కరీంనగర్‌టౌన్/హుజూరాబాద్: రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో జరిగే అభివృద్ధి పనులన్నింటికీ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వమే నిధులిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు పైసా ఇవ్వడం లేదని, పంచాయతీ సిబ్బందికి జీతాలు, కరెంటు బిల్లులు సహా అన్నింటికీ కేంద్రనిధులనే వాడుకుంటున్నారన్నారు.
‘గావ్ చలో అభియాన్’ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా రంగాపూర్ గ్రామానికి వచ్చి న బండి.. రాత్రి పొద్దుపోయే వరకూ గ్రామంలో పర్యటించారు. వివిధ వర్గాల ప్రజలను కలిశారు. పార్టీ బూత్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. మహిళలతో ముచ్చటించారు. కాగా, అంతకుముందు ఆయన కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాల్లో విజయం సాధించడమే బీజేపీ లక్ష్యమన్నారు.
‘గావ్ చలో అభియాన్’లో భాగంగా ప్రతి నేత గ్రామాల్లో పల్లెనిద్ర, నగరాల్లో బస్తీ నిద్ర చేయాలన్నారు. 24 గంటలపాటు ఆ గ్రామంలో, బస్తీలో ఉండి ప్రజలతో, కార్యకర్తలతో మమేకం కావాలని తెలిపారు. రాజకీయ పారీ్టల నేతల భవిష్యత్తు బాగుండాలంటే వారంతా బీజేపీలో చేరడం ఉత్తమమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment