MLA Poaching Case: Bandi Sanjay Emotional Over Notices To BL Santosh - Sakshi
Sakshi News home page

ఆయనేం తప్పు చేశారు?.. ధైర్యంగా ఎదుర్కొంటాం! భావోద్వేగానికి లోనైన బండి సంజయ్‌

Published Tue, Nov 22 2022 7:03 PM | Last Updated on Tue, Nov 22 2022 8:19 PM

MLA poaching case: Bandi Sanjay Emotional Over BL Santosh Notices - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ముఖ్య నేత బీఎల్‌ సంతోష్‌కు నోటీసులు పంపారని, ప్రచారక్‌ల జోలికి వస్తే ఊరుకునేది లేదని కేసీఆర్‌ను  తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ హెచ్చరించారు. కేసీఆర్‌ కుట్రలు, కుతంత్రాలను ధైర్యంగా ఎదుర్కొంటామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు బండి సంజయ్‌.

మంగళవారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘బీఎల్‌ సంతోష్‌ ఏం తప్పు చేశారు? ఆయన ఎమ్మెల్యే కాలేదు.. ఎంపీ కావాలనుకోలేదు.. ఆస్తిపాస్తులు సంపాదించుకోలేదు. కుటుంబ సభ్యులకు పదవులూ ఇప్పించుకోలేదు కూడా. కేవలం దేశం కోసం పని చేసే గొప్ప వ్యక్తి ఆయన. నోటీసుల పేరుతో ఒక ప్రచారక్‌ను అవమానపరిస్తే.. దేశ ప్రజలు సహించబోరని బండి సంజయ్‌ పేర్కొన్నారు. 

అంతేకాదు.. ప్రచారక్‌ల జోలికి వస్తే ఊరుకునేది లేదన్న బండి సంజయ్‌.. బీఎల్‌ సంతోష్‌కు ఫామ్‌ హౌజ్‌లు, బ్యాంకు ఖాతాలు లేవని పేర్కొన్నారు. కుటుంబాన్ని కాపాడుకునేందుకే కేసీఆర్‌.. సంతోష్‌కు నోటీసులు ఇప్పించరాని బండి సంజయ్‌ ఆరోపించారు. అయినా ధైర్యంగా పోరాడేతత్వం బీజేపీదని స్పష్టం చేశారు బండి సంజయ్‌.

ఇదీ చదవండి: కనీస విలువ లేని పదవి నాకెందుకంటూ ‘బొక్కా’ అలక   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement