TS: సంఘ్‌ పెద్దలతో బీజేపీ నేతల భేటీ  | Telangana BJP Leaders Met Sangh Parivar Leaders About Elections | Sakshi
Sakshi News home page

‘‘ఎట్లా చేద్దాం..?’’ సంఘ్‌ పెద్దలతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ 

Published Tue, Aug 22 2023 7:32 PM | Last Updated on Tue, Aug 22 2023 8:27 PM

Telangana BJP Leaders Met Sangh Parivar Leaders About Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంతో.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ఎన్నికల సమన్వయంపై ఆ పార్టీ నేతలు సంఘ్‌ పెద్దలతో మంగళవారం భేటీ అయ్యారు. తెలంగాణ ఎన్నికల సహ ఇంఛార్జ్‌ సునీల్ బన్సల్‌తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కే.లక్ష్మణ్‌, బండి సంజయ్‌లు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రచారంలో సంఘ్‌ పరివార్‌ కీలకంగా వ్యవహరించనుంది. ఈ నేపథ్యంలోనే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీపరంగా వెంటనే చేయాల్సిన పనులేంటో ఈ సందర్భంగా సంఘ్‌ పెద్దలు తెలంగాణ బీజేపీ నేతలకు సూచించారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి.  మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement