
సాక్షి, మంచిర్యాల : తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్నకు తృటిలో ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి జోగు రామన్న సోమవారం ఉదయం మంచిర్యాలకు వచ్చారు. ఆసుపత్రిని ప్రారంభించిన తర్వాత ఇతర విభాగాలను పరిశీలించేందుకు లిఫ్ట్‌లో వెళ్తుండగా లిఫ్ట్ వైర్ తెగిపడింది.
ఈ ప్రమాదంలో జోగు రామన్నకు ఎలాంటి గాయాలు అవ్వలేదు. లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన మంత్రి, మిగతా కార్యక్రమాల్లో యథావిధిగా పాల్గొన్నారు. సామర్ధ్యానికి మించి ఎక్కువ మంది లిఫ్ట్‌లో ఎక్కడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment