హత్య కేసులో కొడుకు అరెస్ట్
తిరువళ్లూర
తిరువళ్లూరు జిల్లా ఏకాటూరుకు చెందిన మహిళా పండ్ల వ్యాపారి వసంతి. ఈమె మంగళవారం రాత్రి హత్యకు గురైంది. మొదట హత్య కేసుకు సంబంధించి వసంతి భర్తను పోలీసులు అదపులోకి తీసుకుని విచారణ జరిపారు.
విచారణలో భర్తకు హత్యతో సంబంధంలేదని గుర్తిం చిన పోలీసులు, కొడుకు బాబును అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. బాబు ఇచ్చిన సమాచారం మేరకు వసంతి హత్యలో బాబు ప్రధాన ముద్దాయిగానూ, బాబుకు సహరించిన కార్తీక్ రెండవ ముద్దాయిగాను గుర్తించి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
హత్యకు కారణం ఇదే: వసంతి హత్యకు కారణం కోడలి వివాహేతర సంబంధమేనని పోలీసుల విచారణలో తెలిసింది. వసంతి కుమారుడు బాబుకు అదే ప్రాంతానికి చెందిన విజయలక్ష్మీతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. బాబు, విజయలక్ష్మి అదే ప్రాంతంలో ఉంటున్నారు. ఈ క్రమంలో బాబు స్నేహితుడు కార్తీక్‌కు, విజయలక్ష్మికి వివాహేతర సంబంధం ఉన్నట్టు విచారణలో గుర్తించారు. ఆదివారం వ్యాపారం కోసం వెళ్లిన వసంతి, త్వరగా ఇంటికి వచ్చింది. ఆ సమయంలో వసంతి కోడలు విజయలక్ష్మి, కార్తీక్ కలసి ఉండడం చూసి షాక్‌కు గురైంది. ఆగ్రహించిన వసంతి, కోడలును పుట్టింటికి వెళ్లిపోవాలని ఆగ్రహించింది.
ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింటికి అలిగి వెళ్లిన భార్యను తీసుకొనిరావడానికి బాబు, కార్తీక్ వెళ్లగా ఇంటిలో అత్త వేధింపులు భరించలేకపోతున్నానని, ఆమె ఉన్నంత వరకు ఇంటికి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో ఇద్దరు వెనుదిరిగారు. మంగళవారం రాత్రి మద్యం సేవించిన బాబు తన తల్లి వలన భార్యకు కలుగుతున్న ఇబ్బందులను కార్తీక్‌కు వివరించాడు. విజయలక్ష్మీతో కార్తీక్‌కు ఉన్న వివాహేతర సంబంధం వసంతికి తెలిసిన విషయాన్ని గుర్తించిన కార్తీక్, ఆమెను హ త్య చేస్తే తగాదాలు ఉండవ ని, ఇందుకు తాను సహకరిస్తానని బాబుకు వివరించాడు.
మంగళవారం రాత్రి ఇంటికి చేరుకుని వసంతి మెడకు తాడు చుట్టి హత్య చేసి అనంతరం బ్లేడుతో కోసి చంపారు. అనంతరం హత్యతో తమకు సంబంధం లేన్నట్టు వ్యవహరించారు. బాబును అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో అసలు విషయం బట్టబయలైంది. కన్న తల్లినే హత్య చేసిన కొడుకు ఉదంతం బయటపడడం తీవ్రం చర్చనీయాం శంగా మారింది.