Mass weddings
-
వివాహబంధంతో ఒక్కటైన 37 జంటలు
సోలాపూర్: సోలాపూర్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ శాసనసభ్యుడు సుభాష్ దేశ్‌ముఖ్ నేతృత్వంలో లోకమంగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజాపూర్ రోడ్డు వైపునున్న డీఈడీ కళాశాల మైదానంలో పట్టణంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో 37 జంటలు వివాహబంధంతో ఒక్కటయ్యాయి. ఈ సందర్భంగా సాంప్రదాయబద్ధంగా ముస్తాబైన వధూవరులను గుర్రపు బగ్గీల్లో, బ్యాండ్ బాజాలతో ఊరేగించారు. ఈ వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే సుభాష్ దేశముఖ్, మాజీ ఎంపీ జయసిద్ధేశ్వర మహాస్వామి, లోకమంగల్ ఫౌండేషన్ అధ్యక్షుడు రోహన్ దేశముఖ్, మనీష్ దేశముఖ్, పంచాక్షరి శివాచార్య మహాస్వామిజీ, శ్రీకాంత్ శివచార్య మహాస్వామి, సిద్ధ లింగ మహాస్వామి లతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇకపై ప్రతిగ్రామంలో నిర్వహిస్తాం: ఎమ్మెల్యే సుభాష్ దేశ్‌ముఖ్ భవిష్యత్తులో లోకమంగల్ ఫౌండేషన్ దక్షిణ సోలాపూర్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ లోని ప్రతి గ్రామంలో సామూహిక వివాహాలను నిర్వహించాలని సంకల్పించినట్లు సుభాష్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. వివాహం చేసుకోదలచిన జంటలు ముందస్తుగా తమ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామపంచాయితీ మెంబర్ల ద్వారా లోక్‌మంగల్ ఫౌండేషన్‌ను సంప్రదించాలని కోరారు. ఒక్కో గ్రామం నుంచి కనీసం ఐదు జంటలు లేదా అంతకుమంచి ఎందరు ముందుకు వచ్చినా వారిని వివాహబంధంతో ఒక్కటి చేస్తామని, వివాహ వేడుకల నాడు గ్రామప్రజలందరికీ విందును కూడా ఏర్పాటుచేయనున్నట్లు వివరించారు. -
హోటల్ అద్దెలు పైపైకి
న్యూఢిల్లీ: నూతన సంవత్సరం, క్రిస్మస్, పెద్ద సంఖ్యలో వివాహాలు ఇవన్నీ కలసి హోటళ్ల ధరలను పెంచేస్తున్నాయి. వేడుకలు చేసుకునే వారు మరింత ఖర్చు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో హోటళ్లలో గదుల ధరలు గణనీయంగా పెరిగినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు, సదస్సులు హోటళ్ల ధరలు పెరగడానికి దారితీశాయని చెప్పుకోవాలి. కార్పొరేట్ బుకింగ్‌లు ఒకవైపు, మరోవైపు జీ20 దేశాల సద స్సు, ఐసీసీ ప్రపంచకప్ వంటివి కొన్ని పట్టణాల్లో హోటళ్లకు డిమాండ్‌ను అమాంతం పెంచేశాయి. అవే రేట్లు కొనసాగేందుకు లేదా మరింత పెరిగేందుకు పెద్ద సంఖ్యలో వివాహ వేడుకలు, ఏడాది ముగింపులో వేడుకలు తోడయ్యాయని చెప్పుకోవాలి. హోటళ్లలో వందల సంఖ్యలో పెళ్లి నిశ్చితార్థ కార్యక్రమాలకు ఇప్పటికే బుకింగ్‌లు నమోదైనట్టు యజమానులు చెబుతున్నారు. దేశీ యంగా పర్యాటకుల సంఖ్య పెరగడం కూడా క్రిస్మస్–న్యూ ఇయర్ సందర్భంగా రేట్ల పెరుగుదలకు కారణంగా పేర్కొంటున్నారు. కొన్ని హోటళ్లలో ఇప్పటికే బుకింగ్‌లు అన్నీ పూర్తయిపోయాయి. ఉదయ్‌పూర్‌లోని హోటల్ లీలా ప్యాలెస్‌లో క్రిస్మస్ సందర్భంగా ఒక రాత్రి విడిదికి రూ.1,06,200గా (బుకింగ్ డాట్‌కామ్) ఉంది. సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో ఒక రాత్రి విడిదికి రూ.1,64,919 వసూలు చేస్తున్నారు. డిమాండ్ అనూహ్యం రాజస్థాన్‌లో ఫోర్ట్ బర్వారా ప్రాపర్టీని నిర్వహించే ఎస్సైర్ హాస్పిటాలిటీ గ్రూప్ సీఈవో అఖిల్ అరోరా సైతం డిమాండ్ గణనీయంగా పెరిగినట్టు చెప్పారు. ‘‘ఈ ఏడాది పండుగల సీజన్లో డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఇది రేట్లు పెరిగేందుకు దారితీసింది. గతేడాదితో పోలిస్తే రేట్లు 10–15 శాతం మేర పెరిగాయి. సిక్స్‌సెన్స్ ఫోర్ట్ బర్వారా, జానా, కంట్రీ ఇన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ తదితర మా హోటళ్లలో అతిథుల కోసం అద్భుతమైన వేడుకలకు ఏర్పాట్లు చేశాం. కనుక వీలైనంత ముందుగా బుక్ చేసుకోవడం ద్వారా ప్రశాంతంగా ఉండొచ్చు’’అని అరోరా తెలిపారు. ఉదయ్‌పూర్‌లోని ఎట్ అకార్ అగ్జరీ హోటల్ ర్యాఫెల్స్ లో రోజువారీ ధరలు సగటున 24 శాతం మేర పెరిగాయి. గడిచిన ఆరు నెలల కాలంలో రేట్లు పెరిగినట్టు 49 శాతం మేర హోటల్ యాజమాన్యాలు తెలిపాయి. గోవా, పుదుచ్చేరి, ఊటీ క్రిస్మస్ వేడుకలకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. -
ఒకే రోజు 95 జంటలకు పెళ్లి.. ఎక్కడంటే!
అన్నానగర్(చెన్నై): తిరువందిపురంలో ఆదివారం ఒకే రోజు 95 పెళ్లిలు జరిగాయి. వివరాల్లోకి వెళితే.. కడలూరు సమీపంలోని తిరువందిపురంలో ప్రసిద్ధి చెందిన దేవనాథస్వామి ఆలయం ఉంది. గుడి ముందున్న కొండపై శుభ ఘడియలు ఉన్న రోజుల్లో రోజుకు 50 నుంచి 200 వరకు పెళ్లిళ్లు జరుగుతాయి. అలాగే తిరువందిపురం ప్రాంతంలోని ప్రైవేట్ మంటపాల్లో కూడా వివాహాలు జరుగుతాయి. ఆదివారం ముహుర్తాలు ఉండడంతో తిరువందిపురంలోని దేవనాథస్వామి ఆలయ కొండపై ఉన్న హాలులో తెల్లవారుజామున నుంచి వివాహ వేడుకలు జరిగాయి. కొండపైన 70 పెళ్లిళ్లు జరగ్గా ఆ గుడి చుట్టుపక్కల ప్రైవేట్ హాళ్లలో 25 పెళ్లిళ్లు మొత్తం 95 వివాహాలు జరిగాయి. అనంతరం భార్యాభర్తలు కుటుంబ సమేతంగా దేవనాథస్వామి ఆలయానికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్నారు. శుభకార్యాలకు జనం అధిక సంఖ్యలో వాహనాల్లో తరలివచ్చారు. దీంతో కడలూరు, బాలూరు రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. చదవండి: తాగుబోతు కోతి.. లిక్కర్ బాటిళ్లు చోరీ చేస్తూ లాగించేస్తోంది! -
తిరుమలలో కళ్యాణమస్తుకు ముహూర్తం ఫిక్స్! ఆ రోజునే పెళ్లిళ్లు..
సాక్షి, తిరుమల: పేదవారికి అండగా ఉండడానికి కళ్యాణమస్తూ కార్యక్రమాన్ని పున:ప్రారంభిస్తున్నామని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఇవాళ ఉదయం అభిషేక సేవలో స్వామివారిని దర్శించుకున్న టిటిడి చైర్మన్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 7వ తేదిన 26 జిల్లాలో కళ్యాణమస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆగస్టు 7వ తేదిన ఉదయం 8 నుంచి 8:17 నిముషాల మధ్య పండితులు మహూర్తం నిర్ణయించారని, కలెక్టర్ కార్యాలయాలు, ఆర్డిఓ కార్యాలయాల్లో వివాహ జంటలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని టిటిడి చైర్మన్ తెలిపారు. నక్షత్ర యుక్త సింహలగ్నంలో సామూహిక వివాహాలు జరిపిస్తామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు వస్తే ఆయా ప్రాంతాలలో కూడా కళ్యాణమస్తూ కార్యక్రమాన్ని టిటిడి నిర్వహించేందుకు సిద్దంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. చదవండి👇కవల కానిస్టేబుళ్లు.. రోజూ చూస్తున్నా సరే.. కనుక్కోవడం కష్టమే సుమా! ఈ నెల 7న ‘వైఎస్సార్ యంత్ర సేవ’ ప్రారంభం . @AndhraPradeshCM శ్రీ @ysjagan గారి ఆదేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 7వ తేదీ టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణమస్తు ఉచిత సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నాము. — Y V Subba Reddy (@yvsubbareddymp) June 3, 2022 -
ప్రేమికుల దినోత్సవం రోజున 36 జంటలకు పెళ్లి
వజ్రపు కొత్తూరు రూరల్: శ్రీరస్తు.. శుభమస్తు.. అంటూ సామూహిక పెళ్లి పుస్తకాలను లిఖిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం నువ్వల రేవు గ్రామస్తులు. ప్రేమికుల దినోత్సవం రోజైన ఆదివారం 36 జంటలకు సామూహికంగా వివాహాలు జరిపించి తమ ఆచారాన్ని కొనసాగించారు. ఇక్కడి వారంతా మత్స్యకారులే కావడంతో చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సంపాదన నామమాత్రమే కావటంతో దశాబ్దాల కిందట గ్రామ పెద్దలంతా కలిసి ఓ నిర్ణయం చేశారు. ఒక్కొక్కరు వివాహాలు చేసుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుందని కాబట్టి.. గ్రామంలో పెళ్లీడుకు వచ్చిన వారందరినీ గుర్తించి ఒకేసారి వివాహాలు చేయడం, వధూవరుల బంధువులందరికీ సామూహికంగా భోజనాలు ఏర్పాటు చేయడం వల్ల ఖర్చు తగ్గుతుందని భావించారు. అప్పటినుంచి ఇప్పటివరకూ అదే సంప్రదాయాన్ని పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం నాడే సామూహిక వివాహాలు జరిపించాలని నిర్ణయించి.. ఆ మేరకు 36 జంటలను ఏకం చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఒకే వేదికపై 36 మంది పురోహితులు ఏకకాలంలో వేద మంత్రాలు జపించగా.. తాళి కట్టే శుభవేళ ఊరు ఊరంతా మంగళధ్వనులతో మార్మోగింది. నూతన జంటలను ఆశీర్వదించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి బంధుమిత్రులు తరలిరావడంతో నువ్వల రేవు జన సంద్రంగా మారింది. చదవండి: ఆ కుటుంబం ఓటమి ఎరగదు.. హతవిధీ.. ‘గుర్తు’ తప్పింది! -
సమాజ పరివర్తన కోసం ఇస్లాం ధర్మం
కర్నూలు(కల్చరల్)/ఓల్డ్‌సిటీ: మానవ సమాజ పరివర్తన కోసం మహమ్మద్ ప్రవక్త తన జీవితాన్ని అంకితం చేసి ఇస్లాం ధర్మాన్ని వ్యాపింపజేశారని, ఆ ధర్మాన్ని ముస్లింలు తమ జీవన గమనంలో పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని మౌలానా (మతపెద్ద) జంషెద్ తెలిపారు. కర్నూలు సమీపంలోని నన్నూరు వద్ద తబ్లీగ్ జమాత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇస్తెమా రెండో రోజున మధ్యాహ్నం జోహర్ నమాజ్ అనంతరం మౌలానా జంషెద్ ప్రవచనాన్ని బోధిస్తూ ఇస్లాం ధర్మ విశిష్టతను తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త సూచించిన విధానంలో నిఖా చేయడం మేలైన మార్గమని, అనవసర ఖర్చులు ఆయన విధానం కాదని తబ్లీగ్ జమాత్ ప్రముఖుడు హజరత్‌జీ సాద్‌సాహబ్ ముస్లింలకు సూచించారు. ఆదివారం సాయంత్రం ఆయన సమక్షంలో సామూహిక వివాహాలు జరిగాయి. రెండో రోజున భారీగా తరిలి వచ్చిన జనం కర్నూలులో జరుగుతున్న ఇస్తెమాకు దేశం నలుమూల నుంచి ఉప్పెనలా జనం కదిలి వచ్చారు. ఇస్తెమా ప్రాంగణంలో భక్తులే కాకుండా రాజస్తాన్, బిహార్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు సైతం తరిలి వచ్చి అరుదైన వస్తులు విక్రయిస్తున్నారు. రెండో రోజు ఇస్తెమా.. హజ్ యాత్రను తలపించిందని పలువురు భక్తులు తెలిపారు. సోమవారం హజ్రత్‌జీ ప్రసంగం తరువాత దువా కార్యక్రమంతో ఇస్తెమా ముగుస్తుంది. ఇస్తెమాలో వైఎస్సార్సీపీ నాయకులు ఇస్తెమాకు వైఎస్సార్సీపీ రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు భారీ సంఖ్యలో ఆదివారం హాజరయ్యారు. విజయవాడ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యే ఐజయ్య, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, గౌరు వెంకటరెడ్డి, రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖాదర్‌బాషా, షఫీ పాల్గొన్నారు. -
తాళికట్టు శుభవేళ..!
కర్నూలు, హొళగుంద: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా ఆదివారం సామూహిక వివాహ కార్యక్రమం వైభవంగా సాగింది. స్వేరోస్ నెట్వర్క్, హార్డ్స్, భారత్యూత్ అసోసియేషన్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు దుర్గాప్రసాద్, చలపతి, కన్నారావు, రవికాంత్, వైఎస్సార్సీపీ నాయకుడు హోటల్ తిమ్మయ్య, సీపీఐ మండల సహాయ కార్యదర్శి మారెప్ప ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 15 జంటలు తాళిబంధం ద్వారా ఒక్కటయ్యాయి. పురోహితుడు నటరాజస్వామి వేద మంత్రాల మధ్య వధూవరులు పెళ్లి చేసుకున్నారు. స్వేరోస్ వ్యవస్థాపకుడు, తెలంగాణ ఐజీ ప్రవీణ్‌కుమార్, మాజీ మంత్రి మూలింటి మారెప్ప, రిటైర్డు ఐఏఎస్ అధికారి శ్రీనివాసులు, ఐఏఎస్ అధికారి అనిల్‌కుమార్, కర్నూలు డీఎస్పీ బోయగడ్డ రామయ్య, తిరుపతి సీనియర్ సివిల్ జడ్జి రామచంద్రుడు తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మండలానికి చెందిన పెద్దలు, ఎల్లార్తి దర్గాల మాజీ నిర్వాహకుడు మల్లికార్జున, బీజేపీ స్టే కౌన్సిల్ సభ్యుడు చిదానంద, తోక వెంకటేశ్, దురుగప్ప, హెబ్బటం పక్కీరప్ప, గుబ్బళ్లీ లక్ష్మయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
గిరిజన జంటలకు సామూహిక పెళ్లిళ్లు
బెజ్జూర్(సిర్పూర్): కుమురం భీం జిల్లా బెజ్జూర్ మండలంలో సోమిని గ్రామ శివారు, ప్రాణహిత నది ఒడ్డున నిర్వహించిన సమ్మక్క–సారలమ్మ జాతరలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో మంగళవారం 58 గిరిజన జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. మంత్రి జోగు రామన్న, ఐటీడీఏ చైర్మన్ లక్కెరావు, ఎమ్మెల్యే సతీమణి రమాదేవిలతో పాటు అరిగెల నాగేశ్వరరావు పెళ్లి పెద్దలుగా హాజరై గిరిజన జంటలను ఆశీర్వదించారు. నూతన వధూవరులకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కుటుంబ సభ్యులు మంగళసూత్రాలు, మెట్టెలు అందించారు. ఎమ్మెల్యేతోపాటు మంత్రి నూతన వధూవరులకు గృహోపయోకరణ సామగ్రిని అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ కేసీఆర్ మంత్రి వర్గంలో ఉండి 58 నూతన జంటలను ఆశీర్వదించడం చాలా గర్వంగా ఉందన్నారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ ఈ 58 జంటలే కాకుండా మరో 116 జంటలకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు చేయిస్తానన్నారు. త్వరలో సిర్పూర్‌పేపర్ మిల్లును తెరిపించి కార్మికుల కష్టాలను తొలగించేంత వరకు నిద్రపోనన్నారు. కార్యక్రమంలో కోనేరు ట్రస్ట్ అధ్యక్షుడు కోనేరు వంశీ దంపతులు, జెడ్పీటీసీ సభ్యులు కోండ్ర శారద జగ్గాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఖర్చు తగ్గిద్దాం..కలసి పెళ్లి చేసుకుందాం..
కరంజిలో సామూహిక వివాహాలు తలమడుగు(బోథ్): ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం కరంజి గ్రామంలో ఆదివారం అంగరంగ వైభవంగా సామూహిక వివాహాలు జరిపించారు. పెళ్లిళ్లకు ఆడంబరాలను, వృథా ఖర్చులను అరికట్టాలనే ఉద్దేశంతో గ్రామస్తులు 25 ఏళ్ల క్రితం సామూహిక వివాహాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికీ ఆ ఆనవాయితీ కొనసాగిస్తున్నారు. ఆదివారం 11 జంటలకు వివాహం జరిపించారు. వీరిలో కరంజి గ్రామానికి చెందిన ఐదు జంటలు, చుట్టుపక్కల గ్రామాలతోపాటు మహారాష్ట్రకు చెందిన వారూ ఉన్నారు. వధూవరులను రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ తదితరులు ఆశీర్వదించారు. -
పేద ముస్లింలకు యోగి వరం
తన కాషాయ దుస్తులను బట్టి తనను కేవలం ఒక వర్గానికి మాత్రమే చెందినవాడిగా అంచనా వేయొద్దని, తన పనులు చూసి అప్పుడు చెప్పాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తొలినాళ్లలోనే చెప్పారు. అన్నట్లుగానే ఆయన ఇప్పుడు మైనారిటీల సంక్షేమం మీద దృష్టిపెట్టారు. పేద ముస్లిం కుటుంబాలు తమ కుమార్తెల పెళ్లిళ్లకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా.. వారికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. దాంతోపాటు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో.. ముస్లింలకు సామూహిక వివాహాలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. సద్భావన మండపాలు ఉత్తరప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో సామూహిక వివాహాలు జరిపించేందుకు వీలుగా ’సద్భావనా మండపాలు’ నిర్మించాలని యోగి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి మంచి స్పందన వస్తే.. ప్రతియేటా రెండుసార్లు చొప్పున ఈ సామూహిక వివాహాలు నిర్వహిస్తారు. ప్రధానంగా పేద ముస్లిం కుటుంబాల కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. ఇప్పటివరకు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారికి కుమార్తెల పెళ్లిళ్లకు ప్రభుత్వం రూ. 20వేల సాయం అందిస్తోంది. అయితే, ఈ పథకంలో అవినీతి ఎక్కువగా ఉందని, ముస్లిం కుటుంబాలకు ఇది అందడం లేదని ఆరోపణలున్నాయి. యోగి మదిలో ఆలోచనే పరిస్థితులను నిశితంగా గమనించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఈ సామూహిక వివాహాల ప్రతిపాదనను తీసుకొచ్చారని మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మొహిసిన్ రజా చెప్పారు. సద్భావన మండపాలు పేద ముస్లిం కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.