
కోరుట్ల/మేడిపల్లి/కొండగట్టు: మోదీ రామరాజ్యం కావాలా?.. రాహుల్ రాక్షస రాజ్యం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. శనివా రం జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో ప్రజాహిత యా త్రకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. రాహుల్ కాదు.. రౌల్.. అంటే స్పానిష్ భాషలో తోడేలు లాంటి వాడని అర్థమని, అలాంటి రాహుల్ గాందీని ప్రజలు నమ్మరని చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పక్షాన నిలిచి, దేవుడిని హేళన చేసే పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం చేసిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందని, మళ్లీ కాంగ్రెస్ పాలన వస్తే అక్కడ బాబ్రీ మసీదు కట్టిస్తారని విమర్శించారు. అయోధ్యలో రాముడు పుట్టాడని చెప్పడానికి ఆధారాలేమిటని కాంగ్రెస్ నేతలు చేస్తున్న వివాదాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన పీవీ నరసింహారావును కాంగ్రెస్ పార్టీ ఏనాడూ గుర్తించలేదని, పీవీ ఘాట్ కూల్చేస్తామని మజ్లిస్ వార్నింగ్ ఇస్తే, కాంగ్రెస్ కనీసం నోరు మెదపలేదన్నారు. పీవీ ఘాట్‌పై చేయి వేస్తే దారుస్సలాంను కూల్చేస్తామని వారి్నంగ్ ఇచ్చి న పార్టీ బీజేపీ అని గుర్తు చేశారు. దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన ప్రధాని మోదీ కులాన్ని ప్రశ్నించడం రాహుల్ అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు.
బడ్జెట్ సాక్షిగా కాంగ్రెస్ మోసం..: బడ్జెట్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను దారుణంగా మోసం చేసిందని సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు కావాలంటే కనీసం రూ.5 లక్షల కోట్లు కావాలని, ప్రస్తుత బడ్జెట్‌లో కేవలం రూ.53 వేల కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారని చెప్పారు. ఇచ్చి న హామీలకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులకు ఏమాత్రం సంబంధం లేదని, హామీలు నెరవేర్చలేమని కాంగ్రెస్ పరోక్షంగా చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ఫామ్‌హౌస్ తాంత్రిక నిలయం..: కేసీఆర్ ఫామ్‌హౌస్ తాంత్రిక పూజలకు నిలయమని సంజయ్ ఆరోపించా రు. ఫామ్‌హౌస్‌కు వెళ్లడానికి ప్రస్తుతం ఎవరూ సాహసం చే యడం లేదన్నారు. ‘నా కాళ్లు, చేతులు పడిపోవాలని, నేను చనిపోవాలని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ తాంత్రిక పూజలు నిర్వహించారు’అని ఆరోపించారు. ఇతరుల నాశనం కోరుకునే వారు ఎవరైనా చివరకు వారే నాశనం అవుతారని బండి పేర్కొన్నారు.
రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు గెలుస్తాం: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానా లు గెలవడమే ప్రజాహిత యాత్ర ముఖ్య ఉద్దేశమని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. శనివారం జగిత్యాల జి ల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో ఆయన ప్రత్యేక పూజ లు నిర్వహించి యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ లయ అర్చకులు సన్మానించి, స్వామివారి ప్రసాదం అంద జే శారు.
అనంతరం సంజయ్ మాట్లాడుతూ, మోదీని మూడో సారి ప్రధాని చేయడమే యాత్ర ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొండగట్టు, వేములవాడ, ధర్మపురి ఆలయాలకు నిధులు కేటాయిస్తానని వాగ్ధానం చే సి ఇవ్వలేదని విమర్శించారు. దేవుళ్లను, ప్రజలను మోసం చే సిన ఘనత బీఆర్‌ఎస్ పా ర్టీదేనని అన్నారు. ఈనెల 15 వరకు వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment