( ఫైల్ ఫోటో )
సాక్షి, తిరుమల: పేదవారికి అండగా ఉండడానికి కళ్యాణమస్తూ కార్యక్రమాన్ని పున:ప్రారంభిస్తున్నామని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఇవాళ ఉదయం అభిషేక సేవలో స్వామివారిని దర్శించుకున్న టిటిడి చైర్మన్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 7వ తేదిన 26 జిల్లాలో కళ్యాణమస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఆగస్టు 7వ తేదిన ఉదయం 8 నుంచి 8:17 నిముషాల మధ్య పండితులు మహూర్తం నిర్ణయించారని, కలెక్టర్ కార్యాలయాలు, ఆర్డిఓ కార్యాలయాల్లో వివాహ జంటలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని టిటిడి చైర్మన్ తెలిపారు. నక్షత్ర యుక్త సింహలగ్నంలో సామూహిక వివాహాలు జరిపిస్తామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు వస్తే ఆయా ప్రాంతాలలో కూడా కళ్యాణమస్తూ కార్యక్రమాన్ని టిటిడి నిర్వహించేందుకు సిద్దంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
చదవండి👇కవల కానిస్టేబుళ్లు.. రోజూ చూస్తున్నా సరే.. కనుక్కోవడం కష్టమే సుమా!
ఈ నెల 7న ‘వైఎస్సార్ యంత్ర సేవ’ ప్రారంభం
. @AndhraPradeshCM శ్రీ @ysjagan గారి ఆదేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 7వ తేదీ టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణమస్తు ఉచిత సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నాము.
— Y V Subba Reddy (@yvsubbareddymp) June 3, 2022
Comments
Please login to add a commentAdd a comment