సాక్షి, ఖమ్మం: సంజయ్ అన్నా.. ఇక సెలవు అంటూ తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ అభిమాని చేసిన పని చర్చనీయాంశంగా మారింది. బండి సంజయ్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేశాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు.
ఖమ్మం బీజేపీ టౌన్ ఉపాధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్.. ఆత్మహత్యాయత్నం చేశాడు. బండి సంజయ్‌ను తొలగించడాన్ని తట్టుకోలేకే తాను ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు మరీ ప్రకటించుకున్నాడతను. కుటుంబ సభ్యులు స్థానికంగా టౌన్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘‘అన్నా.. ఇక సెలవు.. సంజయన్నను అధ్యక్ష పదవి నుండి తొలగించడం తట్టుకోలేకపోతున్నా’’ అంటూ తన సహచరులకు, పార్టీ నేతలకు ఫోన్లు చేసి ఆత్మహత్యకు పాల్పడ్డారని జిల్లా నేతలు చెబుతున్నారు.
బండి సంజయ్ కుమార్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుండి తప్పిస్తూ బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ సోషల్ మీడియాలో లక్షలాది సంఖ్యలో తప్పుపడుతున్నారు. అదే సమయంలో బండి సంజయ్ ను తప్పించడాన్ని పార్టీ శ్రేణులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాయి. కష్టపడే నాయకుడికి దక్కిన ప్రతిఫలం ఇదేనా? అంటూ నిలదీస్తున్నాయి. మరోవైపు బండి సంజయ్ అభిమానులు తీవ్రమైన నిరాశలో కూరుకుపోయారు.
ఇదీ చదవండి: బండి సంజయ్‌ను అసలు ఎందుకు తొలగించారు?
Comments
Please login to add a commentAdd a comment