
సాక్షి, హైదరాబాద్: దేశం దశ మార్చేందుకే సీఎం కేసీఆర్ మూడో రాజకీయ ఫ్రంట్ ఆలోచన తెరపైకి తెచ్చారని బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు అన్నింటా విఫలమయ్యాయని దుయ్యబట్టారు.
బుధవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్సీ గంగాధర్ కలిసి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ గంగాధర్ మాట్లాడుతూ.. కేసీఆర్ దేశానికి నాయకత్వం వహిస్తే అగ్రరాజ్యాలతో పోటీపడి భారత్ అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment