ఉట్నూర్ : గిరిజన సంక్షేమ శాఖ ఆధీనంలోని ఆశ్ర మ పాఠశాలల సీఆర్టీ (కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు)లు శుక్రవారం రాత్రి దీక్షలు విరమించారు. సమస్యల పరిష్కారం కోసం 11రోజులుగా స్థానిక ఐటీడీఏ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి అటవీ,పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న దీక్షా శిబిరాన్ని సందర్శించారు. సమస్యల పరిష్కారానికి హామీనిచ్చి దీక్షలు విరమింపజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఆర్టీల సమస్యలను ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, పదిహేను రోజుల్లో సీఆర్టీల వేతనాలను ప్రభుత్వం పెంచుతుందని చెప్పారు. సీఆర్టీల్లో ఎస్జీటీలకు రూ.10,900, స్కూల్‌అసిస్టెంట్లకు రూ.14,860 పెంచుతామని హామీనిచ్చారు.
ఇందుకు సంబంధించిన విధివిధానాలను అధికారులు రూపొందించిన తర్వాత ప్రభుత్వం వేతన పెంపును అమలు చేస్తుందని చెప్పారు. క్రమబద్ధీకరణ అనేది ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ అని, అన్ని శాఖల్లో విధులు నిర్వర్తించే కాంట్రాక్టు ఉద్యోగులను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విధులు నిర్వర్తించే వారికి ఒకే విధమైన వేతనాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలు రూపొందించే అధికారుల కొరత ఉందని, స్వామినాథన్ కమిటీ ద్వారా ఉద్యోగుల విభజన పూర్తి కాగానే రాష్ట్రంలో సమస్యలు వేగంగా పరిష్కారం అవుతాయని వివరించారు.
11రోజుల దీక్ష కాలాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణించాలని ఐటీడీఏ పీవోకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఐటీడీఏ పీవో ప్రశాంత్‌పాటిల్, డీడీటీడబ్ల్యూ భీమ్, సీఆర్టీల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మర్సకొల తిరుపతి, ఉపాధ్యక్షుడు వసంత్‌కుమార్, అధ్యక్షుడు మునీనాయక్, కన్వీనర్ కమలాకర్, కోశాధికారి శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యుడు జగ్‌జీవన్, ఉట్నూర్ సర్పంచ్ బొంత ఆశరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు లక్కెరావ్, కందుకురి రమేశ్, టీడబ్ల్యూటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల విజయ్ శేఖర్, మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు ఆత్రం భూజంగ్‌రావ్, సీఆర్టీలు పాల్గొన్నారు.
పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ధర్నా
ఆదిలాబాద్ రూరల్ : సీఆర్టీల సమ్మె విరమింపజేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పట్టణంలోని కొమురం భీం చౌక్‌లో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పీడీఎస్‌యూ జిల్లా నాయకులు చంటి, రమేశ్, అరుణ్, మల్లేశ్, రాకే శ్ పాల్గొన్నారు.
సీఆర్టీల దీక్ష విరమణ
Published Sat, Dec 6 2014 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM
Advertisement
Advertisement