
సాక్షి, సినిమా : మళయాళ సినీ, బుల్లితెర నటి వాసంతి ఇక లేరు. గత కొంత కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె మంగళవారం ఉదయం కన్నుమూశారు.
నాటక రంగంతో నటన కెరీర్‌ను ప్రారంభించిన టి.వాసంతి.. తర్వాత చిత్రాలు, సీరియళ్లలో నటించారు. దాదాపు ప్రతీ మళయాళ టాప్ హీరోల పక్కన ఆమె నటించారు. యవనిక, పుచ్చకోరు ముక్కుతి, నిరాకూటు, గాడ్‌పాధర్ ఆమె చేసిన చిత్రాల్లో ప్రముఖమైనవి.
సుమారు 40 ఏళ్లలో ఆమె 450 చిత్రాల్లో నటించారు. ఆమె భర్త కొంత కాలం క్రితమే చనిపోయారు. వారికి సంతానం కూడా లేరు. మంగళవారం సాయంత్ర తోడుపుఝాలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.