బండి సంజయ్ కుటుంబ సభ్యులతో ముచ్చటిస్తున్న ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ‘శభాష్ సంజయ్.. బాగా కష్టపడ్డారు. తెలంగాణలో పార్టీని గెలిపించడానికి ఇదేవిధంగా దూకుడు కొనసాగించండి. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై మరింత దృష్టి పెట్టండి’అని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు. కుటుంబసభ్యులతో కలిసి వెళ్లిన సంజయ్ ప్రధాని మోదీని గురువారం పార్లమెంట్‌లో కలిశారు.
జాతీ య ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తరువాత తొలిసారి ప్రధానిని కలిసిన సంజయ్ 20 నిమిషాలపాటు ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఎంతగానో కష్టపడ్డారని సంజయ్‌ను మోదీ అభినందించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు మరింత కష్టపడాలని సూచించారు. ఈ సందర్భంగా సంజయ్ కుటుంబసభ్యులతో ఫొటోలు దిగడంతోపాటు వారి యోగ క్షేమాలను మోదీ అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment