పేదింటి అమ్మాయిలకు అండగా..   | AP People Happiness On Kalyanamastu And Shaaditofa | Sakshi
Sakshi News home page

పేదింటి అమ్మాయిలకు అండగా..  

Published Mon, Sep 12 2022 7:21 AM | Last Updated on Mon, Sep 12 2022 8:38 AM

AP People Happiness On Kalyanamastu And Shaaditofa - Sakshi

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): పేదింటి అమ్మాయిలకు అండగా ఉండటానికే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కల్యాణమస్తు, షాదీతోఫాను అమలు చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ 8వ డివిజన్‌ అధ్యక్షులు యలమంచలి జయ తెలిపారు. సున్నంబట్టీల సెంటర్‌ అశోక్‌నగర్‌లోని పార్టీ డివిజన్‌ కార్యాలయం ఆవరణలో వైఎస్సార్‌ కల్యాణమస్తు, షాదీతోఫా పథకాలను ప్రకటించినందుకు కృతజ్ఞతగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి ఆదివారం మహిళలతో కలిసి ఆయన క్షీరాభిషేకం చేశారు. డివిజన్‌ నాయకులు  ఝాన్సీ, జైహింద్‌రావు, సాయి, రవి, కొల్లి అజయ్, శ్వేత తదితరులు పాల్గొన్నారు.

పటమట(విజయవాడ తూర్పు): దేశానికి దార్శనికుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని వైఎస్సార్‌ సీపీ బీసీ విభాగం తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త తాటికొండ రంగబాబు అన్నారు. ఆదివారం పటమటలోని వైఎస్సార్‌ సీపీ బీసీ విభాగం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

రాష్ట్రంలో పేద, మధ్య తరగతి పిల్లల వివాహాలకు ఆర్థిక భారం తప్పించడానికి గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా రెండింతల సొమ్మును అర్హులైన ప్రతి కుటుంబానికి అందజేస్తున్న ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు.  చంద్రబాబు ప్రభుత్వం కేవలం జన్మభూమి కమిటీల పేరుతో బినామీలకు, వారి కార్యకర్తలకు మాత్రమే ఇచ్చి ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. ఆత్మగౌరవంతో బడుగు బలహీన వర్గాలు, దళిత మైనారిటీలు సగర్వంగా తలెత్తుకుని జగనన్న ప్రభుత్వంలో బతుకుతున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.  

ఇది కూడా చదవండి: రెచ్చగొట్టి.. రెచ్చిపోయారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement