thiruvalluru
-
అత్యంత పురాతనమైన త్యాగరాజస్వామి ఆలయం! ఇక్కడ కళ్యాణం..
చెన్నైనగర శివారు ప్రాంతమైన తిరువొట్రియూర్లో అత్యంత పురాతనమైన త్యాగరాజస్వామి ఆలయం ఉంది. అత్యద్భుతమైన శిల్పసౌందర్యంతో, అణువణువునా సొగసైన పనితనం ఉట్టిపడే ఈ ప్రాచీన కట్టడం త్యాగరాజస్వామి ఆలయమైతే, ఈ ఆలయ ప్రాంగణంలోనే పరమశివుడు తన భక్తుడైన సుందరుని కల్యాణాన్ని జరిపించిన వృక్షం నేటికీ భక్తులకు దర్శనమిస్తూ, వారి మనోరథాలను నెరవేరుస్తుంటుంది.స్వామివారి సన్నిధికి కుడివైపునే వడి ఉడై అమ్మన్ ఆలయం ఉంది. ఎడమవైపున జగన్నాథుడు, జగదాంబికల సన్నిధులు నేత్రపర్వం చేస్తుంటాయి. ఆ పక్కనే వినాయకుడు, కుమారస్వామి, బాలపరమేశ్వరుడు, కాళికాంబ సన్నిధులు కనువిందు చేస్తూ, భక్తులకు పరమశివుడి సాన్నిధ్యాన్ని కనులముందు సాక్షాత్కరింపజేస్తుంటాయి. తిరువొట్రియూర్ ఆలయంలోని మరో విశిష్టత ఏమిటంటే, ఇక్కడ నక్షత్రలింగ సన్నిధి అని 27 నక్షత్రాలకు సంబంధించి 27 శివలింగాలున్నాయి. ఈ సన్నిధిలో 27 నక్షత్రాలకు సంబంధించిన భక్తులు తమ జాతక దోషాలను ΄పోగొట్టుకునేందుకు పూజలు చేస్తుంటారు. ఉత్సవమూర్తి అయిన త్యాగరాజస్వామి, మూలవిరాట్టు అయిన ఆదిపురీశ్వరుని విగ్రహాలు భక్తులను ఆనంద పరవశ్యంలో ముంచి వేస్తుంటాయి. సువర్ణకవచాన్ని అలంకరించుకుని ఉన్న మూలవిరాట్టు ధగద్ధగాయమానంగా మెరిసిపోతూ, భక్తులకు కొంగుబంగారంగా భాసిల్లుతుంటుంది. ఎక్కడా లేనివిధంగా ఇక్కడి మూలవిరాట్టు ఆదిపురీశ్వరుడు నిత్యం తైలాభిషేకంలో మునిగి తేలుతుంటాడు. ఆయనకు అభిషేకించిన తైలం పిల్లల మాడుమీద అంటి, నొసట బొట్టులా పెడితే చాలు– బాలారిష్టాలూ, దృష్టిదోషాలూ అంతరించిపోతాయనీ, బాలలు ఆయురారోగ్యాలతో నిత్యం ఆనందంతో కేరింతలు కొడతారని ప్రతీతి. భక్తులు ప్రత్యేక రుసుము చెల్లించడం ద్వారా ఆలయంలో స్వామికి చందనకాప్పు (గంధపు పూత), మంజళ్ కాప్పు (పసుపు పూత), పంచామృతాభిషేకం, క్షీరాభిషేకాలను స్వయంగా నిర్వహించుకోవచ్చు. దోషనివారణ చేసుకోవచ్చు.ఎక్కడ ఉందంటే..?చెన్నై నగరానికి శివారు ప్రాంతంలోనే ఉంది తిరువొట్రియూర్. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ నుంచి బస్సులు, లోకల్ రైళ్లు ఉన్నాయి. ఆటోలలో కూడా ఆలయానికి చేరుకోవచ్చు. తిరువొట్రియూరులో తెలుగు వారు తక్కువేమీ కాదు. అందువల్ల తెలుగుమాత్రమే తెలిసిన వాళ్లకు ఇబ్బంది ఏమీ ఉండదు. బస, భోజన వసతులకు కూడా బాగానే ఉంటాయిక్కడ. తిరువొట్రియూరులో కూడా అలాంటి సౌకర్యం ఉంది కాబట్టి యాత్రికులు తిండికోసం ఇబ్బంది పడనక్కరలేదు.అతిపెద్ద ఆలయం... త్యాగరాజస్వామికి తిరువారూరులో అతిపెద్ద ఆలయం ఉంది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఆలయంగా పేర్కొనే ఈ గుడి తంజావూరు జిల్లాలోని తిరువారూరులో ఉంది. ఈ గుడికి నాలుగువైపులా నాలుగు గోపురాలున్నాయి. ఈ దేవాలయం 30 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో ఉంది. దీనికి అనుసంధానంగా పెద్ద కోనేరు ఉంది. కమలాలయం అనే పేరుగల ఈ కోనేరు ఆలయంకన్నా పెద్దగా ఉండటం విశేషం. దక్షిణ భారతదేశంలో ఇదే అతి పెద్ద కోనేరు. చోళరాజుల కాలం నాటి ఈ గుడి శిల్పసౌందర్యానికి పెట్టింది పేరు. అత్యంత విలువైన దివ్యాభరణాలతో అలంకృతమై ఉన్న త్యాగరాజ స్వామివారి విగ్రహం ఈ గుడిలో కనువిందు చేస్తుంది. అంతేకాదు, ఆలయంలో అనేకమైన తైలవర్ణ చిత్రాలున్నాయి. వాటిలో శయనముద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు చిత్రం చూపు తిప్పుకోనివ్వనంత అద్భుతంగా ఉంటుంది. ఆయన ఎదపైన నటరాజస్వామి నర్తిస్తూ ఉన్నట్లు చిత్రించి ఉండటం మరో అద్భుతం. తిరువారూరులో ఏటా బ్రహ్మాండమైన రథోత్సవం జరుగుతుంది. అంతేకాదు, ఇక్కడ కమలాలయం కోనేరులో జరిగే తెప్పోత్సవానికి కూడా మంచి పేరుంది. -
తెలుగు తల్లీ, అదుగోనమ్మా..!
తెలుగు తల్లీ, అదుగోనమ్మా త్యాగయ్య నాదోపాసన రవళిస్తున్నది నీకు భూపాలమై! కర్ణాటక సంగీతం ముమ్మూర్తుల్లో ఒకరైన శ్రీమాన్ త్యాగరాజు 177వ ఆరాధనోత్సవాలు తిరవైయ్యారులో ఘనంగా జరిగాయి. "విదులకు మ్రొక్కెద సంగీత కోవిదులకు మ్రొక్కెద" అంటూ నాదోపాసనతో నిధికన్నా రాముని సన్నిధి చాల సుఖమని అనుకుని ఆపై "ఏ నోము ఫలమో నీ నామామృత / పానము అను సోపానము దొరికెను" అని తెలుసుకుని జీవించారు; నాదబ్రహ్మమై జీవిస్తున్నారు త్యాగరాజు. వారు పాడింది మనం వినలేకపోయాం. వారి సంగీతం సుఖమైంది మనకు చదువయింది. "సామగాన సార్వభౌమ స్వామి త్యాగరాజ నామ" అంటూ అమృతవర్షిణి రాగంలో రూపక తాళంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఒక కీర్తన చేశారు. కర్ణాటకసంగీతం త్యాగయ్య వల్ల పరిపుష్టమైంది. తెలుగుకు గర్వకారణమైంది. "చల్లని భక్తి", "స్మరణే సుఖము", "కులములెల్ల కడతేఱినట్లు", "పరమానందమనే కమలముపై" వంటివి అన్న త్యాగరాజు గొప్పకవి కూడా. వారు రాసింది చదవగలిగే భాగ్యం మనకు అందింది. సంగీతం కోసమే అన్నా వారి నోటి వెంట గొప్ప కవిత్వమూ పలికింది. "భావాభావ మహానుభావ శ్రీరామచంద్ర భావజనక నా భావము తెలిసియు..." "తన తలుపు తీసినట్టి ఒకరింటికి తాఁ గుక్కల తోలు రీతిగాదో" "తవిటికి రంకాడబోతె కూటి తపిల కోతి కొంపోయినట్టుగాదో" "రాగము తాళము రక్తి భక్తి జ్ఞాన యోగము మఱి యనురాగము లేని భాగవతు లుదర శయనులేగాని..." "మనసు స్వాధీనమైన యా ఘనునికి మఱి మంత్రతంత్రములేల" "యజ్ఞాదులు సుఖమను వారికి సము లజ్ఞానులు కలరా ఓ మనసా" "చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ప్రేమ మీర మెలఁగుచుండే బిరుదు వహించిన సీతారామ..." "ఏఱు నిండి పాఱిన పాత్రకు తగు నీరు వచ్చుగాని" "లేమి దెల్ప పెద్దలెవరు లేరో" (ఇది ఇవాళ్టి తెలుగు కవిత్వానికి, భాషకు, సమాజానికి ఈ మాట సరిగ్గా పొసుగుతుంది) "శాంతము లేక సౌఖ్యము లేదు" ఇవి, ఇలాంటివి ఇంకొన్నీ అన్న వాగ్గాన (వాగ్గేయ) కారులు త్యాగరాజు. రాముణ్ణి "సప్తస్వర నాదాచల దీపం" గా పరిగణించి ఆ వెలుగులో "సంగీత శాస్త్రజ్ఞానము సారూప్య సౌఖ్యదమే మనసా" అని అన్న త్యాగరాజు తెలుగుభాషకు సంగీతం పరంగానే కాదు కవిత్వం పరంగానూ వరవరం. "సామ గాన సార్వభౌమ స్వామి త్యాగరాజ నామ" అంటూ మంగళంపల్లి బాలమురళికృష్ణ నుతిస్తే తెలుగువాళ్లం మనం "కవన సాగర పూర్ణసోమ స్వామి త్యాగరాజ నామ" అంటూ కూడా త్యాగరాజును స్తుతిద్దాం. --రోచిష్మాన్, 9444012279 (చదవండి: అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ.. తెలుగు వారు గర్వపడే విషయం!) -
హత్య కేసులో కొడుకు అరెస్ట్
తిరువళ్లూర తిరువళ్లూరు జిల్లా ఏకాటూరుకు చెందిన మహిళా పండ్ల వ్యాపారి వసంతి. ఈమె మంగళవారం రాత్రి హత్యకు గురైంది. మొదట హత్య కేసుకు సంబంధించి వసంతి భర్తను పోలీసులు అదపులోకి తీసుకుని విచారణ జరిపారు. విచారణలో భర్తకు హత్యతో సంబంధంలేదని గుర్తిం చిన పోలీసులు, కొడుకు బాబును అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. బాబు ఇచ్చిన సమాచారం మేరకు వసంతి హత్యలో బాబు ప్రధాన ముద్దాయిగానూ, బాబుకు సహరించిన కార్తీక్ రెండవ ముద్దాయిగాను గుర్తించి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. హత్యకు కారణం ఇదే: వసంతి హత్యకు కారణం కోడలి వివాహేతర సంబంధమేనని పోలీసుల విచారణలో తెలిసింది. వసంతి కుమారుడు బాబుకు అదే ప్రాంతానికి చెందిన విజయలక్ష్మీతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. బాబు, విజయలక్ష్మి అదే ప్రాంతంలో ఉంటున్నారు. ఈ క్రమంలో బాబు స్నేహితుడు కార్తీక్కు, విజయలక్ష్మికి వివాహేతర సంబంధం ఉన్నట్టు విచారణలో గుర్తించారు. ఆదివారం వ్యాపారం కోసం వెళ్లిన వసంతి, త్వరగా ఇంటికి వచ్చింది. ఆ సమయంలో వసంతి కోడలు విజయలక్ష్మి, కార్తీక్ కలసి ఉండడం చూసి షాక్కు గురైంది. ఆగ్రహించిన వసంతి, కోడలును పుట్టింటికి వెళ్లిపోవాలని ఆగ్రహించింది. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింటికి అలిగి వెళ్లిన భార్యను తీసుకొనిరావడానికి బాబు, కార్తీక్ వెళ్లగా ఇంటిలో అత్త వేధింపులు భరించలేకపోతున్నానని, ఆమె ఉన్నంత వరకు ఇంటికి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో ఇద్దరు వెనుదిరిగారు. మంగళవారం రాత్రి మద్యం సేవించిన బాబు తన తల్లి వలన భార్యకు కలుగుతున్న ఇబ్బందులను కార్తీక్కు వివరించాడు. విజయలక్ష్మీతో కార్తీక్కు ఉన్న వివాహేతర సంబంధం వసంతికి తెలిసిన విషయాన్ని గుర్తించిన కార్తీక్, ఆమెను హ త్య చేస్తే తగాదాలు ఉండవ ని, ఇందుకు తాను సహకరిస్తానని బాబుకు వివరించాడు. మంగళవారం రాత్రి ఇంటికి చేరుకుని వసంతి మెడకు తాడు చుట్టి హత్య చేసి అనంతరం బ్లేడుతో కోసి చంపారు. అనంతరం హత్యతో తమకు సంబంధం లేన్నట్టు వ్యవహరించారు. బాబును అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో అసలు విషయం బట్టబయలైంది. కన్న తల్లినే హత్య చేసిన కొడుకు ఉదంతం బయటపడడం తీవ్రం చర్చనీయాం శంగా మారింది.