‘బండి’ది ఓట్ల రాజకీయం..! | Sakshi
Sakshi News home page

‘బండి’ది ఓట్ల రాజకీయం..!

Published Thu, Feb 22 2024 1:36 AM

- - Sakshi

కరీంనగర్‌: ఇన్నాళ్లు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ పార్లమెంట్‌ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఓట్ల రాజకీయానికి తెరలేపారని కరీంనగర్‌, జగిత్యాల, హన్మకొండ జెడ్పీ చైర్మన్లు కనుమల్ల విజయ, దావ వసంత, సుధీర్‌బాబు ఆరోపించారు. కరీంనగర్‌లోని ఓ హోటల్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఎంపీగా ఐదేళ్లలో గ్రామాల అభివృద్ధి గురించి పట్టించుకోని సంజయ్‌ సర్పంచ్‌ల పదవీ కాలం ముగిశాక సానుభూతి చూపిస్తూ మొసలి క న్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ను అబాసుపాలు చేయడానికే సర్పంచులకు రావాల్సి న బిల్లులపై పోరాటం చేస్తామని ఓట్ల జిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ బెస్ట్‌ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారని గుర్తు చేశారు.

ఎంపీగా ఏం చేశావో చెప్పి ఓట్లు అడగాలని స్పష్టం చేశారు. శ్రీరాముని ఫొటో, అక్షింతలు పంపి సెంటిమెంట్‌తో ఓట్లు దండుకునే ప్రయత్నం సరికాదన్నారు. ఇప్పటికైనా సంజయ్‌ అభివృద్ధిపై అబద్ధాలు మాట్లాడడం మానుకోవాల ని హితవు పలికారు. బీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, నాయకులు మారుతి, నయీం పాల్గొన్నారు.

ఇవి చదవండి: ఎన్నికల సమయంలోనే రాజకీయాలు

Advertisement
 
Advertisement
 
Advertisement