సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ రైతుబంధు సొమ్మును వారం, పది రోజుల్లో రైతుల ఖాతాల్లో వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ సీజన్‌లో ఎకరాకు రూ. 5 వేల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని దాదాపు 65 లక్షల మంది లబి్ధదారులకు అందించేందుకు రూ. 7,400 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ వానాకాలం సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా కోటిన్నర ఎకరాలకుపైగా ఉన్న భూములకు చెందిన రైతులకు రైతుబంధు వర్తింపజేస్తామని తెలిపాయి.
కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు, మొదటిసారి రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకొనే రైతులు ఏఈవోలను సంప్రదించి ఆయా వివరాలు సమర్పించాలని సూచించాయి. సమీకరించిన నిధుల్లోంచి నేషనల్ పేమెంట్ పోర్టల్ ద్వారా రోజువారీగా నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తామని పేర్కొ న్నాయి. మొదటి రోజున ఎకరాలోపున్న వారికే మొదట ప్రాధాన్యం ఇవ్వనుండగా మర్నాటి నుంచి ఒక్కో ఎకరా పెంచుకుంటూ నెలాఖరు వరకు అర్హులైన రైతులందరి ఖాతాల్లో నిధులు జమ చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment