'బీసీ గురుకులాల‍్లో ఖాళీలు పూరిస్తాం'
Published Sat, Mar 18 2017 2:31 PM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM
హైదరాబాద్ : వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కాబోయే బీసీ గురుకుల విద్యాలయాల్లో సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. శనివారం ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు 119 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఇందులో 56 బాలురు, 63 బాలికల గురుకులాలను నిర్మిస్తామని తెలిపారు. బీసీ గురుకులాల ఏర్పాటుకు స్థలాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. బీసీల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని స్పష్టం చేశారు.
Advertisement
Advertisement