kalyanamasthu
-
కళ్యాణ‘మస్తు’ ఉన్నా ఏడుపేనా రామోజీ?
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు వికృత రాతలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విషం జిమ్మడమే లక్ష్యంగా దురుద్దేశపూరిత కథనాలను అచ్చేస్తున్న ఈనాడు రామోజీరావు పేద బిడ్డల పెళ్లికి ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. బడుగు, బలహీనవర్గాలవారి వివాహాలకు గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన సాయం కంటే దాదాపు రెట్టింపుకు పైగా సాయాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తున్నా రామోజీ పచ్చకళ్లకు కనిపించడం లేదు. అంతేకాకుండా గత టీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించినా తనకేమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే ‘కళ్యాణమస్తు.. జాప్యం మస్తు’ అంటూ ఒక విష కథనాన్ని సోమవారం ఈనాడు పత్రికలో అచ్చేశారు. అసత్యాలు, అబద్ధాలతో సాగిన ఈ కథనానికి సంబంధించి అధికారులు వెల్లడించిన వాస్తవాలివిగో.. పేదింటి బిడ్డల పెళ్లికి ఉద్దేశించిన కళ్యాణమస్తు పథకం కింద 43,490 జంటలకు గత టీడీపీ ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాల్సి ఉంది. అయితే 2018 నుంచి రూ.177.96 కోట్లు చెల్లించకుండా ఎగనామం పెట్టింది. ఆర్థిక సాయం చేస్తామని ఆశపెట్టి వారిని నిండా ముంచింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత టీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నింటినీ విడుదల చేసింది. ఈ విషయాన్ని ఈనాడు తన కథనంలో ఉద్దేశపూర్వకంగా విస్మరించింది. పైగా లబ్దిదారులకు ఆర్థిక సాయం విడుదలలో గత టీడీపీ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో ఒక్కపదం రాస్తే ఒట్టు. లబ్దిదారులకు తప్పిన అవస్థలు.. గత ప్రభుత్వం హయాంలో లబ్దిదారుల ఎంపికలో కళ్యాణమిత్రలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రస్తుత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా దరఖాస్తుల నమోదు, పరిశీలన, ధ్రువీకరణను సులభం చేసింది. దీంతో లబ్ధిదారులకు అవస్థలు తప్పాయి. దరఖాస్తులు, ధ్రువీకరణను సైతం డిజిటలైజ్ చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో 2.6 లక్షల మంది వలంటీర్లు సహాయమందిస్తుండటంతో లబ్దిదారుల ఎంపిక మరింత సులువైంది. ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆశయంతో.. ఆడ పిల్లల చదువులను ప్రోత్సహించాలనే మహోన్నత లక్ష్యంతో వివాహాలు చేసుకునేవారు కనీసం పదో తరగతి చదివి ఉండాలని ప్రభుత్వం నిబంధన విధించింది. దీంతో తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను పదో తరగతి వరకు తప్పనిసరిగా చదివిస్తున్నారు. అలాగే కళ్యాణమస్తు పథకానికి అర్హులు కావాలంటే వధువులకు 18 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉండాలని ప్రభుత్వం మరో నిబంధన పెట్టింది. దీంతో అందరూ ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నతాశయం ఆచరణలో మంచి ఫలితాలు ఇస్తోంది. పేద పిల్లలకు జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన వంటి పథకాల ద్వారా ఉన్నత విద్యకు మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు. ముస్లిం, మైనారిటీలు విద్యలో తక్కువ శాతం ఉన్నారని.. కాబట్టి ప్రభుత్వం పదో తరగతి నిబంధన సడలించాలని ఈనాడు తన కథనంలో రాయడం సంకుచితమే అవుతుంది. కళ్యాణమస్తు పథకానికి ముడిపెట్టి వారిని చదువుకు దూరం చేసే ప్రయత్నం ‘ఈనాడు’ చేయడం దుర్మార్గం. కళ్యాణమస్తు, షాదీ తోఫా కోసం ప్రభుత్వం పదో తరగతి చదివి ఉండాలనే నిబంధన పెట్టడం వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్న ఉన్నతాశయమే తప్ప మరొకటి కాదు. పెళ్లిళ్లకు నిబంధనలు అంటూ ఈనాడు అసత్య ఆరోపణలు... ప్రస్తుత ప్రభుత్వం పెళ్లిళ్లకు ఆర్థిక సాయంఅందించడంలో నిబంధనలు పెడుతోందంటూ ఈనాడు అసత్య ఆరోపణలు చేసింది. కొత్తగా ఆంక్షలు విధించడం వల్ల లబ్దిదారుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని అబద్ధాలను అచ్చేసింది. గతేడాది నవంబర్ 23న జరిగిన చివరి విడతలో దరఖాస్తులు, ఆర్థిక సాయం విడుదల గమనిస్తే ‘ఈనాడు’ వక్రరాతల్లో డొల్లతనం అర్థమవుతోంది. దరఖాస్తులకు గడువు ఆగస్టు–అక్టోబర్ 2023 వరకు ఆర్థిక సాయం విడుదల: నవంబర్ 23, 2023 వచ్చిన దరఖాస్తుల సంఖ్య 11,807 అనర్హతకు గురయిన దరఖాస్తులు 1,196 ఆమోదం పొందిన దరఖాస్తులు 10,611 ఈ జంటలకు ప్రభుత్వం రూ.81.64 కోట్లు పంపిణీ చేసింది.(( అంతేకాకుండా ముందుగా దరఖాస్తు చేసుకున్న వారిలో తిరస్కరణకు గురైన దరఖాస్తులను ప్రభుత్వం మరోసారి పరిశీలించి 267 జంటలకు రూ.2.15 కోట్లను అందించింది)) ఈనాడు తన కథనంలో గత ప్రభుత్వంలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి అనే లెక్కలే ప్రస్తావించకపోవడం గమనార్హం. కానీ గతానికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం ప్రతి దరఖాస్తులను పరిశీలించి, ధ్రువీకరించి, జాబితాలను కూడా సోషల్ ఆడిట్లో అందుబాటులో ఉంచుతోంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద ఆర్థిక సాయం అందిస్తోంది. నాడు–నేడు తేడా ఇలా.. ♦ గత టీడీపీ ప్రభుత్వంలో ఆర్థిక సాయం అనే మాటే కల్ల. ప్రస్తుత ప్రభుత్వం మూడు నెలలకు ఒకసారి నమోదైన లబ్దిదారులందరికీ ఒకేసారి విడుదల చేస్తోంది. ూ గత ప్రభుత్వం హయాంలో పట్టణ ప్రాంతాల్లోని మెప్మా కార్యాలయాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా స్థానికంగానే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ♦ గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ఐకేపీల పరిధిలోని మండల సమాఖ్యల ద్వారా లబ్దిదారులను ఎంపిక చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం లబ్ధిదారులు ఉన్న చోట నుంచే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఎంపిక చేస్తోంది. ♦ గత ప్రభుత్వం బకాయిలను విడుదల చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో వివాహం జరిగిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకుంటే మూడు నెలలకు ఒకసారి అప్పటివరకు వచ్చినవాటన్నింటికీ ఆర్థిక సాయం అందిస్తోంది. ఎలాంటి లంచాలకు తావు లేకుండా నేరుగా వధువుల తల్లుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తోంది. -
కళ్యాణమస్తు, షాదీతోఫా ఆపే ప్రసక్తే లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, భవన నిర్మాణ కార్మికుల పిల్లలు వివాహాలను గౌరవప్రదంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణమస్తు, షాదీతోఫా పథకాలను ఆపే ప్రసక్తే లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున స్పష్టంచేశారు. ఈ పథకాలను ఆపేస్తోందంటూ చేస్తున్న అసత్య ప్రచారాన్ని, ప్రభుత్వంపై బురదజల్లడాన్ని టీడీపీ మానుకోవాలని అన్నారు. మంత్రి అసెంబ్లీలో గురువారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాల ద్వారా నిరుపేదలకు మరింత ఆర్ధిక చేయూత ఇచ్చే సంకల్పంతో అనేక మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం 17,709 మంది లబ్ధిదారులకు రూ.68.68 కోట్లు ఎగ్గొట్టిందని చెప్పారు. ఆ డబ్బు కూడా తమ ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో కళ్యాణమస్తు పథకం కింద ఎస్సీలకు రూ.40 వేలు ఇవ్వగా, ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.లక్ష ఇస్తోందని తెలిపారు. వీరు కులాంతర వివాహాలు చేసుకుంటే ఇచ్చే మొత్తాన్ని రూ.75 వేల నుంచి రూ.లక్షకు పెంచామన్నారు. గిరిజనులకు గతంలో రూ.50 వేలు ఇవ్వగా, ఈ రోజు రూ. లక్ష ఇస్తున్నామని, కులాంతర వివాహాలు చేసుకుంటే ఇచ్చే మొత్తాన్ని రూ.75 వేల నుంచి రూ.1.20 లక్షలకు పెంచామని తెలిపారు. బీసీ వర్గాలకు ఇచ్చే మొత్తాన్ని రూ.35 వేల నుంచి రూ.50 వేలకు, వీరు కులాంతర వివాహం చేసుకుంటే ఇచ్చే మొత్తాన్ని రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచామని వివరించారు. మైనార్టీలకు గతంలో రూ.50 వేలే ఇస్తే, ప్రస్తుతం రూ.లక్ష ఇస్తున్నామని చెప్పారు. వికలాంగులకు గతంలో రూ.లక్ష ఇవ్వగా, ఈరోజు రూ.1.50 లక్షలు ఇస్తున్నామన్నారు. భవన నిర్మాణ కార్మికులకు గతంలో రూ.20 వేలు ఇస్తే, ప్రస్తుతం రూ.40 వేలు ఇస్తున్నట్లు చెప్పారు. కొత్తగా దూదేకుల, నూర్‌బాషా సామాజికవర్గాల వారిని మైనార్టీలుగా పరిగణించి, వారికి కూడా రూ.లక్ష చొప్పున ఇస్తున్నామని చెప్పారు. ఈ విధంగా ఈ 4 ఏళ్లలో 35 వేల దంపతులకు రూ.267 కోట్ల లబ్ధి చేకూర్చామన్నారు. ఈ పథకాల ద్వారా ఆర్ధిక సాయం ఒక్కటే కాదు.. బాల్య వివాహాలను అరికట్టడంతో పాటు వారి అక్షరాస్యతను పెంపొందించేలా నిబంధనలు పెట్టామన్నారు. మొదటి వివాహం చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆర్ధిక సాయం అందిస్తున్నామని చెప్పారు. అత్యంత సమర్ధవంతంగా పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే విశ్వసరాయ కళావతి మాట్లాడుతూ నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులకు కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు వరమేనని చెప్పారు. గొప్ప ఆశయంతో ఈ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయా వర్గాలు జీవితాంతం రుణపడి ఉంటాయని అన్నారు. -
కళ్యాణమస్తు, షాదీ తోఫా నగదు జమ చేసిన సీఎం వైఎస్ జగన్
-
కళ్యాణమస్తు, షాదీ తోఫా: వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: పిల్లల చదువును ప్రోత్సహించడం, బాల్య వివాహాలను నివారించడం మాత్రమే కాదు.. పాఠశాలల్లో చేరికల శాతాన్ని పెంచడం, డ్రాపౌట్ రేట్‌ను గణనీయంగా తగ్గించడం లక్ష్యాలుగా ‘‘వైఎస్సార్ కళ్యాణమస్తు’’, ‘‘వైఎస్సార్ షాదీ తోఫా’’ పథకాలకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ పథకాలు అమలులోకి రానుండగా.. వీటికి సంబంధించిన వెబ్ సైట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒకరోజు ముందుగానే.. అంటే సెప్టెంబర్ 30న లాంఛనంగా ప్రారంభించారు. ‘వైఎస్సార్ కళ్యాణమస్తు’’, ‘‘వైఎస్సార్ షాదీ తోఫా’’ పథకాలు దరఖాస్తు చేసుకునే వధూవరులిరువురుకీ టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత తప్పనిసరిగా ఉండాలి. చదువును ప్రొత్సహించేందుకే ఈ నిబంధనను తప్పనిసరిని చేసింది ప్రభుత్వం. ఇక వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18, వరుడి వయస్సు 21 ఏళ్లు ఖచ్చితంగా నిండాలని ప్రభుత్వం తెలిపింది. ఆర్థికసాయం భారీగా పెంపు గత ప్రభుత్వంతో పోలిస్తే.. వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అర్హులకు ఆర్థిక సాయం భారీగా పెంచింది. వైఎస్ఆర్ కళ్యాణమస్తులో భాగంగా ఎస్సీలకు రూ.1,00,000, ఎస్సీల కులాంతర వివాహాలకు రూ.1,20,000, ఎస్టీలకు రూ.1,00,000, ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1,20,000, బీసీలకు రూ.50,000, బీసీల కులాంతర వివాహాలకు రూ.75,000, వైఎస్సార్ షాదీ తోఫా కింద.. ముస్లిం మైనారిటీలకు రూ.1,00,000, దివ్యాంగుల వివాహాలకు రూ.1,50,000, వీళ్లకేగాక భవన నిర్మాణ కార్మికుల వివాహాలకు రూ.40,000 ల ఆర్థిక సాయాన్ని పెళ్లి కానుకగా అందించనుంది. -
పేదలంతా కళ్యాణమస్తు వినియోగించుకోండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణమస్తు పథకాన్ని పేదలంతా వినియోగించుకోవాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కోరారు. బీసీల కోసం సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఇందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం ఆర్.కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. బీసీల కోసం ఈ తరహా పథకం అమలు చేసిన ఏకైక సీఎంగా వైఎస్ జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అలాగే బీసీల రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టించారని ప్రశంసించారు. పార్లమెంట్లో బీసీ బిల్లుకు ఆమోదం పొందడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ముందుకు సాగుతోందన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారత చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ఏ పార్టీ సీఎం జగన్ లాగా నిర్ణయం తీసుకోలేదని గుర్తు చేశారు. బీసీల పార్టీలుగా చెప్పుకుంటున్న డీఎంకే, జనతాదళ్, ఎస్పీ ఎప్పుడూ బీసీల కోసం ఇలా చేయలేదన్నారు. నామినేటె?డ్ పోస్టుల్లో 50 శాతం వెనుకబడిన తరగతులకు కేటాయించడం దేశంలో ఎక్కడా లేదని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మద్దతు సీఎం జగన్‌కేనన్నారు. ఈ వర్గాల ప్రజలు సీఎంను ఆరాధిస్తున్నారన్నారు. పేదల సర్వతోముఖాభివృద్ధికి, వికాసానికి సీఎం జగన్ ఆలోచనలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లోనూ, అధికారంలోనూ బీసీలకు వాటా ఇచ్చిన చరిత్ర ఒక్క సీఎం జగన్‌కే దక్కిందన్నారు. వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాల్లోనే కాకుండా జిల్లా పరిషత్ చైర్మన్లుగా బలహీన వర్గాలకు అవకాశాలు ఇచ్చారని కొనియాడారు. -
షుక్రియా.. సీఎం సార్
కడప కార్పొరేషన్/సాక్షి, విశాఖపట్నం: పేదింటి యువతుల వివాహాలను గౌరవంగా జరిపించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెడుతున్న వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకంపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం కడపలో మహిళలు ‘కృతజ్ఞతా ర్యాలీ’ నిర్వహించారు. ‘షుక్రియా సీఎం సార్.. థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ నినాదాలు చేస్తూ.. సీఎం జగన్‌పై తమ అభిమానాన్ని చాటుతూ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ ఆడిటోరియం వద్ద ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా దీనిని ప్రారంభించారు. అలాగే విశాఖలోని లక్ష్మీటాకీసు వద్ద సీఎం జగన్ చిత్రపటానికి మహిళలు క్షీరాభిషేకం చేసి సంతోషం వ్యక్తం చేశారు. పేదల పెన్నిధి సీఎం క్షేమం కోరుతూ శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ సింహాచలం కొబ్బరికాయలు కొట్టారు. -
కల్యాణం కమనీయం.. థాంక్యూ జగనన్నా.. ( ఫొటోలు)
-
పేదలకు కొండంత భరోసా
సాక్షి, నెట్వర్క్ : పేద వర్గాలకు చెందిన యువతుల వివాహాలను గౌరవంగా జరిపించేందుకు, ఆ కుటుంబాలకు అండగా నిలిచేందుకు వీలుగా వచ్చే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెడుతున్న వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అలాగే, బాలికల్లో అక్షరాస్యత శాతం పెంపుదలే లక్ష్యంగా కనీసం పదవ తరగతి పాసయ్యే వరకు చదివించాలన్న నిబంధన విధించడంవల్ల ఆయా వర్గాల కుటుంబాలకు గొప్ప మేలు జరుగుతుందని విద్యా, సామాజిక రంగం నిపుణులు చెబుతున్నారు. ఇది అతిపెద్ద సామాజిక మార్పునకు నాంది పలికినట్లు అవుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. పలు జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సంబరాలు నిర్వహించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, నెడ్‌క్యాప్ చైర్మన్ కేకే రాజు ఆధ్వర్యంలో సీతమ్మధారలోని పార్టీ కార్యాలయం వద్ద వైఎస్సార్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. భీమిలిలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు క్యాంప్ కార్యాలయంలో వార్డు ఇన్చార్జ్ మైలపల్లి షణ్ముఖరావు, అధ్యక్షుడు అల్లిపల్లి నరసింగరావు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కూడా విశాఖ డెయిరీలోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కొత్త గాజువాక జంక్షన్‌లోని వైఎస్ విగ్రహం వద్ద 66వ వార్డు కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్, మైనార్టీ సెల్ నేత ఎస్ఎండీ గౌస్ ఆధ్వర్యంలో సీఎం జగన్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఘనంగా సంబరాలు నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో.. ఇక పాడేరు పాతబస్టాండులోని మహానేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహం ఎదుట వైఎస్సార్ కళ్యాణమస్తుకు మద్దతుగా విజయోత్సవాన్ని నిర్వహించారు. పాడేరు ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆదేశాల మేరకు ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ తమర్భ నర్సింగరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అలాగే, జీకే వీధి మండల కేంద్రంలో ఎంపీపీ బోయిన కుమారితో పాటు ఇతర నేతలు, చింతపల్లిలో మార్కెట్ కమిటి చైర్పర్సన్ జల్లి హలియారాణి, సర్పంచ్ దురియా పుష్పలత, ఇతర నేతలు, కొయ్యూరులో ఎంపీపీ రమేష్ ఆధ్వర్యంలోను, జి.మాడుగులలో మార్కెట్ కమిటి చైర్పర్సన్ మత్స్యరాస గాయత్రి, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, జిల్లా మైనార్టీ సంఘం అధ్యక్షులు ఎస్కే నాగూర్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నేతలంతా సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అలాగే, అరకులోయలోని ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ క్యాంపు కార్యాలయంలోనూ ఇదే తరహాలో సంబరాలు నిర్వహించారు. మిగిలిన మండలాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. రంపచోడవరం నియోజకవర్గంలోని రాజవొమ్మంగి మండలం దోనెలపాలెం గ్రామంలో ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఇతర నేతలంతా ఘనంగా వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా వేడుకలు నిర్వహించారు. సీఎం నిర్ణయంపై హర్షం ఇక వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫాను సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎస్.కోట, పార్వతీపురం ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు పిలుపునిచ్చారు. పథకాల అమలును స్వాగతిస్తూ సాలూరు మండలంలోని మామిడిపల్లి, చీపురుపల్లి మండల పరిషత్ కార్యాలయం ఆవరణ, సీతానగరం మండలంలోని జానుముల్లువలస, కొత్తవలస పంచాయతీ ప్రజలు సీఎం జగన్ చిత్రపటాలకు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు సోమవారం క్షీరాభిషేకాలు చేశారు. పేదలకు ఉపయోగపడే పథకాలు అమలుచేస్తున్న ముఖ్యమంత్రిని మనసారా అభినందించారు. -
పేదింటి అమ్మాయిలకు అండగా..
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): పేదింటి అమ్మాయిలకు అండగా ఉండటానికే సీఎం జగన్మోహన్రెడ్డి కల్యాణమస్తు, షాదీతోఫాను అమలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ 8వ డివిజన్ అధ్యక్షులు యలమంచలి జయ తెలిపారు. సున్నంబట్టీల సెంటర్ అశోక్‌నగర్‌లోని పార్టీ డివిజన్ కార్యాలయం ఆవరణలో వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీతోఫా పథకాలను ప్రకటించినందుకు కృతజ్ఞతగా సీఎం జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి ఆదివారం మహిళలతో కలిసి ఆయన క్షీరాభిషేకం చేశారు. డివిజన్ నాయకులు ఝాన్సీ, జైహింద్‌రావు, సాయి, రవి, కొల్లి అజయ్, శ్వేత తదితరులు పాల్గొన్నారు. పటమట(విజయవాడ తూర్పు): దేశానికి దార్శనికుడు సీఎం జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త తాటికొండ రంగబాబు అన్నారు. ఆదివారం పటమటలోని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి పిల్లల వివాహాలకు ఆర్థిక భారం తప్పించడానికి గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా రెండింతల సొమ్మును అర్హులైన ప్రతి కుటుంబానికి అందజేస్తున్న ఘనత సీఎం జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కేవలం జన్మభూమి కమిటీల పేరుతో బినామీలకు, వారి కార్యకర్తలకు మాత్రమే ఇచ్చి ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. ఆత్మగౌరవంతో బడుగు బలహీన వర్గాలు, దళిత మైనారిటీలు సగర్వంగా తలెత్తుకుని జగనన్న ప్రభుత్వంలో బతుకుతున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇది కూడా చదవండి: రెచ్చగొట్టి.. రెచ్చిపోయారు -
పేదిళ్లలో పెళ్లి సందడి..బాలికల విద్యకూ ప్రోత్సాహం!
సాక్షి, అమరావతి: పేద వర్గాల యువతుల వివాహాలకు అండగా నిలవడంతో పాటు బాలికల్లో అక్షరాస్యత శాతం పెంపుదలే లక్ష్యంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాను అమలు చేస్తామని ప్రకటించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మిక వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అయితే శనివారం విడుదలైన జీవోలో పథకం విధివిధానాలు వెల్లడిస్తూ.. ‘పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి’ అన్నదాన్ని ‘పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి’ అని సవరిస్తూ ఆదివారం సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు (కొరిజెండమ్) జారీ చేసింది. ఈ నిబంధనకు 2024 వరకు మినహాయింపు లేదని పేర్కొంది. పేద బాలికల వివాహాలకు ఆర్థిక సాయం అందించడమే కాకుండా బాలికల విద్యను ప్రోత్సహించడానికే ఈ నిబంధనను విధించింది. బాలికలు కోరుకున్న విద్యా స్థాయికి చేరుకునే విధంగా ప్రోత్సహించడంలో భాగంగా అర్హతల్లో దొర్లిన తప్పును సరిచేశారు. తద్వారా అతిపెద్ద సామాజిక మార్పునకు నాంది పలికినట్లైందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. పేద వర్గాల చదువుల కోసం ప్రభుత్వం ఇప్పటికే అమ్మ ఒడి, విద్యా కానుక, నాడు–నేడు, గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన.. తదితర ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కనీసం పదవ తరగతి పాసయ్యే వరకు చదివించడం అన్నది తప్పనిసరి చేయడం వల్ల ఆయా వర్గాల కుటుంబాలకు గొప్ప మేలు జరుగుతుందని విద్యా రంగం, సామాజిక రంగం నిపుణులు చెబుతున్నారు. అన్ని వర్గాల్లోనూ ఆనందం ‘పెళ్లి చేయాలంటే ఎన్ని వ్యయ ప్రయాసలు పడాలో నాకు తెలుసు. అదే పేదోళ్ల ఇంట్లో పెళ్లి అంటే ఆనందం మాటేలా ఉన్నా అప్పుల తిప్పలు తప్పవు. అందుకే పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు.. అని పెద్దలు అనేవారు. అలా అప్పులపాలు కాకుండా ఆనందాల అనుభూతులను మిగిల్చేలా ప్రభుత్వం అమలు చేయనున్న కళ్యాణమస్తు పథకం అండగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆడ పిల్ల ఉన్న ప్రతి పేదింట్లో పెళ్లి సందడి తేనుండటం పట్ల ఆడపిల్ల తల్లిగా చాలా ఆనందంగా ఉంది’ అని ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన గృహిణి దేవకి ముద్రబోయిన ఆనందం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ హామీని అమలు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ శుభవార్త చెప్పడంతో రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలతోపాటు భవన నిర్మాణ కారి్మకులు, వికలాంగుల కుటుంబాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అక్టోబర్ 1 నుంచి అమలు చేయనున్న ఈ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పేద ఆడపిల్లల కుటుంబాలు అప్పులపాలు కాకుండా గౌరవప్రదంగా వివాహం జరిపించేందుకు ఈ పథకాలు తోడ్పడనున్నాయి. ఇక అప్పుల ఊబిలో ఇరుక్కోరెవరూ.. అనేక కుల వృత్తులపై ఆధారపడి జీవించే వెనుకబడిన వర్గాల్లో పెళ్లి చేయాలంటే పడే కష్టాలు వర్ణనాతీతం. బీసీల్లో చాలా మంది తమ ఆడబిడ్డ కాపురం బాగుండాలని అప్పోసప్పో చేసి మరీ పెళ్లిళ్లు చేస్తున్నారు. నగా నట్రా, దుస్తుల కొనుగోలు, ఏర్పాట్లు తదితరాలకు అప్పు చేయక తప్పని పరిస్థితి. పేదలు కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ పథకాలను ప్రకటించడం గొప్ప విషయం. గతంలో చంద్రబాబు హడావుడిగా రూ.35 వేలు ప్రకటించారు కానీ, అమలు చేయలేదు. సీఎం వైఎస్ జగన్ మాత్రం ఇచ్చిన హామీని ఆచరణలో చూపిస్తూ రూ.50 వేలు అందించనున్నారు. బీసీ కులాంతర వివాహాలకు చంద్రబాబు ఆరంభ శూరత్వంగా రూ.50 వేలు ప్రకటించారు. కానీ అమలు చేయలేదు. సీఎం వైఎస్ జగన్ రూ.75 వేలు అందించనుండటం అభినందనీయం. బీసీలు పెళ్లి పేరుతో అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఈ పథకాలు ఎంతగానో దోహదం చేస్తాయి. – వేముల బేబీరాణి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఏపీ బీసీ సంఘం ఎస్సీల ఇంట నిజమైన పెళ్లి సందడి రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమించినా కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టంగా ఉండే ఎస్సీల ఇంట్లో పెళ్లి చేయడం అంటే చాలా భారం. ఎస్సీల ఇళ్లలో పెళ్లికి చందాలు, అప్పులు చేయక తప్పని దయనీయ స్థితి గతంలో ఎక్కువ. ఇప్పటికీ చాలా చోట్ల ఉంది. అంబేడ్కర్ మహనీయుడి రాజ్యాంగంతో ఎస్సీలు అనేక రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటే వైఎస్సార్ పుణ్యమా అని ఆర్థికంగా ఊతమిచ్చారు. తండ్రి కంటే రెండు అడుగులు ముందుంటానని చెప్పిన సీఎం వైఎస్ జగన్ ఎస్సీల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబు ఎస్సీల పెళ్లికి రూ.40 వేలు, కులాంతర వివాహానికి రూ.75 వేలు ప్రకటించి అమలు చేయలేదు. సీఎం వైఎస్ జగన్ మాత్రం మాటలతో సరిపెట్టకుండా ఆచరణలోకి తెచ్చేలా కళ్యాణమస్తు ద్వారా ఎస్సీలకు రూ.లక్ష, కులాంతర వివాహానికి రూ.1.20 లక్షలు ప్రకటించడం గొప్ప విషయం. – నత్తా యోనారాజు, జాతీయ అధ్యక్షుడు, పీవీరావు మాల మహానాడు గిరిజనులకు గొప్ప వరం అడవుల్లో, మైదాన ప్రాంతాల్లో జీవించే గిరిజనులు దాదాపు అందరూ నిరుపేదలే. బతుకుదెరువే కష్టమనుకునే తరుణంలో వారింట్లో పెళ్లి తంతు మరీ కష్టం. చాలా మంది గిరిజనులు పెళ్లి ఖర్చులకు కూడా లేక అవస్థలు పడేవారు. అటువంటి వారికి కళ్యాణమస్తు పేరుతో సీఎం వైఎస్ జగన్ గొప్పవరం ఇచ్చారు. గత ప్రభుత్వం గిరిజనుల పెళ్లికి రూ.50 వేలు, కులాంతర వివాహాలకు రూ.75 వేలు ప్రకటించి మమ అన్పించింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సీఎం వైఎస్ జగన్ ఎస్టీల పెళ్లికి రూ.1 లక్ష, కులాంతర వివాహానికి రూ.1.20 అందించనుండటం అభినందనీయం. – వడిత్యా శంకర్ నాయక్, గిరిజన నాయకుడు గత ప్రభుత్వంలో కాగితాలకే పరిమితం గత ప్రభుత్వం ఆర్భాటం జాస్తి.. ఆచరణ నాస్తి అనే రీతిలో వ్యవహరించింది. ఎన్నికల ముందు హడావుడిగా పథకాలను ప్రకటించిన చంద్రబాబు వాటిని అమలులోకి తేకుండా కాగితాలకే పరిమితం చేశారు. కానీ, మేనిఫెస్టోను ఖురాన్, భగవద్గీత, బైబిల్‌గా అత్యంత పవిత్రంగా భావించిన సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ‘వైఎస్సార్ షాదీ తోఫా’ పథకాన్ని ప్రకటించడం గొప్ప విషయం. మేనిఫెస్టోకు విశ్వసనీయత అద్దడంలో సీఎం వైఎస్ జగన్ చేతల్లో మరోసారి చూపించారు. మైనార్టీలకు చంద్రబాబు రూ.50 వేలు ప్రకటించి ఇవ్వకపోగా, సీఎం వైఎస్ జగన్ ఏకంగా రూ.లక్షకు పెంచి అందించేందుకు చర్యలు చేపట్టడం అభినందనీయం. – షేక్ మునీర్ అహ్మద్, కన్వీనర్, ముస్లీం జాయింట్ యాక్షన్ కమిటీ భవన నిర్మాణ కార్మికుల ఇంట్లో పెళ్లికి భరోసా నిర్మాణ రంగంలో సర్వశక్తులు ధారపోస్తూ ఆరోగ్యాన్ని సైతం కోల్పోతున్న భవన నిర్మాణ కార్మికులకు సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారు. భవన నిర్మాణ కార్మికులు తమ ఇంట్లో పెళ్లికి అప్పులపాలు కాకుండా భరోసా ఇచ్చారు. కళ్యాణమస్తు పథకం ద్వారా రూ.40 వేలు అందించేలా చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉంది. గత ప్రభుత్వం రూ.20 వేలు ప్రకటించి దరఖాస్తు చేసుకొమ్మని చెప్పిందే కానీ ఆర్థిక సాయం అందించలేదు. భవన నిర్మాణ కార్మికులకే కాకుండా దివ్యాంగులకు సైతం అండగా నిలిచేలా వారి పెళ్లికి రూ.1.50 లక్షలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టిన సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసు చాటుకున్నారు. – తాళం మావుళ్లు, భవన నిర్మాణ కార్మికుడు, మహాదేవపట్నం, పశ్చిమగోదావరి జిల్లా బలహీన వర్గాలకు గొప్ప వరం వైఎస్సార్ కళ్యాణమస్తు పథకం బలహీన వర్గాలకు గొప్ప వరం అని ఏపీ బీసీ సంఘం ఉద్ఘాటించింది. ఎన్నికల హామీని ఆచరణలోకి తేస్తూ గొప్ప పథకాన్ని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఏపీ బీసీ సంఘ రాష్ట్ర సమావేశం తీర్మానం చేసింది. విజయవాడలోని సంఘ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.మారేష్ అధ్యక్షతన ఆదివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు బీసీ నేతలు మాట్లాడుతూ.. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాధీ తోఫా పథకాలు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు భవన కార్మికుల కుటుంబాలకు ఒక భరోసా ఇస్తాయన్నారు. ఈ వర్గాలు అప్పులపాలు కాకుండా ఆత్మగౌరవాన్ని కాపాడిన నేతగా సీఎం వైఎస్ జగన్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని కితాబిచ్చారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రచార కమిటీ చైర్మన్ జక్కా శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యాక్షుడు తమ్మిశెట్టి రాము, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగితా అజయ్, ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కరణం అశోక్ మాట్లాడారు. వైఎస్సార్ విగ్రహానికి, సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ఫథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా ముస్లిం మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐహెచ్ ఫరూఖ్ ఆధ్వర్యంలో బీచ్‌రోడ్డులో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి, సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ముస్లిం మహిళలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్, మాజీ వుడా చైర్మన్ రెహా్మన్ తదితరులు పాల్గొన్నారు. -
Andhra Pradesh: అక్టోబర్ 1 నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మరో కీలక హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమల్లోకి తీసుకువచ్చారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాను అమలు చేసేలా సమగ్ర మార్గదర్శకాలతో కూడిన జీవోను సాంఘిక సంక్షేమ శాఖ శనివారం జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగుల, భవన నిర్మాణ కార్మికుల పేద అమ్మాయిల వివాహాలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, ముస్లిం మైనారిటీ పేద అమ్మాయిల పెళ్లిళ్లకు వైఎస్సార్ షాదీ తోఫా అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దీంతో సీఎం జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.44 శాతం అమలు చేసినట్లయ్యింది. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా అత్యంత పవిత్రంగా భావిస్తామని చెప్పడమే కాకుండా ఇచ్చిన మాట మేరకు ఆచరణలో అమలు చేసి చూపించారు. దేశ రాజకీయాల్లో మేనిఫెస్టోకు విశ్వసనీయత అంటే ఇలా ఉండాలని చాటి చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కేవలం కొన్ని వర్గాలకే ప్రకటించి అమలు చేయకుండా కాగితాలకే పరిమితం అయిన పెళ్లి కానుకను ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అర్హులైన వారందరికీ వర్తించేలా వైఎస్సార్ కళ్యాణ మస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలను అమలోకి తెచ్చింది. పేద వర్గాల అమ్మాయిల పెళ్లిళ్లకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. గత చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన దాని కన్నా ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికంగా వివాహ నగదు బహుమతిని ఇస్తోంది. గత సర్కారు బీసీలకు మొండిచేయి ► గత ప్రభుత్వంలో పెళ్లి కానుక అన్ని వర్గాలకు వర్తింప చేయలేదు. 2017లో బీసీలను పథకంలో చేర్చినప్పటికీ వారికి పెళ్లి కానుక డబ్బులివ్వకుండా గత ప్రభుత్వం మొండిచేయి చూపించింది. 2018–19 నాటికి 17,909 జంటలకు చంద్రబాబు సర్కారు పెళ్లి కానుక డబ్బులు రూ.68.68 కోట్లను ఎగనామం పెట్టింది. ► గత ప్రభుత్వంలో పెళ్లి కానుక మార్గదర్శకాలు కూడా సమగ్రంగా లేవు. లబ్ధిదారులకు ఇవ్వాలనే కోణంలో కాకుండా ఎలా ఎగనామం పెట్టాలనే కోణంలోనే నియమ నిబంధనలను రూపొందించింది. అయితే ఇప్పుడు వాటిన్నింటికీ మార్పులు చేసిన వైఎస్ జగన్ సర్కారు.. అర్హులైన వారందరికీ వర్తించేలా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. అర్హతలు, విధి విధానాలు ఇలా.. ► వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫాను అక్టోబర్ 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అమలు చేస్తారు. ఆ రోజు నుంచి నవశకం లబ్ధిదారుల మేనేజ్మెంట్ పోర్టల్ ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులను అహ్వానిస్తారు. ► వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18, వరుడి వయస్సు 21 ఏళ్లు నిండి ఉండాలి. తొలి వివాహానికి మాత్రమే అర్హత. ► వధువు, వరుడు పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి. (ఈ షరతుకు 2024 జూన్ 30 వరకు సడలింపు ఇస్తారు) ► వరుడు, వధువు ఇద్దరి కుటుంబాల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పది వేల రూపాయల్లోపు, పట్టణ ప్రాంతాల్లో 12 వేల రూపాయల్లోపు ఉండాలి. ► మూడు ఎకరాలకు మించి మాగాణి, లేదా పది ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండరాదు. మెట్ట, మాగాణి రెండు కలిపి పది ఎకరాల్లోపు ఉండొచ్చు. ► కుటుంబాల్లో సభ్యులెవ్వరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోగానీ, ప్రభుత్వ సంస్థల్లో గానీ, ప్రభుత్వ ఉద్యోగిగా, పెన్షర్గా ఉండకూడదు. అయితే పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంది. ► నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు (టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు) ► నెలవారీ విద్యుత్ వినియోగం (గత 12 నెలల సగటు) 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. ► ఏ కుటుంబమూ ఆదాయపు పన్ను చెల్లింపుదారు కాకూడదు. ► మునిసిపల్ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మించిన ఆస్తిని కలిగి ఉండకూడదు. ► ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకం నిర్వహణ ఉంటుంది. -
ఏపీలో మరో భారీ సంక్షేమ పథకం.. అక్టోబర్ 1 నుంచి అమలు
సాక్షి, తాడేపల్లి: ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 98.44 శాతం అమలు చేసి.. సంక్షేమ అమలులో తన చిత్తశుద్ధి చూపించుకుంది వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం. తాజాగా ఏపీలో మరో భారీ సంక్షేమ పథకానికి కసరత్తులు పూర్తి చేసింది. మరో కీలక హామీని నెరవేరుస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు అమలు చేయనుంది. బీసీ, ఎస్పీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన కార్మిక కుటుంబాలకు ఈ పథకం వర్తించనున్నాయి. పేద ఆడపిల్ల కుటుంబాలకు బాసటగా ఉండేందుకు, గౌరవప్రదంగా వివాహం జరిపించేందుకు తోడ్పాటుగా ఈ పథకాన్ని జగన్ సర్కార్ అమలు చేయనుంది. అంతేకాదు.. ఈ పథకం కింద గత ప్రభుత్వం ప్రకటించిన దానికంటే అధికంగా నగదు సాయం అందించనుంది. ఎస్సీలకు వైఎస్సార్ కల్యాణమస్తు కింద లక్ష రూపాయలు ఎస్సీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు ఎస్టీలకు వైఎస్సార్ కల్యాణమస్తు కింద లక్ష రూపాయలు ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు బీసీలకు వైఎస్సార్ కల్యాణమస్తు కింద రూ.50వేలు బీసీల కులాంతర వివాహాలకు రూ.75వేలు మైనారిటీలకు షాదీ తోఫా కింద లక్ష రూపాయలు. దివ్యాంగులు వివాహాలకు రూ. 1.5 లక్షలు భవన నిర్మాణ కార్మికుల వివాహాలకు రూ.40వేలు ఆర్థిక సాయం అందించనుంది వైఎస్ జగన్ ప్రభుత్వం. బాబు హయాంలో.. ఆర్భాటం జాస్తి... అమలు నాస్తి దేశ రాజకీయాల్లో మేనిఫెస్టోకు విశ్వసనీయత అద్దిన సీఎం వైఎస్ జగన్.. రాజకీయాల్లో అంకిత భావానికి, నిబద్ధతకు ప్రతిరూపంగా నిలిచారు. గత ప్రభుత్వంలో కాగితాలకే పరిమితమైన సంక్షేమాన్ని.. ఇప్పుడు ఆచరణలో చూపిస్తున్నారు సీఎం జగన్. గత ప్రభుత్వంలోనూ ఇలాంటి పథకం ఉన్నా.. అది కేవలం కాగితాలకే పరిమితం అయ్యింది. పైగా అన్నివర్గాల లబ్ధిదారులకు ప్రభుత్వం తరపున పెళ్లి కానుక లభించలేదు. ► 2017లో బీసీలను పథకంలో చేర్చిన నాటి చంద్రబాబు ప్రభుత్వం.. పెళ్లికానుక అందించలేదు. ► నాటి మార్గదర్శకాల్లోనూ సమగ్రత లేదు ► లబ్ధిదారులకు ఇవ్వాలన్న కోణంలో కాకుండా, ఎలా ఎగ్గొట్టాలన్న కోణంలో నియమాలు, నిబంధనలు కానీ.. అర్హులందరికీ వర్తించేలా పథకాన్ని తీర్చిదిద్దిన వైయస్.జగన్ సర్కార్. గత ప్రభుత్వం ప్రకటించిన దానికంటే అధికంగా నగదు. ఒక్కసారి పోల్చి చూస్తే.. ► ఎస్సీలకు వైఎస్ఆర్ కల్యాణమస్తు కింద రూ. 1లక్ష రూపాయలు.. గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ. 40వేలు ► ఎస్సీల కులాంత వివాహాలకు జగన్ సర్కార్ సాయం రూ. 1.2 లక్షలు.. చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది రూ.75వేలు ► ఎస్టీలకు వైఎస్ఆర్ కల్యాణమస్తు కింద రూ. 1 లక్ష.. గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.50వేలు ► ఎస్టీల కులాంతర వివాహాలకు జగన్ సర్కార్ సాయం రూ.1.2 లక్షలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ. 75వేలు ► బీసీలకు వైఎస్ఆర్ కల్యాణమస్తు కింద రూ. 50వేలు.. గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.35వేలు ► బీసీల కులాంతర వివాహాలకు జగన్ సర్కార్ సాయం రూ.75వేలు.. గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ. 50వేలు ► మైనార్టీలకు వైఎస్ఆర్ షాదీ తోఫా కింద రూ. 1 లక్ష.. గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.50వేలు ► దివ్యాంగుల వివాహాలకు జగన్ ప్రభుత్వ సాయం రూ. 1.5 లక్షలు.. గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ. 1లక్ష మాత్రమే. అలాగే.. భవన నిర్మాణ కార్మికులకు జగన్ ప్రభుత్వం రూ.40వేలు ప్రకటిస్తే.. గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.20వేలే ప్రకటించింది. అన్ని అర్హతలను జీవోలో పొందుపరిచిన ఏపీ ప్రభుత్వం.. పథకానికి సంబంధించి పూర్తిగా వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి తేనుంది. అంతేకాదు.. వాటి ద్వారా పథకం నిర్వహణ చేపట్టనుంది. -
ఆగస్టు 7న టీటీడీ ఆధ్వర్యంలో ఉచిత వివాహాలు
కడప కల్చరల్: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ సహకారంతో కల్యాణమస్తు పేరిట వినూత్న కార్యక్రమాన్ని రూపుదిద్దారు. వివాహాలు చేసుకోవడం ఆర్థికంగా భారం అయిన కుటుంబాలు, పేదలు ఈ కార్యక్రమం ద్వారా వారి బిడ్డలకు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా వివాహాలు చేసుకునే సౌకర్యం కల్పించారు. తిరుమలేశుని సన్నిధిలో ఉంచి పూజించిన వివాహ సామగ్రిని నూతన జంటలకు ఉచితంగా అందజేసేవారు. వాటిలో ముఖ్యంగా బంగారు తాళిబొట్టు, నూతన వస్త్రాలు, బాసికాలతోపాటు మంగళ వాయిద్యాలు, పురోహితులను కూడా ఉచితంగా ఏర్పాటు చేసేవారు. డాక్టర్ వైఎస్సార్ ఆకస్మిక మరణంతో ఆ తర్వాత ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని కొనసాగించలేకపోయాయి. ప్రస్తుత తరుణంలో పిల్లల వివాహాలు చేయడం పేదలకు అసాధ్యమవుతుండగా మధ్యతరగతి కుటుంబాలను అప్పుల పాలు చేస్తోంది. ఈ పరిస్థితి మార్చాలని మధురమైన ఈ కల్యాణ ఘట్టాన్ని మరుపురానిదిగా మార్చాలని ప్రస్తుత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తిరిగి చేపట్టింది. ఈనెల 29వ తేదీనుంచి శ్రావణమాసం ప్రారంభం కానుంది. ఆగస్టు 7న రాష్ట్ర మంతటా సామూహికంగా కల్యాణమస్తు కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికారులు ఇప్పటికే విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణ తేదీకంటే ముందుగానే కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. నియమ నిబంధనలు ఇవీ! ► వధూవరుల ప్రస్తుత ఫొటోలు దరఖాస్తుకు జతపరచాలి. ► విడివిడిగా ఉన్న దరఖాస్తు కాలమ్‌లో వధూవరుల పూర్తి పేరు, వయస్సు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, కులం, గోత్రం, మతం, విద్యార్హతలు, వృత్తి, వారివారి పూర్తి చిరునామాను పొందు పరచాల్సి ఉంది. వధూవరులు విడివిడిగా వారి మొబైల్ ఫోన్ నంబర్లను నమోదు చేయాలి. ► స్వీయ అంగీకార పత్రంలో తాము భారతీయ హిందువులని, వెంకటేశ్వరస్వామిపై పూర్తిగా భక్తివిశ్వాసాలు ఉన్నాయని, ఇద్దరం హిందూ సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోదలిచామని స్పష్టం చేయాల్సి ఉంది. ► జులై 31 నాటికి వధువుకు 18, వరుడికి 21 సంవత్సరం ఉన్నట్లు రుజువు చేయాల్సి ఉంది. ► వివాహం నాటికి తామిద్దరం మేజర్లమని, ఎలాంటి మానసిక సమస్యలు లేవని సగోత్రికులం కాదని స్పష్టం చేయాలి. ► ఉభయుల తల్లిదండ్రులు, పెద్దల అంగీకారంతోనే ఈ వివాహం చేసుకుంటున్నామని, ఇంతకుముందు తమకు వివాహం కాలేదని సెక్షన్–8 హిందూ వివాహ చట్టం–1955 ప్రకారం రిజిష్టర్ చేయించుకునే బాధ్యత తమదేనని తెలపాలి. ► న్యాయ, ధర్మబద్ధంగా వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తామని, వివాహం కుదుర్చుకోవడంలో బాధ్యత తమదేనని టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని తెలుపుతున్నట్లు వధూవరులతోపాటు వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సంతకం చేయాల్సి ఉంటుంది. ► వధూవరుల వయస్సు నిర్ధారణ కోసం స్కూలు సర్టిఫికెట్ లేదా ఆధార్‌కార్డు జతపర్చాలి. తల్లిదండ్రుల ఆధార్ ప్రతులను కూడా జత చేయాలి. ► వధూవరులు వేర్వేరు మండలాలకు చెందిన వారైతే తహసీల్దార్ ధ్రువీకరణ పొందాలి. (క్లిక్: కర్రసాములో ప్రత్యేకత చాటుకుంటున్న మంగంపేట) -
తిరుమలలో కళ్యాణమస్తుకు ముహూర్తం ఫిక్స్! ఆ రోజునే పెళ్లిళ్లు..
సాక్షి, తిరుమల: పేదవారికి అండగా ఉండడానికి కళ్యాణమస్తూ కార్యక్రమాన్ని పున:ప్రారంభిస్తున్నామని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఇవాళ ఉదయం అభిషేక సేవలో స్వామివారిని దర్శించుకున్న టిటిడి చైర్మన్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 7వ తేదిన 26 జిల్లాలో కళ్యాణమస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆగస్టు 7వ తేదిన ఉదయం 8 నుంచి 8:17 నిముషాల మధ్య పండితులు మహూర్తం నిర్ణయించారని, కలెక్టర్ కార్యాలయాలు, ఆర్డిఓ కార్యాలయాల్లో వివాహ జంటలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని టిటిడి చైర్మన్ తెలిపారు. నక్షత్ర యుక్త సింహలగ్నంలో సామూహిక వివాహాలు జరిపిస్తామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు వస్తే ఆయా ప్రాంతాలలో కూడా కళ్యాణమస్తూ కార్యక్రమాన్ని టిటిడి నిర్వహించేందుకు సిద్దంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. చదవండి👇కవల కానిస్టేబుళ్లు.. రోజూ చూస్తున్నా సరే.. కనుక్కోవడం కష్టమే సుమా! ఈ నెల 7న ‘వైఎస్సార్ యంత్ర సేవ’ ప్రారంభం . @AndhraPradeshCM శ్రీ @ysjagan గారి ఆదేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 7వ తేదీ టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణమస్తు ఉచిత సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నాము. — Y V Subba Reddy (@yvsubbareddymp) June 3, 2022 -
ప్రతి నియోజకవర్గంలో కల్యాణమస్తు
తిరుపతి ఎడ్యుకేషన్: టీటీడీ తలపెట్టిన ఉచిత సామూహిక వివాహాల (కల్యాణమస్తు) కార్యక్రమాన్ని కోవిడ్–19 నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని పరిపాలనా భవనంలో మంగళవారం కల్యాణమస్తు కార్యక్రమంపై అధికారులతో ఆయన సమీక్షించారు. మే 28న మధ్యాహ్నం 12.34 నుంచి 12.40 గంటల మధ్య సామూహిక వివాహాలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించినట్లు తెలిపారు. కల్యాణమస్తు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ల సహకారం కోరుతూ లేఖలు రాయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో కనీసం 300 జంటలకు వివాహాలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనికోసం జంటల నమోదు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన్నారు. వివాహం చేసుకునే జంటలకు రెండు గ్రాముల మంగళ సూత్రం, వస్త్రాలు, వెండి మెట్టెలు, పుస్తక ప్రసాదం, శ్రీపద్మావతి శ్రీనివాసుల ల్యామినేషన్ ఫోటో, భోజన ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. -
ఘనంగా లక్ష్మీనరసింహ కళ్యాణం
-
శ్రీవారి సాక్షిగా... కల్యాణమస్తు!
భారతీయ ఆశ్రమ ధర్మాలకు ఊపిరి వంటిది వివాహ వ్యవస్థ. పవిత్రమైన ఈ వివాహ బంధం పటిష్టతకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గట్టి పునాదులు వేసింది. పెళ్లి వేడుకల వల్ల పేద కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా కల్యాణమస్తు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏడుకొండల వాడి ఆశీస్సులతో ఇప్పటివరకూ ఏడడుగులు వేసిన జంటలు వేలల్లో ఉన్నాయి. సనాతన హైందవ ధర్మాలను విస్తృతం చేయటమే తిరుమల తిరుపతి దేవస్థానం లక్ష్యం. ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలను ఆరంభించి... ధర్మప్రచారం, శ్రీనివాసుని వైభవం, భక్తితత్వాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లటంలో టీటీడీ సఫలీకృతమవుతోంది. కల్యాణమస్తు కార్యక్రమం ద్వారా హిందూ వివాహ వ్యవస్థకు గట్టి పునాది వేసింది. పెళ్లి వేడుకల పేరుతో పేద కుటుంబాలు ఆర్థికంగా మరింత కుంగిపోకూడదని భావించిన ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి... రాష్ట్రంలోని పేదల్ని వివాహ బంధంతో ఒక్కటి చేయాలని సూచన చేశారు. దాంతో అప్పటి టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి కల్యాణమస్తు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శ్రీవారి సాక్షిగా కలసిన బంధాలు! శ్రీవేంకటేశ్వరస్వామి దివ్యాశీస్సులతో 2007 ఫిబ్రవరి 22వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఆరు విడతల్లో 45,209 జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. 10 తెలంగాణ జిల్లాల్లో అత్యధికంగా 21,198 మంది ఒక్కటవగా, తొమ్మిది జిల్లాలు కలిగిన కోస్తాంధ్రలో 17,307 జంటలు, రాయలసీమ ప్రాంతంలో మొత్తం 6,704 జంటలు వివాహం చేసుకున్నారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 7 వేల వివాహాలు జరిగాయి. సామూహికంగా నిర్వహించిన ఈ కల్యాణమస్తులో ఒక్కో వివాహానికి టీటీడీ రూ.7 వేలు ఖర్చు చేసింది. పెళ్లికి అవసరమైన పూజా సామగ్రి నుంచి పసందైన విందు భోజనం వరకు అన్నీ ధార్మిక సంస్థే ఉచితంగా అందజేసింది. నూతన వధూవరులకు ఇచ్చిన బంగారు తాళిబొట్లు, వెండి మట్టెలు, కంకణాలు, వధూవరులకు నూతన వస్రాలు, పూజా సామగ్రి, ధార్మిక స్తోత్ర పుస్తకాలకు తిరుమల ఆలయంలోని గర్భాలయ మూలమూర్తి పాదాల వద్ద, ఆ తర్వాత లోకమాత తిరుచానూరు అలమేలుమంగమ్మ పాద పద్మాల చెంత పూజలు చేసి పంపిణీ చేశారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లోని టీటీడీ కల్యాణమండపాల్లోనూ, ఆలయాల్లోనూ వివాహ తంతును వేడుకగా నిర్వహించారు. వధూవరుల బంధువులకు ఉచిత విందు భోజనాన్ని స్వామి ప్రసాదంగా టీటీడీ సమకూర్చింది. తర్వాత వధూవరులు, వారి తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం కల్పించి ఆశీస్సులు అందించింది. పేద కుటుంబాల్లో ఆనందోత్సాహం పేదల పక్షపాతి అయిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదరణ, తిరుమలేశుని ఆశీస్సులతో రాష్ట్రంలోని 23 జిల్లాల్లోనూ కల్యాణమస్తు ద్వారా ఒక్కటైన పేద కుటుంబాలు నేడు పిల్లాపాపలతో కళకళలాడుతున్నాయి. సంతానం, సౌభాగ్యం, ఆనందోత్సాహాలతో వారి జీవితాలు వర్థిల్లుతున్నాయి. శ్రీనివాసస్వామి, పద్మావతి అమ్మవారి దీవెనలతో పెళ్లి కావటం వల్ల తమకు పుట్టిన సంతానానికి శ్రీనివాసుడు, వేంకటేశ్వరుడు, మహాలక్ష్మి, పద్మావతి అంటూ వారి పేర్లు పెట్టుకుని మురిసిపోతున్నారు. మరికొందరైతే రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానంతో తమ కొడుకులకు ఆయన పేరు పెట్టుకున్నామని ఆనంద వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఏడుకొండలవాడి ఆశీస్సులతో పెళ్లి చేసుకున్నాం. స్వామి పాదాల వద్ద ఉంచిన తాళిబొట్లు, మట్టెలు, బట్టలు కానుకగా అందాయి. మాకిప్పుడు ఇద్దరు పిల్లలు... షర్మిల, శ్రావణి’’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు పశ్చిమగోదావరి జిల్లా కాపవరంలో పేద వర్గానికి చెందిన వీర్రాజు, స్వాతి. ‘‘రాజన్న చల్లని దీవెనలతో మా పెళ్లి విశాఖపట్నం టీటీడీ కల్యాణమండపంలో జరిగింది. మాలాంటి వారు ఇబ్బంది పడకూడదనే రాజశేఖరరెడ్డిగారు ఈ కార్యక్రమాన్ని పెట్టించారు. మాకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆయనకు, ఏడుకొండలవాడికి రుణపడి ఉన్నాం’’ అన్నారు కొత్త పరదేశిపాళెం నివాసి, ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్‌లో క్యూరేటర్‌గా పనిచేస్తున్న కృష్ణారావు, ఆయన భార్య రామలక్ష్మి. వీళ్లు మాత్రమే కాదు... కళ్యాణమస్తు ద్వారా వైవాహిక బంధాన్ని ముడి వేసుకున్నవారు ఎందరో ఉన్నారు. వారందరూ చెప్పేది ఒక్కటే. ఏడుకొండలవాడి ఆశీర్వాదం, రాజన్న అండ లేకుంటే మేమిలా ఉండేవాళ్లం కాదు అని! శుభమస్తు... కళ్యాణమస్తు..! ఆరువిడతల్లో జరిగిన కల్యాణమస్తు వివరాలివి 1. 2007, ఫిబ్రవరి 22న 4658 2. 2007, ఆగస్టు 26న 8113 3. 2008, మార్చి 9న 6373 4. 2008, నవంబరు2న 7090 5. 2009- అక్టోబరు 28న 7724 6. 2011 మే 20న 11,251 మొత్తం 45,209