MLA Jogu Ramanna Car Hit Divider While Going To Nagpur - Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం

Published Thu, Jun 15 2023 2:30 PM | Last Updated on Thu, Jun 15 2023 2:41 PM

MLA Jogu Ramanna Car Hit Divider While Going To Nagpur - Sakshi

సాక్షి, ముంబై: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జోగు రామన్నకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ఎన్‌హెచ్‌-44పై ఎద్దులను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో జోగు రామన్న ‍స్వల్పంగా గాయపడ్డారు. దీంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పండ్రకవడలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జోగు రామన్నకు తృటిలో ప్రమాదం తప్పింది. ఎన్‌హెచ్‌-44పై ఎద్దులను తప్పించబోయి కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే రామన్నకు స్వల్పగాయాలయ్యాయి. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఎమ్మెల్యే రామన్న, మాజీ ఎంపీ నగేష్‌ ఉన్నారు. అయితే, వీరు నాగపూర్‌ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం, ఎమ్మెల్యే జోగు రామన్న మరొక వాహనంలో​ నాగపూర్‌ వెళ్లిపోయారు.

ఇది కూడా చదవండి: లిఖితది ఆత్మహత్య కాదు.. ప్రమాదం: వీసీ వెంకట రమణ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement