ఎంపీ బండి సంజయ్‌కుమార్
బోయినపల్లి(చొప్పదండి): కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో ప్రతి మహిళ పేరిట రూ.లక్ష చొప్పున బ్యాంకులో జమచేస్తా మని, ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తానంటూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేస్తున్న హామీలు పెద్దజోక్ అని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో గురువారం జరిగిన ప్రజాహితయాత్రలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ అధికారంలోకి ఎలాగూ రాలేదని అర్థమై, అడ్డగోలు హామీలు ఇస్తున్నారన్నారు. రిజర్వేషన్ల విషయం తర్వాత కానీ.. మొదట కాంగ్రెస్ పార్టీ పదవులు, లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతం టికెట్లు మహిళలకు ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ఇప్పటికీ దిక్కులేదని చెప్పారు. 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రానికి అధిక నిధులు తీసుకొస్తామన్నారు. బోయినపల్లి మండలకేంద్రంలో మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు మాట్లాడుతూ బండి సంజయ్ గెలిస్తే మోదీ ప్రభుత్వంలో మంత్రిపదవి వస్తుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment