పార్కుల అభివృద్ధికి 100 కోట్లు: జోగు రామన్న
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అర్బన్ పార్కుల అభివృద్ధి కోసం రూ.100 కోట్లు ఖర్చు చేయడానికి సీఎం సిద్ధంగా ఉన్నట్లు అటవీ శాఖ మంత్రి జోగురామన్న వెల్లడించారు. శనివారం మంత్రి జోగురామన్న, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, అటవీశాఖ ఉన్నతాధికారులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పార్క్‌ల్లో పర్యటించారు.
నగరం చుట్టుపక్కల సుమారు 99 పార్కులున్నాయని, గత పాలకుల నిర్లక్ష్యంతో వాటి అభివృద్ధి జరగలేదన్నారు. నగరం చుట్టూ పచ్చదనాన్ని పెంచి, అటవీ బ్లాక్‌లను మరింత అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం ఉందన్నారు. హైదరా బాద్‌ను ఆరోగ్యకర రాజధానిగా తీర్చిదిద్దడానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏల సమన్వయంతో ఈ కార్యక్రమాలు పూర్తి చేస్తామన్నారు.