Kishan Reddy.. సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెలంగాణలో రాజకీయ సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద బీజేపీ ఆందోళనలు, దీక్ష నేపథ్యంలో బండి సంజయ్ సహా కొందరు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా, బీజేపీ నేతల అరెస్ట్‌లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ అభద్రతా భావంతో ఉన్నారు. విష ప్రచారం చేయడం, అక్రమ కేసులు పెడుతున్నారు. సీఎం కార్యాలయమే స్వయంగా టీఆర్‌ఎస్ మంత్రులు, ప్రజా ప్రతినిధులను రెచ్చగొట్టి.. బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. వినాశకాలే.. విపరీత బుద్ధి అన్నట్టుగా.. త్వరలోనే కేసీఆర్ కుటుంబ, ప్రజా వ్యతిరేక పాలన నుంచి ప్రజలకు త్వరలోనే విముక్తి కలుగుతుంది. ప్రజలు కూడా ఇదే ఆశిస్తున్నారు’’ అని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. వరుస అరెస్టులపై బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈరోజు సాయంత్రం 5-6 గంటల వరకు అన్ని మండలాల్లో పార్టీ ఆఫీసుల వద్ద నిరసనలు తెలపాలని నిర్ణయించింది. నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన దీక్ష చేపట్టాలని నేతలు పిలుపునిచ్చారు. మరోవైపు.. ఉప్పుగల్, కూనూర్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో బీజేపీ ఫ్లెక్సీలకు టీఆర్‌ఎస్ కార్యకర్తలు నిప్పంటించారు.
ఇది కూడా చదవండి: మేము తలుచుకుంటే బీజేపీ నేతలు మిగులుతారా.. తలసాని మాస్ వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment