vasanthi
-
‘బండి’ది ఓట్ల రాజకీయం..!
కరీంనగర్: ఇన్నాళ్లు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఎంపీ బండి సంజయ్‌కుమార్ పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఓట్ల రాజకీయానికి తెరలేపారని కరీంనగర్, జగిత్యాల, హన్మకొండ జెడ్పీ చైర్మన్లు కనుమల్ల విజయ, దావ వసంత, సుధీర్‌బాబు ఆరోపించారు. కరీంనగర్‌లోని ఓ హోటల్లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంపీగా ఐదేళ్లలో గ్రామాల అభివృద్ధి గురించి పట్టించుకోని సంజయ్ సర్పంచ్ల పదవీ కాలం ముగిశాక సానుభూతి చూపిస్తూ మొసలి క న్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ను అబాసుపాలు చేయడానికే సర్పంచులకు రావాల్సి న బిల్లులపై పోరాటం చేస్తామని ఓట్ల జిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ బెస్ట్ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారని గుర్తు చేశారు. ఎంపీగా ఏం చేశావో చెప్పి ఓట్లు అడగాలని స్పష్టం చేశారు. శ్రీరాముని ఫొటో, అక్షింతలు పంపి సెంటిమెంట్‌తో ఓట్లు దండుకునే ప్రయత్నం సరికాదన్నారు. ఇప్పటికైనా సంజయ్ అభివృద్ధిపై అబద్ధాలు మాట్లాడడం మానుకోవాల ని హితవు పలికారు. బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, నాయకులు మారుతి, నయీం పాల్గొన్నారు. ఇవి చదవండి: ఎన్నికల సమయంలోనే రాజకీయాలు -
మాజీ మహిళా ఇన్స్పెక్టర్ వసంతి పిటిషన్ తిరస్కరణ
తమిళనాడు: విధుల నుంచి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ మాజీ మహిళా ఇన్స్పెక్టర్ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ తిరస్కరించింది. శివగంగై జిల్లా ఇలియాన్ కుడిలో బ్యాగ్ తయారు చేసే కంపెనీ నిర్వహిస్తున్న హర్షిత్ వద్ద గత సంవత్సరం రూ.10 లక్షలు నగదును అపహరించినట్లు మదురై నాగమలై ఇన్స్పెక్టర్ వసంతి సహా జిల్లా క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేసి ఇన్స్పెక్టర్ వసంతిని అరెస్టు చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చిన వసంతి సాక్షులను బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులను హైకోర్టు మదురై బెంచ్ ఆదేశించింది. దీంతో గత మార్చి 31వ తేదీ ఇంటిలో నుంచి కారులో బయటకు వెళ్లడానికి వచ్చిన వసంతిని ప్రత్యేక బృందం పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత వసంతిని విధుల నుంచి తొలగించారు. దీన్ని వ్యతిరేకిస్తూ వసంతి హైకోర్టు మదురై బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి జి.ఆర్ స్వామినాథన్ విచారించారు. ఆ సమయంలో ఎస్పీ శివప్రసాద్ హాజరై వివరణ ఇచ్చారు. పిటిషన్ దారుడిపై ఉన్న కేసులు నిలువలో ఉన్నాయని, ప్రస్తుతం విచారణ జరుగుతున్న క్రమంలో డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకున్నందున విధుల నుంచి తొలగించడంపై కోర్టు జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని ఆ పిటిషన్‌ను కొట్టి వేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
ఆత్మను ఇంటికి తీసుకొచ్చేందుకు వినూత్న పూజలు
తమిళనాడు: తిరుపత్తూరు జిల్లా నాట్రంబల్లి సమీపంలోని సొరకాల్‌నత్తం గ్రామానికి చెందిన కేశవన్ ఇతని భార్య వాసంతి. వీరికి ఎయిల్ అరసన్, ఉదయ్‌వసంత్(20) పిల్లలున్నారు. ఎయిల్ అరసన్ సొరకాల నత్తం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌గా ఉంటున్నాడు. ఉదయ్‌వసంత్ రెండు నెలల క్రితం అదే గ్రామంలో బైకులో వెళుతున్న సమయంలో లారీ ఢీకొని అక్కడిక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులు అదే గ్రామంలోని శ్మశానంలో దహన క్రియలు చేశారు. చెరువు గట్టు వద్ద ఆత్మగా తిరుగుతున్న ఉదయ్‌వసంత్ ఆత్మను ఇంటికి తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేశారు. మంగళవారం సాయంత్రం మృతిచెందిన ఉదయ్‌వసంత్ ఆత్మను ఇంటికి తీసుకొచ్చేందుకు చెరువు గట్టు వద్ద కుటుంబ సభ్యులు పూజలు చేశారు. అక్కడ పూలకరగం పెట్టి నేలపై పసుపు, పుష్పాలు పెట్టి మేళ తాళాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉదయ్‌వసంత్ చిత్రపటంతో పాటు కరగను చెరువు గట్టు నుంచి ఇంటికి మేళ తాళాల నడుమ తీసుకొచ్చారు. ఆ సమయంలో ఒకటిన్నర కిలో మీటరు దూరం పసుపు నీల్లు, పుష్పాలు చల్లి ఊరేగింపుగా వచ్చారు. అనంతరం ఉదయ్‌వసంత్ చిత్ర పటాన్ని ఇంట్లో పెట్టి పూల మాల వేసి పూజలు చేశారు. మృతి చెందిన కుమారుడి ఆత్మ ఇంటికి రావాలని కుటుంబసభ్యులు పూజలు చేసిన సంఘటన పలువురిని ఆశ్చర్యపరిచింది. -
గీతూ చెత్త సంచాలక్, బాలాదిత్య చేతులెత్తి మొక్కినా..
Bigg Boss 6 Telugu, Episode 60: బిగ్‌బాస్ అంటే మైండ్ గేమ్ అని కొందరు, కాదు ఫిజికల్ గేమ్ అని మరికొందరు, ఆ రెండింటికన్నా వ్యక్తిత్వం ఇంపార్టెంట్ బ్రదరూ అనేవాళ్లూ ఉన్నారు. కానీ కంటెస్టెంట్లలో కచ్చితంగా ఈ మూడు క్వాలిటీస్ ఉండాల్సిందే! దురదృష్టం కొద్దీ ఆ విషయాన్ని గాలికొదిలేస్తున్నారు హౌస్మేట్స్. ఫిజికల్ గేమ్ వచ్చినప్పుడు మైండ్ గేమ్, మైండ్ గేమ్ వచ్చినప్పుడు ఫిజికల్ గేమ్ ఆడుతున్నారు. మరీ ముఖ్యంగా ఏదైనా టాస్క్ రాగానే వారి బలహీనతల మీద దెబ్బ కొట్టి రెచ్చగొట్టి పెంట చేస్తున్నారు. దీంతో గేమ్ స్పిరిట్ కంటే గొడవలే ఎక్కువైపోతున్నాయి. ఈరోజు ఎపిసోడ్లో కూడా అదే జరిగింది. మిషన్ పాజిబుల్ టాస్క్‌లో భాగంగా ఇతర స్క్వాడ్‌లోని సభ్యులను చంపేందుకు క్యాప్చర్ ద వార్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. అయితే గ్రనైట్ రెడ్ స్క్వాట్ ఆధీనంలో ఉండటంతో ఎవరెవరు పోటీపడాలి? సంచాలకులుగా ఎవరు ఉండాలనేది రెడ్ టీమ్ ఎంపిక చేయొచ్చని ట్విస్ట్ ఇచ్చాడు. ఇంకేముంది, గీతూ సంచాలక్ అయింది. బ్లూ టీమ్‌లో వీక్‌గా ఉన్నారనుకున్న ఇనయ, వాసంతి, మెరీనాలు.. రేవంత్, శ్రీహాన్, ఫైమాతో పోటీపడాలని నిర్ణయించారు. గేమ్ మొదలు కాకముందే ఎప్పటిలా కొత్త రూల్స్ పెట్టింది గీతూ. గోడ మీద నుంచి రెండు కాళ్లు కింద పెడితే అవుట్ అని చెప్పింది. గేమ్ ప్రారంభం కాగానే ముగ్గురు ఆడాళ్లు సివంగుల్లా పోట్లాడారు. వెక్కిరిస్తూ వెకిలి చేష్టలు చేసిన రేవంత్‌ను అవుట్ చేసింది వాసంతి. శ్రీహాన్ ఇనయను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తూ.. నామినేషన్లో తప్ప కంటెంట్ లేనిదానివి నువ్వు మట్లాడుతున్నావు అని విమర్శించాడు. దీనికి ఇనయ.. నువ్వూ ఈ మధ్య కంటెంట్ బాగా ఇస్తున్నావ్లే, ఎక్కడ వెళ్లి పడుకుంటున్నావో చూస్తున్నా అంది. ఇక ఇనయ నెట్టేసే క్రమంలో శ్రీహాన్ రెండు కాళ్లు కింద పెట్టినా గీతూ మాత్రం తాను చూడలేదని మాట్లాడింది. ఎవ్వరు చెప్పినా ఆమె పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ మొదటి మిషన్‌లో రెడ్ స్క్వాడ్ గెలవగా వారు బ్లూ స్క్వాడ్‌లో రోహిత్‌ను చంపారు. తర్వాత శ్రీహాన్.. ఇనయ దగ్గరకు వెళ్లి నా క్యారెక్టర్ గురించి ఏదో నోరు జారుతున్నావేంటి అంటూ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. మా రిలేషన్‌కు ఓ పేరుంది, లిమిట్ ఉంది అని ఎగబడ్డారు శ్రీసత్య, శ్రీహాన్. దానికి ఇనయ మీరు కింద పడుకోవడం చూశానని ఆన్సరిచ్చింది. మరోపక్క బాలాదిత్య సిగరెట్ల కోసం అల్లాడిపోయాడు. చేసింది చాలు, తప్పు చేయకు, నా మనసు విరిగిపోయింది అని సిగరెట్లు అడగ్గా గీతూ మాత్రం ఇవ్వనంటూ మొండికేసింది. నా స్టూడెంట్స్‌కు నేను సిగరెట్లు తాగడం తెలియొద్దనుకున్నా, కానీ తెలిసిపోయింది. అమ్మ చూస్తే బాధపడుతుంది అంటూ చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు ఆదిత్య. ఆదిరెడ్డి సహా అందరూ బతిమాలడంతో చివరాఖరికి సిగరెట్లు ఇచ్చేసి ఏడ్చేసింది గీతూ. దీంతో ఆవేశంలో సిగ్గులేదు అన్నందుకు తనను క్షమించమని చేతులెత్తి వేడుకున్నాడు బాలాదిత్య. గీతూ మాత్రం అతడిని క్షమించే ప్రసక్తే లేదన్నట్లు ప్రవర్తించింది. తెల్లారి బాలాదిత్య సిగరెట్లు తాగుదామనుకునేలోపు లైటర్ కనిపించకుండా పోయింది. దీంతో ఆదిరెడ్డి.. బిగ్‌బాస్.. వీక్నెస్తో ఆడుకోమన్నాడని చెప్పి మీ బలాన్ని ప్రయోగించరా? అని కరెక్ట్ పాయింట్ లాగాడు. అటు గీతూ మాత్రం.. నేను దొంగ, వెధవెన్నర వెధవ.. జాగ్రత్తగా దాచుకోవాలని చెప్పి కాసేపు సతాయించి తర్వాత లైటర్ ఇచ్చేసింది. రాత్రి నిద్రపోయేటప్పుడు ఇనయ సూర్య జ్ఞాపకాలతో తడిసి ముద్దైంది. నీ షర్ట్ వేసుకునే గేమ్ ఆడాను. ఎందుకింత గుర్తొస్తున్నావంటూ సూర్యను తలుచుకుని ముసిముసి నవ్వులు నవ్వింది. అటు శ్రీసత్య మాత్రం ఎవరు ఏ పాయింట్లో ట్రిగ్గర్ అవుతారో నాకు తెలుసు. కాబట్టి రేపు ఎదుటివాళ్లను రెచ్చగొట్టి గేమ్ ఆడదామని రేవంత్‌తో చెప్పుకొచ్చింది. మరుసటి రోజు ఆదిరెడ్డిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ అతడికి సీక్రెట్ మిషన్ ఇచ్చాడు. వాష్‌రూమ్‌ను పూర్తిగా అశుభ్రపరిచి ఆ నింద రెడ్ స్క్వాడ్‌లో ఒకరి మీద వేయాలన్నాడు. ఈ మిషన్ కంప్లీట్ చేస్తే బ్లూ టీమ్‌లో ఒకరిని బతికించొచ్చన్నాడు. మరి ఆ సీక్రెట్ మిషన్ పాజిబులా? ఇంపాజిబులా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే! చదవండి: ఆత్మహత్య తప్ప మరో దిక్కు లేదు: పావలా శ్యామల అందరికీ రుణపడి ఉంటా: రంభ వీడియో వైరల్ -
బిగ్‌బాస్ హౌస్‌లో దెయ్యం.. ఫైమా టాస్క్ గెలుస్తుందా?
ఫైమాకు సీక్రెట్ టాస్క్ ఇస్తే అది మెరీనా, వసంతిలు చేసినట్లు కనిపిస్తుంది. హౌస్మేట్స్ నిద్ర చెడగొట్టి అది తనమీద రాకుండా చూసుకోవాలని బిగ్‌బాస్ ఆదేశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇవాల్టి ఎపిసోడ్లో మెరీనా, వసంతిలు దెయ్యం గెటప్‌తో ఏకంగా ఫైమానే బయపెడతారు. ఆ తర్వాత ఇంట్లో అందరిని తమ గెటప్‌లతో నిద్ర లేపి భయపెట్టిస్తారు. ఇక సూర్య అపరిచితుడిలా గెటప్ వేసి ఎంటర్టైన్ చేస్తాడు. 3ఢిపరెంట్ క్యారెక్టర్స్‌తో, తనదైన మ్యానరిజంతో మెప్పిస్తాడు. సూర్యతో ఫైమా కూడా జతకలిసి మరింత ఎంటర్టైన్ చేస్తుంది. ఇక ఆ తర్వాత బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కి ఓ టాస్క్ ఇస్తాడు. కేవలం చాప్ స్టిక్స్ ఉపయోగించి లంచ్ పూర్తి చేయాల్సిందిగా ఆదేశిస్తాడు. దీంతో తెగ తిప్పలు పడుతూ ఇంటి సభ్యులు భోజనం చేశారు. మరి ఈ సీక్రెట్ టాస్కులో ఫైమా విజయం సాధిస్తుందో లేదో ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం. -
మంచి మాట: దృష్టి.. ఒక జీవిత పథం
‘ఇతరులకు గోచరం కానిది చూడగలగటమే దృష్టి అంటే...’’ అన్నాడు ప్రముఖ ఆంగ్ల నవలా రచయిత జోనాథన్ స్విఫ్ట్. ఎవరూ చూడలేని వైపు ఆలోచనా దృష్టిని ప్రసరింప చేయగలగటమే దృష్టి. చాలా మందికి తట్టని ఆలోచన ఒకరికి తట్టడం, ఒక నిశితమైన చూపు. దృష్టి ఒక శోధన, అన్వేషణ, దార్శనికత, సృజన, సంస్కారం, అద్భుత ఊహ. ఒక జీవిత పథం. చర్మ చక్షువులు మనకి బాహ్య దృష్టిని మాత్రమే ఇస్తాయి. దానివల్ల ఈ సమస్త ప్రపంచాన్ని చూడగలం. దీనిని కేవలం చూపు అంటాం. మనం చూసే ప్రపంచాన్ని, దాని పోకడను, వైఖరిని , వర్తనను చూపిస్తున్న మన నయనానికి ఆలోచనను కలిపి చూడటమే అంతర దృష్టి. దీనినే మనోనేత్ర మంటాం. ఈ దృష్టి కొందరికి సహజం. కొందరికి చదువు వల్ల వస్తుంది. ఇంకొందరికి జీవితం నేర్పుతుంది. సాధన వల్ల కూడ సాధ్యమే. మస్తిష్క సాగరంలో వచ్చే ఆలోచనా తరంగాలను దాటి చాలా లోతుగా వెళ్ళటం దృష్టే. మనకందరకూ ఆలోచనలు వస్తాయి. కొన్ని క్లిష్టమైన సందర్భాలలో, సమస్యల విషయంలో మనం తీవ్రంగా యోచించి పరిష్కారం లేదా సమాధానం కనుక్కోవలసివస్తుంది. అప్పుడు ఒక పరిధి.. పరిమితి లేకుండా ప్రసరించే మన ఆలోచనా కిరణాలను సమీకరించుకుని ఒక చోట కేంద్రీకృతం చేయాలి. ఇలా అందరూ చేయలేరు. మనలో కొందరికే ఆ శక్తి సామర్థ్యాలుంటాయి. వారు సమస్య మూలాలలోకి తమ దృష్టిని ప్రవహింప చేయగలరు. అపుడది శక్తిమంతమై మనం వెతుకుతున్న ప్రశ్నకు సమాధానం దొరికేటట్టు చేస్తుంది. మన దృష్టిని సమస్య అన్ని కోణాలవైపు చొప్పించాలి. అన్ని దిశలలో వెళ్ళాలి. లోతుల్ని తాకాలి. మన చుట్టూ ఎంతో ప్రపంచముంది. దానిలో అగణితమైన మనుష్యులున్నారు. ఎన్నో సుందర దృశ్యాలున్నాయి. హృదయ విదారకమైన దృశ్యాలు వున్నాయి. వాటిని మన కళ్ళు పరిశీలిస్తాయి. మన దృష్టిని బట్టి ఒక బలమైన ముద్ర పడుతుంది. ఓ అనుభూతి.. కొన్ని భావనలు ఏర్పడతాయి. అవి ఏ రకంగా ఉంటాయి, ఏ స్థాయి లో ఉంటాయన్నది మన దృష్టి వల్ల ఏర్పడిన సంస్కారాన్ని బట్టి ఉంటుంది. ఒక మల్లెమొగ్గ రేకులు విప్పుకుని, వికసించి తన పరిమళాన్ని నలుదిశలా వెదజల్లుతుంది. కొన్ని గంటల తరువాత వాడి.. రేకులు ఒక్కొక్కటిగా భూమి మీదకు విడుస్తూ పూర్తిగా నశించిపోతుంది. ఇది చాలా సహజం..అతి సాధారణం. ఇలా అనుకునే వారు మనలో చాలా మంది వుంటారు. ఇది ఒక దృష్టి. ఈ సహజ పరిణామాన్ని కొందరు జీవితానికి అన్వయించి లోతుగా ఆలోచిస్తారు. మనిషి జీవితం కూడ ఆ మల్లె పువ్వు లాగా అశాశ్వతమైనది. మనిషి ప్రాణం విడవక తప్పదని గ్రహించి మూన్నాళ్ళ ముచ్చటే ఈ జీవితమన్న ఎరుకతో దాన్ని మల్లెపువ్వులా పరిమళ భరితం చేసుకోవాలని చూసే దృష్టి మరికొందరిది. జీవితాని కొక విలువ.. సార్థకత తెచ్చుకోవాలని వారి వైఖరి. మంచితనంతోనే అది సాధ్యం. ఆ దృష్టే వారి పేరును.. వారు చేసిన పనులను ప్రజల మనస్సుల్లో తరతరాలు నిలిచిపోయేటట్లు చేస్తుంది. అపుడా మనస్సులు సుగంధ పారిజాతాలవుతాయి. ఇది నిశిత దృష్టి. శాశ్వతత్వానికి.. ఆశాశ్వతత్వానికి ఉన్న భేదాన్ని గుర్తెరిగే అద్భుత దృష్టి. చేపట్టే పనులు.. వ్యాపారాలలో కొందరి బుద్ధి కొత్త పుంతలు తొక్కుతుంది. రకరకాల మార్గాలలో అన్వేషణ చేస్తారు ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో కష్టిస్తారు. ఇది ఒక రకమైన దృష్టి. ఒక పుస్తకాన్ని చదివే క్రమంలో.. ఆకళింపు చేసుకోవటంలో కూడా దృష్టి వుంటుంది. పైపైన చదివి అర్ధం చేసుకునేవారు కొందరైతే, ఆ కనిపించే వాక్యాల అంతరార్థాన్ని పట్టుకునే యత్నం కొందరు చేస్తారు. ఈ దృష్టికలవారే రచయిత ఆలోచనను పట్టుకుని.. రచనలోని ఆత్మను చేరుకుంటారు. ఎంత లోతుగా వెళ్ళగలరో అంతవరకూ వెళ్ళగలరు. అంతే కాదు . వారి దృష్టి చెదరదు. తోవను వీడదు. చేర వలసిన చోటుకు చేరుకొని సఫలీకృతులవుతారు. తమ కాలానికి .. దూరంగా తమ ఆలోచనా దృష్టిని ప్రసరింప చేయగలిగే ప్రతిభా సంపన్నులు కొందరుంటారు. సమాజంలో అనేక రంగాలలో చోటు చేసుకునే అనేక పరిణామాలు భవిష్యత్తులో ఏ రూపాన్ని తీసుకుంటాయి... వాటి ప్రభావం ఎలా వుంటుంది, సమస్యలకు పరిష్కారం ఏమిటనే యోచనే వీరిది. ఈ దృష్టికే దార్శనికతని పేరు. వీరు నాయకులు కావచ్చు... సామాజిక విశ్లేషకులూ కావచ్చు.. వేదాంతులూ కావచ్చు. తమ చుట్టూ ఉన్న బాధార్తులు... దాహార్తుల గురించి ఆలోచించే వారుంటారు. వారందించే ఆపన్న హస్తం మానవత్వానికి చిహ్నం. కరుణకు సంకేతం. ఇది ఒక రకమైన దృష్టి. విద్యావేత్తలు విద్యావిధానాలను సమాజానికి కనుగుణంగా తయారు చేస్తారు. దాని కెంతో మేధోమధనం కావాలి. ఈ విద్యావిధానాలనే విత్తనాలు భవిష్యత్తులో ఫలానా విధంగా ఫలవంతమవుతాయనే అద్భుత ఊహాశక్తి, ఆలోచన... దృష్టి వల్లే సాధ్యమవుతాయి. ‘కేవలం చూవు మాత్రమే ఉండి.. దృష్టి లేనివాడు ఈ ప్రపంచంలో అతి దయనీయుడైన వ్యక్తి..’ అన్నారు హెలెన్ కెల్లర్. ఎంత అద్భుతమైన మాటలు! చూపు ఉన్నవారందరికి దృష్టి ఉండాలని కానీ.. చూపు లేనివారికి దృష్టి ఉండకూడదన్న నియమం గాని లేదన్న భావనను ఎంత బాగా చెప్పారో! నదిలో కొట్టుకుపోతున్నది ఆడ.. మగా అని కాక ఒక జీవి అన్న భావనలో రక్షించానన్న శిష్యుడి మాటల్లో.. రసవిహీనంగా ఉండి గంటపాటు సాగిన ఒక ఉపన్యాసాన్ని విని.. ఎలా మాట్లాడకూడదో నేర్చుకున్నానన్న వ్యక్తి మాటల్లో వ్యక్తమయ్యేది వారి దృష్టి మాత్రమే. అది ఎంత లోతైనదో.. స్పష్టమైనదో చూడండి. అటువంటి మనోనేత్రం మనకందరకూ కావాలి. దాన్ని అలవరచుకునే ప్రయత్నం చేయాలి. పొందాలి. దాన్ని కార్యరూపంలోకి తీసుకురావాలి. అలా కానట్లయితే అది పుస్తకాలనుండి నేర్చుకున్న జ్ఞానంలా మిగిలిపోతుంది. పుస్తకజ్ఞానాన్ని సందర్భానికి తగిన విధంగా, ఆపద్ధర్మంగా మంచి కోసం వాడుకోవాలి. దీనినే ఇంగిత జ్ఞానమంటారు. అలా వాడటానికి వివేచన అనే దృష్టి కావాలి. జీవితమంటే ఏమిటి.. దాని పథం ఏమిటో స్పష్టమైన దృష్టిని ఏర్పరచుకుని పయనించాలి. మనం నేర్చిన విద్య యొక్క సారాన్ని జీర్ణించుకోవాలి. జీవన క్రమంలో ఎదురయ్యే అనుభవాలను.. సత్యాలను పొదవుకోవాలి. అటువంటి జీవితం ఎటువంటి కుదుపులొచ్చినా అతలాకుతలమవ్వక ఒక ప్రశాంత స్థితిలో సాగుతుంది. మనం ప్రపంచాన్ని.. మనుష్యుల స్వభావాలను.. మనస్తతత్వాలను ఆకళింపు చేసుకున్న తీరు మన దృష్టికి దర్పణం. మన దృష్టి మన వ్యక్తిత్వాన్ని... ఆలోచనా విధానాన్ని... జీవిత దృక్పథాన్ని.. మనం జీవితాన్ని అర్థం చేసుకున్న తీరును తేటతెల్లం చేస్తుంది. దృష్టి ఆవశ్యకత ఏమిటి.. దాన్ని ఏర్పరచు కోవాలా అనే సందేహాలు వచ్చే వారుంటారు. దృష్టి మన జీవితాన్ని పరిపుష్టం చేస్తుంది. ఒక గౌరవం.. ఒక హుందాతనాన్నిస్తుంది. జీవితానికొక సమతౌల్యతనిస్తుంది. దృష్టి వ్యక్తి వికాసానికెంత అవసరమో... దేశవికాసానికి అంతే అవసరం. కేవలం చూవు మాత్రమే ఉండి.. దృష్టి లేనివాడు ఈ ప్రపంచంలో అతి దయనీయుడైన వ్యక్తి.. – లలితా వాసంతి -
ఆ టైటిల్ విని షాక్ అయ్యాను!
సంపూర్ణేష్ బాబు, వాసంతి జంటగా ఆర్కే మలినేని దర్శకత్వంలో గుడూరు శ్రీధర్ సమర్పణలో ఆశాజ్యోతి గోగినేని నిర్మించిన చిత్రం ‘క్యాలీఫ్లవర్’. ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా వాసంతి మాట్లాడుతూ – ‘‘నేను తెలుగు అమ్మాయినే కానీ బెంగళూరులో చదువుకున్నాను. ఏరో నాటికల్ ఇంజనీర్ అవుదామనుకున్న నేను హీరోయిన్ అయ్యాను. ఐదు సంవత్సరాల క్రితం మోడల్‌గా నా కెరీర్‌ను స్టార్ట్ చేసి, ఆ తర్వాత నటి అయ్యాను. కన్నడంలో ఐదు సినిమాలు చేశాను. ఇప్పుడు ‘క్యాలీఫ్లవర్’తో తెలుగు చిత్రపరిశ్రమకు వస్తున్నాను. ఇందులో హీరోగా నటించిన సంపూర్ణేష్ బాబుకు మరదలిగా, నీలవేణి క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్ నా కోసమే డిజైన్ చేశారా? అన్నట్లు నాకనిపించింది. కొందరిలా నేను కూడా ‘క్యాలీఫ్లవర్’ టైటిల్ విని షాకయ్యాను. కానీ సస్పెన్స్, థ్రిల్, కామెడీ, మెసేజ్ ఉన్న ఈ చిత్రం ఆడియన్స్‌కు నచ్చుతుంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేయాలని ఉంది. హీరో నానీగారంటే ఇష్టం. ఆయనతో వర్క్ చేయాలని ఉంది. ప్రస్తుతం ఆది సాయికుమార్, మారుతి అండ్ టీమ్ సినిమాల్లో లీడ్ రోల్స్ చేస్తున్నాను. కన్నడంలో కొత్త సినిమాలు కమిట్ కాలేదు’’ అన్నారు. -
‘క్యాలీఫ్లవర్’ షూటింగ్‌కు రెడీ అయిన సంపూ
‘హృదయ కాలేయం’, ‘కొబ్బరిమట్ట’ చిత్రాల ఫేమ్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘క్యాలీఫ్లవర్’. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వాసంతి హీరోయిన్ గా నటిస్తున్నారు. గుడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్ పతాకాలపై ఆశాజ్యోతి గోగినేని నిర్మిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ చిత్రం షూటింగ్‌కి కొంచెం విరామం ఇచ్చిన చిత్రబృందం తాజాగా హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలుపెట్టింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: కోల నాగేశ్వరరావు, హరిబాబు జెట్టి, కథ: గోపీ కిరణ్, సంగీతం: ప్రజ్వల్ క్రిష్, కెమెరా: ముజీర్ మాలిక్. -
సంపూ బర్త్‌డే: క్యాలీఫ్లవర్ ఫస్ట్‌లుక్ రిలీజ్
సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘క్యాలీఫ్లవర్’. ‘శీలో రక్షతి రక్షితః’ అనేది ఉపశీర్షిక. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వాసంతి హీరోయిన్ . గుడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌పై ఆశా జ్యోతి గోగినేని నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే మొదలైంది. మే 9 సంపూర్ణేష్ బర్త్ డేకి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చిన వ్యక్తిగా సంపూ లుక్ అదిరిపోయింది. సంపూ స్టైల్ కామెడీతో సినిమా ఉంటుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: దీప్ ప్రజ్వల్ క్రిష్, కెమెరా: ముజీర్ మాలిక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: కోల నాగేశ్వరరావు, హరిబాబు జెట్టి. -
అంట్లుతోమే పని నుంచి అంతర్జాతీయ అథ్లెట్ స్థాయికి!
తమిళనాడుకు చెందిన వాసంతీ ఆనందన్ జీవితం ఎందరో అథ్లెట్లకు స్ఫూర్తినిస్తోంది. ఎందుకంటే అంట్లు తోముకునే ఆమె మరో 2 నెలల్లో స్పెయిన్‌లోని మలాగాలో జరగబోయే వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్ షిప్ పోటీల్లో 5000 మీటర్ల రన్నింగ్, హాఫ్ మారథాన్‌లో మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. తమిళనాడులోని తిరుచినాపల్లి జిల్లాలోని తిరువాయూర్ వాసంతి సొంత వూరు. పదేళ్ల క్రితం భర్త ఆనందన్‌తో పాటు తన ఇద్దరు పిల్లలు మణికందన్, కిరుతిక లను వెంటబెట్టుకొని కోయంబత్తూరుకి చేరుకుంది వాసంతి కుటుంబం. 36 ఏళ్ల వాసంతి భర్త ప్రైవేటు బస్ డైవర్. ఇద్దరు పిల్లల పోషణాభారం పంచుకునేందుకు వాసంతి నాలుగిళ్లల్లో గిన్నె లు కడిగే పనికి కుదిరారు. వాసంతి భర్త ఆనంద్‌కూడా రన్నర్ కావడంతో వారి ఇద్దరు పిల్లలకూ రన్నింగ్‌లో శిక్షణనిప్పిస్తున్నారు. రన్నింగ్ శిక్షణ కోసం పిల్లల్ని ప్రతిరోజూ గ్రౌండ్‌కి తీసుకెళ్లి దింపే బాధ్యత వాసంతిది. కోచ్ వైరవనాథన్ వాసంతిని చూడటం తో ఆమె జీవితం కొత్త మలుపు తిరిగింది. అదే దేశానికి మంచి అథ్లెట్‌ను పరిచయం చేసింది. కోయంబత్తూరులోని నెహ్రూ స్టేడియంలో ప్రతిరోజూ తన పిల్లలను దింపేవారు వాసంతి. సన్నగా ఉన్నా అథ్లెట్‌కి ఉండాల్సిన శరీరాకృతినీ, చురుకుదనాన్నీ వాసంతి లో చూశారు కోచ్ వైరవనాథన్. ఆమె లాంగ్ డిస్టెన్స్ లో బాగా పరిగెత్తగలదని కూడా ఆయన గుర్తించారు. మొదట అదే విషయం ప్రస్తావిం చినప్పుడు వాసంతి ఒప్పుకోలేదు. ఆ తర్వాత గత ఏడాది సమ్మర్ క్యాంప్ సందర్భంగా వంటావార్పూలో వాసంతి సహాయాన్ని కోరడంతో ఆమె క్యాంప్‌కి రావడం మొదలెట్టారు. ఖాళీ సమయంలో వాసంతిని రన్నింగ్‌వైపు ప్రోత్సహించారు కోచ్ వైరవనాథ్. అంతే ఆమె ఇక వెనుదిరిగి చూడలేదు. అనతి కాలంలోనే అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగారు. భారతీ యార్ వర్సిటీలో మొదట జిల్లా స్థాయి చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత తమిళనాడు మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వహించిన పోటీ ల్లో పాల్గొన్నారు. జాతీయస్థాయిలో మాస్టర్స్ అథ్లె టిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పోటీల్లో వరుసగా 5000 మీటర్ల రన్నింగ్‌లో రజత, హాఫ్ మారథాన్‌లో స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు. ప్రస్తుతం సెప్టెంబర్‌లో స్పెయిన్‌లో జరగబోయే వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్ షిప్ పోటీలకు తీవ్రంగా కృషి చేస్తున్నారు వాసంతి. అయితే ఆర్థిక ప్రోత్సాహం లేకపోతే ఒక అథ్లెట్ తీసుకోవాల్సిన ఖరీదైన ఆహారం, మంచి స్పోర్ట్స్ వేర్ ఉండవంటున్నారు. రోజూ 4 గంటలపాటు కోచింగ్ కోసం వెచ్చించాల్సి రావడంతో ప్రస్తుతానికి ఇళ్లల్లో పనిచేయడం మానేసినట్టు వాసంతి మీడియాకి వివరించారు. -
రాజధర్మం
దేశాన్ని పాలించే రాజు నీతిమంతుడైతే, న్యాయ బద్ధంగా వ్యవహరిస్తే ప్రజా క్షేమాన్ని కాంక్షిస్తే ఆ దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. యధా రాజా తథా ప్రజా అని ఆర్యోక్తి. రాజును బట్టే ప్రజలు. చరిత్రలో చక్కని పాలన చేసి, గణుతికెక్కిన రాజులను రామునితోను, ఆ రాజ్యాన్ని రామరాజ్యంతోను పోలుస్తారు. రాముడు అంతటి ఆదర్శవంతుడైన పాల కుడు. ప్రజాభిప్రాయానికి విలువనిచ్చిన పాలకుడు. ప్రాచీన సాహిత్యం ఓ విజ్ఞాన భాండాగారం. పాలకులు పాటించవలసిన ధర్మాలు అందులో చక్కగా చెప్పారు. సుస్థిర దేశ పాలనకు, దేశ సౌభా గ్యానికి అవి ఎంతో ఉపకరిస్తాయి. మహా భారతంలో సభా పర్వంలో నారదుడు ధర్మరాజు దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని ప్రశ్నలడుగు తాడు. పాలకులైనవారు ఎలా ఉండాలో తెల్పుతా యవి. సర్వకాలాలకు వర్తించే ధర్మాలవి. రాజు ఎప్పుడూ ధర్మమందే మనసు నిలపాలి. తను చేయవలసిన రాజకార్యాలను సొంత బుద్ధితో అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలోచించాలి. ఎందుకంటే అప్పుడు రాజు ఏకాంతంగా ఉంటాడు. అతని ఆలోచ నలకు ఏకాగ్రత ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో యోగ్యులైన వాళ్లను, వారి వారి శక్తి సామర్థ్యాలను గుర్తించి నియమించాలి. ముఖ్యంగా పన్నులు వసూలు చేయటంవంటి ధనార్జనకు సంబంధించిన పనులలో నిజా యితీపరులను, సమబుద్ధితో వ్యవహరించేవారిని, విలువలను పాటించే వారిని నియమించాలి. అవినీతిపరులను నియమిస్తే ప్రభుత్వ ధనానికి లోటు ఏర్పడుతుంది. ప్రజలకు ప్రభుత్వంపై విముఖత ఏర్పడుతుంది. దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు ఎంతో మంది సైనికులు ప్రాణాలు కోల్పోతారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల కుటుంబాలను రాజు శాశ్వ తంగా ఆదుకోవాలి. ప్రభుత్వం ఎప్పుడూ వ్యవసా యాన్ని, వాణిజ్యాన్ని ప్రోత్సహించాలి. సమాజాభ్యుదయానికి ఇవి చాలా అవసరం. మహాభారత కాలం లోనే అధికాహారోత్పత్తికి విత్తనాలు, తక్కువ వడ్డీతో రుణాలు వ్యవసాయదారులకు ప్రభుత్వం ఇచ్చినట్లు నారదుని మాటల వల్ల తెలుస్తోంది. రాజు దృష్టిలో ప్రజలందరూ సమానమే. అయితే లోపమున్న పిల్లలను తల్లి ఇంకా ఎంత బాగా ప్రేమి స్తుందో అలా కుంటివారు, గుడ్డివారు, వికలాంగు లకు రాజు ప్రత్యేక సదుపాయాలు కలుగజేయాలి. ఎప్పుడో మహాభారత కాలం నాడు చెప్పిన ఈ రాజధర్మాలు ఇప్పటికీ ఎప్పటికీ శిరోధార్యాలు! వాసంతి -
ప్రేమికులకు ప్రొ'టెక్'షన్
మళ్లీ ఒక పరువు హత్య! అగ్రకులానికి చెందిన అమ్మాయి దళితుడిని ప్రేమించి, కుటుంబాన్ని ఎదురించి పెళ్లి చేసుకుంది. తక్కువ కులం వ్యక్తిని పెళ్లి చేసుకొని కుటుంబ పరువు గంగలో కలిపిందని అగ్రహోదగ్రులయ్యారు కుటుంబసభ్యులు. అమ్మాయిని వెదికి, నయానా, భయానా ఇంటికి తీసుకొచ్చి, మూడో కంటికి తెలియకుండా అమ్మాయిని చంపేసి, అబ్బాయి మీద కిడ్నాప్ కేస్ పెట్టారు. తమిళనాడులో జరిగిన ఈ సంఘటన గురించి తమిళ పేపర్లో వార్తగా వచ్చింది. ఇలాంటివి ఈ మధ్య బాగా వింటోంది చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వసుమతి వాసంతి. కుల వివక్ష మీద పెరియార్ రామస్వామి యుద్ధం ప్రకటించిన నేల మీద పరువు హత్యలా? ఇవి అనాగరికమని, ఇలాంటి హత్యలకు పాల్పడిన వాళ్లకు తగిన శిక్ష ఉంటుందని 2006లో అపెక్స్ కోర్ట్ తీర్పు కూడా ఇచ్చింది. అయినా ఆగలేదే?! 2013 నుంచి 2017 వరకు నాలుగేళ్లలో 187 పరువు హత్యలు జరిగాయని ఓ రిపోర్ట్ చెప్తోంది. అన్యాయం! ప్రేమకు కులం ఏంటి? కులం పేరుతో వాళ్లను విడదీయడమే కాకుండా చంపడం ఏమిటి? వసుమతి మనసు కలత చెందింది. ఏదైనా చేయాలి... సహపంక్తి భోజనాల ద్వారా కాదు, కులాంతర వివాహాల ద్వారా కులం నశిస్తుంది అని చెప్పాడు అంబేద్కర్. ప్రేమ ఆ పని చేస్తోంది. కానీ సమాజం అడ్డుకుంటోంది. తను అలాంటి ప్రేమికులకు రక్షణ కల్పించాలి. ఏం చేయాలి? ఆలోచించింది. ఈ కాలంలో దేన్నయినా మేడ్ ఈజీ చెస్తున్నవి యాప్సే. గడప దాటకుండానే ప్రపంచాన్ని ఇంట్లో పెడుతున్నాయి. ఈ ప్రేమ పక్షులకు అలాంటి సురక్షితమైన యాప్ గూడును అల్లేస్తే? యెస్.. తట్టింది ఆమెకు. ఆపరేషన్‌లో మునిగింది. పెళ్లి చేస్తారు.. ఇల్లూ చూస్తారు! వసుమతి డెవలప్ చేసిన యాప్ పేరు.. కాదల్ అరణ్. అంటే ప్రొటెక్టర్ ఆఫ్ లవ్. ఇదెలా పనిచేస్తుందంటే.. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు వలంటీర్స్ ఉంటారు. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోగానే యూజర్ తన కాంటాక్ట్ వివరాలన్నీ అందులో పొందుపర్చాలి. అలాగే ఆ జంట ఎలాంటి సహాయం కోరుకునుందో కూడా అందులో నమోదు చేయాలి. ఆ సమాచారాన్ని అనుసరించి వలంటీర్స్ ఆ జంటకు ఫోన్ చేస్తారు. వాళ్లున్న పరిస్థితిని బట్టి వారికి అవసరమైన న్యాయ సంబంధమైన, పోలీసుల సహకారం,షెల్టర్.. అంటే అద్దెకు ఇల్లు చూపెట్టడం వంటివి సహాయాన్ని అందిస్తారు. ఇవన్నీ కాక ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడంలోని ముందుంటారు. ‘‘తమిళనాడులోని దాదాపు అన్ని జిల్లాల్లో వలంటీర్లు ఉన్నారు. ఇలా కులాంతర ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలకు స్వచ్ఛందంగా సహాయం అందించాల నుకునే వాళ్లు మా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావచ్చు. వాళ్లకు ట్రైనింగ్ కూడా ఇస్తాం’’ అని చెబుతున్నారు వసుమతి వాసంతి. ప్రేమకు కులం ఏంటి? కులం పేరుతో ప్రేమికులను విడదీయడమే కాక చంపిపారేయడం ఏంటి? వసుమతి మనసు కలత చెందింది. ఆ కలతలోంచి వచ్చిన ఆలోచనే.. కాదల్ అరణ్ యాప్! -
కేన్సర్‌తో సీనియర్ నటి కన్నుమూత
సాక్షి, సినిమా : మళయాళ సినీ, బుల్లితెర నటి వాసంతి ఇక లేరు. గత కొంత కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె మంగళవారం ఉదయం కన్నుమూశారు. నాటక రంగంతో నటన కెరీర్‌ను ప్రారంభించిన టి.వాసంతి.. తర్వాత చిత్రాలు, సీరియళ్లలో నటించారు. దాదాపు ప్రతీ మళయాళ టాప్ హీరోల పక్కన ఆమె నటించారు. యవనిక, పుచ్చకోరు ముక్కుతి, నిరాకూటు, గాడ్‌పాధర్ ఆమె చేసిన చిత్రాల్లో ప్రముఖమైనవి. సుమారు 40 ఏళ్లలో ఆమె 450 చిత్రాల్లో నటించారు. ఆమె భర్త కొంత కాలం క్రితమే చనిపోయారు. వారికి సంతానం కూడా లేరు. మంగళవారం సాయంత్ర తోడుపుఝాలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
చిట్టి అమ్ము.. అమ్మగా ఎలా మారింది?
తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కోమలవల్లి సినీరంగంలోకి ఎలా ప్రవేశించింది? మైనారిటీ తీరకముందే మెచ్యూర్డ్ క్యారెక్టర్లు చేసి సినీరంగంలో సంచలనాలు ఎలా సృష్టించింది? జయలలిత.. అంటే కేవల స్క్రీన్ నేమేకాదు.. ఇట్స్ ఏ బ్రాండ్ అనేంతగా ఎదిగేందుకు ఆమెకు సహకరించిందెవరు? తనకన్నా 30 ఏళ్లు పెద్దవాడైన ఎంజీ రామచంద్రన్ తో ఆమె అనుబంధం ఎలాంటిది? ఆయన మరణం తర్వాత ఏఐఏడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టి.. ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవడం వెనుక ఎలాంటి తెగువ ప్రదర్శించారు? పురుషాధిక్య పోకడలు అడుగడుగునా కనిపించే భారతదేశంలో మీసం తిప్పే మగ నాయకులు సైతం ఆమెకు పాదాభివందనాలు చేస్తారు.. నిజంగా జయ దేవతా? 68ఏళ్ల ముదిమి వయసులోనూ ఉల్లాసంగా పనిచేయడానికి ఆమెకు శక్తి ఎక్కడి నుంచి వస్తోంది? ఏ బలం ఆమెనింత బలవంతురాలిని చేసింది? అసలు.. నాటి చిట్టిపొట్టి అడుగుల చిన్నారి అమ్ము.. నేడు అమ్మగా ఎలా మారింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా రూపుదిద్దుకున్నదే 'అమ్మ'(జయలలిత: జర్నీ ఫ్రం మూవీ స్టార్ టు పొలిటికల్ క్వీన్) పుస్తకం. ప్రముఖ జర్నలిస్టు వాసంతి రచించిన ఈ మినీ బయోగ్రఫీలో జయలలిత జీవితంలో చోటుచేసుకున్న అనేక పరిణామాలను ఆసక్తికరంగా పొందుపర్చారు. జయ చిన్నతనం నుంచి 2015లో ఆరోసారి సీఎంగా ప్రమాణం చేసేంతవరకు జరిగిన సంఘటనలను ఈ పుస్తకంలో ఆవిష్కరించారు. 200 పేజీల 'అమ్మ' ధర రూ.299 మాత్రమే. సెప్టెంబర్ 7న విడుదల కానున్న 'అమ్మ'ను అమెజాన్ లో రూ.224కే పొందొచ్చు. -
బట్టలు సరిగా ఉతకలేదని జడ్జిగారి మెమో
చెన్నై: ప్రభుత్వ ఉన్నతాధికారులు కింది ఉద్యోగులను ఇంటి పనికి వాడుకోవడం, తరచూ వేధింపులకు గురిచేయడం లోపాయికారిగా జరిగే వ్యవహారమే. అది దాచేస్తే దాగని సత్యం. కానీ తమిళనాడుకు చెందిన ఓ జడ్జిగారు మహిళా అసిస్టెంట్ కు బహిరంగంగా జారీ చేసిన మెమో అధికార దుర్వినియోగానికి అద్దం పట్టింది . బట్టలు సరిగా ఉతకలేదనే కారణంతో ఈరోడ్ జిల్లా కోర్టు కార్యాలయంలో మహిళా సబార్డినేట్ కు , సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ... మెమో జారీ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. స్థానిక భాషలో(తమిళం)లో జారీ చేసిన ఈ మెమో లో బట్టలు, ముఖ్యంగా లో దుస్తులు సరిగా ఉతకలేదంటూ మండిపడ్డారు. దీనికితోడు తమ మాటకు ఎదురు చెప్పావంటూ ఉగ్రుడయ్యారు. సమాధానం చెప్పాలంటూ మెమో జారీ చేశారు. ఆ మెమోలో ...బట్టలు..ముఖ్యంగా లోపలి వస్త్రాలు శుభ్రంగా ఉతకకపోవడం, తమ మాటలకు ఎదురు చెప్పడం, బట్టలు బైటికి విసిరేయడం.. ఎదురు సమాధానం చెప్పడం లాంటి నేరాలపై క్రమశిక్షణా చర్య ఎందుకు తీసుకోకూడదో చెప్పాలన్నారు. దీనిపై వారం రోజులుగా వివరణ ఇవ్వాలని కోరుతూ గత నెల 1న మహిళా అసిస్టెంట్ వాసంతికి ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది. దీనిపై ఆమె వివరణ ఇస్తూ భవిష్యత్తులో ఇలాంటి తప్పు మళ్లీ జరగదంటూ వివరణ ఇచ్చుకుంది. ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్ ద్వారా పదేళ్ల క్రితం తాను విధుల్లో చేరానని, కార్యాలయంలో పనిచేయాలనుకున్న తాను చివరికి పనిమనిషిగా మారతాననుకోలేదని వాసంతి వాపోయింది. కొంతమంది ఉన్నతాధికారులుతమ అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై తమళనాడు జ్యుడీషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు ఆందోళనకు సిద్ధపడుతున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ సిబ్బందిని వినియోగించుకోరాదని ప్రభుత్వ ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ.. ఈ తరహా వేధింపులు కొనసాగుతున్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు కరుణాకరన్ తెలిపారు. ఈవ్యవహారంపై స్పందించడానికి మెమో జారీ చేసిన న్యాయమూర్తి అందుబాటులో లేరని సమాచారం. -
వాసంతి సస్పెన్షన్
చిత్తూరు : గంగాధర నెల్లూరు ఎస్ఐ కేఎస్.వాసంతిని సస్పెండ్ చేస్తూ అనంతపురం డీఐజీ సత్యనారాయణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత వారం రెండు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసిన వాసంతి వాటి డ్రైవర్లపై కేసు నమో దు చేసి చిత్తూరులోని మూడవ అదనపు మేజిస్ట్రేట్ న్యాయస్థానానికి తరలించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏడేళ్లలోపు జైలుశిక్ష పడే కేసుల్లో నిందితులను అరెస్టు చేసే ముందు సీఆర్పీసీ 41 నోటీసు పూరించి కోర్టుకు ఇవ్వాలి. ఆమె అలా చేయకుండా నిందితుల్ని కోర్టుకు పంపడంపై న్యాయవాది అభ్యంతరం వ్యక్తంచేశారు. కోర్టుకు రావాలని న్యాయమూర్తి రాఘవేంద్ర ఆదేశించినా ఆమె రాలేదు. కానిస్టేబుల్ వద్ద ఉన్న మరో రిమాండు రిపోర్టులో నిందితులు నోటీసు తీసుకోలేదని, అప్పటికప్పుడు మరో రిమాండు రిపోర్టు అందజేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి సంబంధిత సీఐ, డీఎస్పీని పిలిపించారు. ఎస్ఐ న్యాయస్థానాన్నే తప్పుదారి పట్టించాలని చూశారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ జడ్జి జిల్లా జడ్జికి నోట్ పంపించారు. జిల్లా జడ్జి నుంచి చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్‌కు ఫైల్ వెళ్లింది. ఆయన డీఐజీకి పంపించారు. దీంతో వాసంతిని సస్పెండ్ చేశారు. ఆది నుంచి వివాదాస్పదమే.. నాలుగేళ్ల క్రితం ఆమె మదనపల్లెలో ట్రైనీ ఎస్ఐగా చేరారు. ఐరాలలో తొలిసారిగా ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. ఆమె పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌పై సైతం దురుసుగా ప్రవర్తించారు. అలాగే గ్రానైట్ అక్రమార్కులు, దుకాణాల నుంచి మామూళ్లు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏడాది క్రితం గంగాధరనెల్లూరు పోలీసు స్టేషన్‌కు బదిలీపై వచ్చిన వాసంతి ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె సమయంలో వారిని లాఠీలతో చితకబాదారు. ఉన్నతాధికారులు పలుమార్లు మందలించినా ప్రయోజనం లేదు. కోర్టు వ్యవహారంలో కూడా ఆమె తీరు మార్చుకోకపోవడంతో సస్పెన్షన్‌కు గురయ్యారు. -
హత్య కేసులో కొడుకు అరెస్ట్
తిరువళ్లూర తిరువళ్లూరు జిల్లా ఏకాటూరుకు చెందిన మహిళా పండ్ల వ్యాపారి వసంతి. ఈమె మంగళవారం రాత్రి హత్యకు గురైంది. మొదట హత్య కేసుకు సంబంధించి వసంతి భర్తను పోలీసులు అదపులోకి తీసుకుని విచారణ జరిపారు. విచారణలో భర్తకు హత్యతో సంబంధంలేదని గుర్తిం చిన పోలీసులు, కొడుకు బాబును అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. బాబు ఇచ్చిన సమాచారం మేరకు వసంతి హత్యలో బాబు ప్రధాన ముద్దాయిగానూ, బాబుకు సహరించిన కార్తీక్ రెండవ ముద్దాయిగాను గుర్తించి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హత్యకు కారణం ఇదే: వసంతి హత్యకు కారణం కోడలి వివాహేతర సంబంధమేనని పోలీసుల విచారణలో తెలిసింది. వసంతి కుమారుడు బాబుకు అదే ప్రాంతానికి చెందిన విజయలక్ష్మీతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. బాబు, విజయలక్ష్మి అదే ప్రాంతంలో ఉంటున్నారు. ఈ క్రమంలో బాబు స్నేహితుడు కార్తీక్‌కు, విజయలక్ష్మికి వివాహేతర సంబంధం ఉన్నట్టు విచారణలో గుర్తించారు. ఆదివారం వ్యాపారం కోసం వెళ్లిన వసంతి, త్వరగా ఇంటికి వచ్చింది. ఆ సమయంలో వసంతి కోడలు విజయలక్ష్మి, కార్తీక్ కలసి ఉండడం చూసి షాక్‌కు గురైంది. ఆగ్రహించిన వసంతి, కోడలును పుట్టింటికి వెళ్లిపోవాలని ఆగ్రహించింది. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింటికి అలిగి వెళ్లిన భార్యను తీసుకొనిరావడానికి బాబు, కార్తీక్ వెళ్లగా ఇంటిలో అత్త వేధింపులు భరించలేకపోతున్నానని, ఆమె ఉన్నంత వరకు ఇంటికి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో ఇద్దరు వెనుదిరిగారు. మంగళవారం రాత్రి మద్యం సేవించిన బాబు తన తల్లి వలన భార్యకు కలుగుతున్న ఇబ్బందులను కార్తీక్‌కు వివరించాడు. విజయలక్ష్మీతో కార్తీక్‌కు ఉన్న వివాహేతర సంబంధం వసంతికి తెలిసిన విషయాన్ని గుర్తించిన కార్తీక్, ఆమెను హ త్య చేస్తే తగాదాలు ఉండవ ని, ఇందుకు తాను సహకరిస్తానని బాబుకు వివరించాడు. మంగళవారం రాత్రి ఇంటికి చేరుకుని వసంతి మెడకు తాడు చుట్టి హత్య చేసి అనంతరం బ్లేడుతో కోసి చంపారు. అనంతరం హత్యతో తమకు సంబంధం లేన్నట్టు వ్యవహరించారు. బాబును అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో అసలు విషయం బట్టబయలైంది. కన్న తల్లినే హత్య చేసిన కొడుకు ఉదంతం బయటపడడం తీవ్రం చర్చనీయాం శంగా మారింది.