కథలాపూర్ మండలం దూంపేటలో ప్రజాహిత యాత్రలో ఎంపీ బండి సంజయ్
కరీంనగర్: ప్రధాని నరేంద్రమోదీతో దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనుల్లో కేంద్ర ప్రభుత్వం నిధులే అధికమని వివరించారు. ఆదివా రం రెండో రోజు ప్రజాహిత యాత్ర కథలాపూర్ మండలం సిరికొండ, కథలాపూర్, దుంపేట, దూలూర్, పోసానిపేట, తాండ్య్రాల, అంబారిపేట, కలిగోట గ్రామాతో పాటు రుద్రంగి, చందుర్తి మండలాల్లో కొనసాగింది.
ఈ సందర్భంగా స్థానిక మహిళలు భారీ ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. బండి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, మొక్కల పెంపకం, మరుగుదొడ్ల నిర్మాణాలు, చెత్త సేకరణకు ట్రై సైకిళ్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో ఇంటింటా తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
కలిగోట సూరమ్మ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి కాలువలు నిర్మిస్తే ఈ ప్రాంతానికి సాగునీటి సమస్య తీరుతుందని ప్రజలు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. పలు గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ప్రజలు విన్నవించగా.. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో తారు రోడ్లు నిర్మించామని, మరోసారి అధికారంలోకి వచ్చాక మండలంలోని అన్ని గ్రామాల్లో రోడ్డు సౌకర్యం మెరుగుపరుస్తామని తెలిపారు.
పలువురు యువకులు ఎంపీతో సెల్పీ ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఆయా గ్రామాల్లో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, ఛత్రపతి శివాజీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. రుద్రంగిలోని ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాన్ని సందర్శించారు. చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ప్రజలను పలకరిస్తూ, సమస్యలు తెలుసుకుంటూ ముందుకుసాగింది.
లింగంపేటలోని రేషన్‌షాపులలో పేదలకు అందిస్తున్న బియ్యాన్ని పంపిణీ చేశా రు. అక్కడ ఉన్న వారితో ఉపాధిహామీ పథకం గు రించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏడు పథకాల గురించి వారికి వివరించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, బీజేపీ నియోజకవర్గ నేత చెన్నమనేని వికాస్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరావు, ప్రతాప రామకృష్ణ ఎంపీ సంజయ్‌కుమార్‌కు మద్దతు ప్రకటించి పాదయాత్ర చేశారు.
Comments
Please login to add a commentAdd a comment