మాట్లాడుతున్న ఏఎంసీ మాజీ చైర్మన్ తల్లెల చంద్రయ్య
జైనథ్: రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న సహకారంతో ఆదిలాబాద్ నియోజకవర్గంలో వేల కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఏఎంసీ మాజీ చైర్మన్ తల్లెల చంద్రయ్య అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదిలాబాద్‌కు వచ్చిన సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి రూ.250 కోట్లు మంజూరు చేయాలని మంత్రి జోగురామన్న కోరగా, స్పందించిన ముఖ్యమంత్రి నిధుల మంజూరుకు జీఓ జారీ చేశారన్నారు. ఈ నిధులతో గ్రామాల్లో మౌలిక వసతులైన సీసీ రోడ్లు, మురికి కాల్వలు, లింక్ రోడ్లు, గ్రావెల్ రోడ్లు, ఇతరత్ర అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. నిధులు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రి జోగు రామన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నియోజకవర్గంలో 51వేల ఎకరాలకు సాగునీరు అందించే కోరటా–చనాఖా బ్యారేజీ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నా యని తెలిపారు. ఎన్నికల్లోగా సాగునీరు అందిం చడం జరుగుతుందన్నారు. ఇవే కాకుండా వందల కోట్లతో గ్రామాల్లో బీటీ రోడ్లు నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు. 70 ఏళ్లుగా జరగని అభివృద్ధిని నాలుగేళ్లలో చేసి చూపించిన ఘనత మంత్రి జోగు రామన్నకే దక్కుతుందన్నారు. ప్రజలంతా అభివృద్ధికి పట్టం కట్టి రానున్న అన్నిఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీనే భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. సమావేశంలో ఐటీడీఏ డైరెక్టర్ పెందూర్ దేవన్న, జైనథ్ ఏఎంసీ వైస్ చైర్మన్ ఎల్టీ భూమారెడ్డి, ఎంపీటీసీల సంఘం మండల గౌరవ అధ్యక్షుడు మద్దెల ఊశన్న, ఆలయ కమిటీ వైస్ చైర్మన్ లక్ష్మన్న, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, నాయకులు అల్లకొండ అశోక్, తమ్మడి భగవాండ్లు, కోల భోజన్న, భట్టు ఊశన్న, వెంకట్‌రెడ్డి, కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment