నెల్లూరులోని గాం«దీ»ొమ్మ సెంటర్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న ప్రజలు
సాక్షి, నెట్‌వర్క్ : పేద వర్గాలకు చెందిన యువతుల వివాహాలను గౌరవంగా జరిపించేందుకు, ఆ కుటుంబాలకు అండగా నిలిచేందుకు వీలుగా వచ్చే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెడుతున్న వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అలాగే, బాలికల్లో అక్షరాస్యత శాతం పెంపుదలే లక్ష్యంగా కనీసం పదవ తరగతి పాసయ్యే వరకు చదివించాలన్న నిబంధన విధించడంవల్ల ఆయా వర్గాల కుటుంబాలకు గొప్ప మేలు జరుగుతుందని విద్యా, సామాజిక రంగం నిపుణులు చెబుతున్నారు.
ఇది అతిపెద్ద సామాజిక మార్పునకు నాంది పలికినట్లు అవుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. పలు జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సంబరాలు నిర్వహించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, నెడ్‌క్యాప్ చైర్మన్ కేకే రాజు ఆధ్వర్యంలో సీతమ్మధారలోని పార్టీ కార్యాలయం వద్ద వైఎస్సార్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
భీమిలిలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు క్యాంప్ కార్యాలయంలో వార్డు ఇన్‌చార్జ్ మైలపల్లి షణ్ముఖరావు, అధ్యక్షుడు అల్లిపల్లి నరసింగరావు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కూడా విశాఖ డెయిరీలోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కొత్త గాజువాక జంక్షన్‌లోని వైఎస్ విగ్రహం వద్ద 66వ వార్డు కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్, మైనార్టీ సెల్ నేత ఎస్‌ఎండీ గౌస్ ఆధ్వర్యంలో సీఎం జగన్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఘనంగా సంబరాలు నిర్వహించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో..
ఇక పాడేరు పాతబస్టాండులోని మహానేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహం ఎదుట వైఎస్సార్ కళ్యాణమస్తుకు మద్దతుగా విజయోత్సవాన్ని నిర్వహించారు. పాడేరు ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆదేశాల మేరకు ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ తమర్భ నర్సింగరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
అలాగే, జీకే వీధి మండల కేంద్రంలో ఎంపీపీ బోయిన కుమారితో పాటు ఇతర నేతలు, చింతపల్లిలో మార్కెట్ కమిటి చైర్‌పర్సన్ జల్లి హలియారాణి, సర్పంచ్ దురియా పుష్పలత, ఇతర నేతలు, కొయ్యూరులో ఎంపీపీ రమేష్ ఆధ్వర్యంలోను, జి.మాడుగులలో మార్కెట్ కమిటి చైర్‌పర్సన్ మత్స్యరాస గాయత్రి, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, జిల్లా మైనార్టీ సంఘం అధ్యక్షులు ఎస్‌కే నాగూర్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నేతలంతా సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
అలాగే, అరకులోయలోని ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ క్యాంపు కార్యాలయంలోనూ ఇదే తరహాలో సంబరాలు నిర్వహించారు. మిగిలిన మండలాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. రంపచోడవరం నియోజకవర్గంలోని రాజవొమ్మంగి మండలం దోనెలపాలెం గ్రామంలో ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఇతర నేతలంతా ఘనంగా వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా వేడుకలు నిర్వహించారు.
సీఎం నిర్ణయంపై హర్షం
ఇక వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫాను సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎస్.కోట, పార్వతీపురం ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు పిలుపునిచ్చారు.
పథకాల అమలును స్వాగతిస్తూ సాలూరు మండలంలోని మామిడిపల్లి, చీపురుపల్లి మండల పరిషత్ కార్యాలయం ఆవరణ, సీతానగరం మండలంలోని జానుముల్లువలస, కొత్తవలస పంచాయతీ ప్రజలు సీఎం జగన్ చిత్రపటాలకు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు సోమవారం క్షీరాభిషేకాలు చేశారు. పేదలకు ఉపయోగపడే పథకాలు అమలుచేస్తున్న ముఖ్యమంత్రిని మనసారా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment