లు సమాచారం. సభా ప్రాంగణంలో 50 ఎల్ఈడీలను, సభా ప్రాంగణం నుంచి ప్రధాన మార్గాల్లో కిలోమీటరు పరిధిలో మైకులను ఏర్పాటు చేస్తున్నారు.