కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, కరీంనగర్‌కు మొండిచేయి చూపారని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలతోపాటు ఒక సెక్షన్ మీడియా చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు కరీంనగర్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రం ప్రతీ పథకానికి ఖర్చు చేసే నిధుల్లో కరీంనగర్ సహా తెలంగాణకూ వాటా ఉంటుందనే సోయి మర్చిపోయి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు దుష్ప్రచారం చేయడం వారి అవకాశవాదానికి పరాకాష్ట అని మండిపడ్డారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రం గత ఐదేళ్లలో రూ.8 వేల కోట్లకుపైగా నిధులు వెచ్చించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. కరీంనగర్ నుంచి వరంగల్, ఎల్క తుర్తి నుంచి సిద్దిపేట జాతీయ రహదారి నిర్మాణం, కరీంనగర్ ఆర్వోబీ నిర్మాణం, రైల్వేస్టేషన్ ఆధునీకరణ, స్మార్ట్‌సిటీ నిధులు కేంద్రానివే అన్నారు. కరీంనగర్– జగిత్యాల రహదారి నిర్మాణం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతలో భాగమే అని వివరించారు. కాంగ్రెస్ మాదిరిగా వంద రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చాక వాటిని గాలికొదిలేసే పార్టీ బీజేపీ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment